- Home
- Entertainment
- పెళ్లి పీటలెక్కబోతున్న జాతిరత్నాలు బ్యూటీ..? ఫరియా అబ్ధుల్లా చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా..?
పెళ్లి పీటలెక్కబోతున్న జాతిరత్నాలు బ్యూటీ..? ఫరియా అబ్ధుల్లా చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా..?
జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా పెళ్ళి చేసుకోబోతుందా..? కెరీర్ ఇంకా ఊపు అందుకోకముందే.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి అని చూస్తుందా..? ఫరియా చేసుకోబోయే అబ్బాయి ఎవరు..? అసలు అందులో నిజం ఎంత..?

ఈ మధ్యకాలంలో ఫిల్మ్ సెలబ్రిటీల పెళ్లిల్లు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండేళ్ల నుంచి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం కూడా జరిగింది. అంతే కాదు రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ సైతం జరిగింది. ఇక త్వరలో సిద్దు జొన్నలగడ్డ పెళ్లి చేసకోబుతన్నట్టు వార్తలు వైరల్అవుతున్నాయి.
Faria Abdullah
ఈక్రమంలోనే మరో హీరోయిన్ పెళ్లి చూడా జరగబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అమే ఫరియా అబ్ధుల్లా. ఆమెను ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జాతిరత్నాలు సినిమాతో ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. కామెడీ పండిస్తూ.. హీరోయిన్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది బ్యూటీ.
Faria Abdullah
ఫరీయా అబ్దుల్లా..ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ . మరీ ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా క్రేజీ పబ్లిసిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ జాతి రత్నాలు అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని ఆమెకు ఆసినిమాల ద్వారా గుర్తింపు రాలేదు. జాతి రత్నాలతో మంచి పేరు వచ్చినప్పటికీ సరైనా అవకాశం మాత్రం రాలేదు ఫరియాకు. కెరీర్ ను కరెక్ట్ గా సెట్ చేసుకోలేకపోయింది బ్యూటీ.
దీంతో అడపాదడపా పలు ఈవెంట్స్ లో మెరుస్తూ వచ్చింది ఫరియా... మరీ ముఖ్యంగా ఆరడుగులుండే ఫరియా డాన్స్ కు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆహె బెల్లీ డాన్స్ వేస్తే కుర్రాళ్లు పూనకాలతో ఊగిపోతుంటారు. రీసెంట్గా ఫరీయా అబ్దుల్లా కి సంబంధించిన ఒక సెన్సేషనల్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేంటంటే.. ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అవును సినిమాలు పెద్దగా లేవు.. కాని ఆమె ప్రయత్నం చేస్తే మాత్రం మంచి కెరీర్ ఉంది ప్రస్తుతం ఫరియాకు. కాని అదేమి వద్దని ఆమె పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. తన స్నేహితడినే అనేది టాలీవుడ్ లో టాక్.
చిన్ననాటి నుంచి తనకు తెలిసిన తన సొంత ఫ్రెండ్ నే ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోయేది అంటూ.. ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఆయన షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేస్తూ ఉంటాడట . చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫరీయా అబ్దుల్లాకి అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది.
ఈ పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ ఏడాదే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటూ... సోషల్ మీడియాలో ఫరియా అబ్ధుల్లా పేరు మారుమోగిపోతోంది. మరి ఈ విషయం నిజం అయితే.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది.