జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు, అల్లు అర్జున్ ని ఆడేసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయికి అల్లు అర్జున్ ఆసరాగా నిలబడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పుష్ప నటుడు జగదీశ్ లైంగిక వేధింపుల వ్యవహారం తెరపైకి రాగా, అల్లు అర్జున్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Jani Master
జానీ మాస్టర్ ఉదంతం టాలీవుడ్ ని ఊపేస్తోంది. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గత నాలుగైదేళ్లుగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Jani Master
జానీ మాస్టర్ తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించారు. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు, అలాగే తన నివాసంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఆవేదన చెందారు. జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం క్రింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. నార్సింగ్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన యువతికి అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడనే న్యూస్ బయటకు వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా నువ్వు పని చేస్తావని అల్లు అర్జున్ హామీ ఇచ్చాడట. దీనిపై అధికారిక సమాచారం లేదు.
Jani Master controversy
ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. జానీ మాస్టర్ జనసేన క్రియాశీలక నేత. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విస్తృత ప్రచారం చేశాడు. దాంతో జానీ మాస్టర్ కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
జానీ మాస్టర్ అసిస్టెంట్ కి అల్లు అర్జున్ అండగా నిలవడం మంచి విషయమే. మరి పుష్ప నటుడు జగదీష్ వలన అన్యాయమైన యువతికి మీరు చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సిరీస్లో కీలక రోల్ చేస్తున్న జగదీశ్(కేశవ) ఒక అమ్మాయిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడని సమాచారం.
Jani Master controversy
జగదీష్ వేధింపులు తాళలేక ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జగదీష్ జైలు పాలయ్యాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. జగదీష్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న యువతికి అల్లు అర్జున్ ఏం న్యాయం చేశాడని యాంటీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాగే జగదీష్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అతన్ని పుష్ప మూవీలో నటుడిగా ఎలా కొనసాగించారు? అని ఎద్దేవా చేస్తున్నారు.
Jani Master controversy
ఇటీవల మెగా-అల్లు కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు తెలపడం మెగా ఫ్యామిలీకి నచ్చలేదు. జనసేన నేతలు అల్లు అర్జున్ మీద బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతికి అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడన్న వార్త...అగ్గి రాజేసింది.
Actress Samantha
మరోసారి పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. మరోవైపు అనసూయ, సమంత సదరు యువతికి తమ మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ మాదిరి.. తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు.
Poonam Kaur
అలాగే నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు చేసింది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేస్తే స్పందించలేదని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు. పూనమ్ కౌర్ ఆరోపణలపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఇప్పుడు ఫిర్యాదు చేసినా విచారణ చేపడతామని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. జానీ మాస్టర్ తో మొదలైన లైంగిక వేధింపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.