జానీ మాస్టర్ వెనుక కుట్ర జరుగుతోంది.. త్వరలో నిజాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతా, నిర్మాత కామెంట్స్
జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Jani Master
జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ తనని జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. కోర్టులో కూడా హాజరు పరిచారు. అయితే కోర్టు జానీ మాస్టర్ కి రిమాండ్ విధించింది.
కొన్నేళ్ల నుంచి తనని జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని, అత్యాచారం కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదంలో జానీ మాస్టర్ బాగా చిక్కుల్లో కూరుకుపోయారు. జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా జానీ మాస్టర్ కి మద్దతు తెలుపుతున్న వారు కూడా ఉన్నారు.
Jani Master
జానీ మాస్టర్ ని కావాలనే ఈ కేసులో ప్లాన్ ప్రకారం ఇరికించారని, దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తాజాగా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ పై పెద్ద కుట్ర జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా ఈ సంఘటన గురించి తెలుసుకుంటున్నా. ఆ అమ్మాయి తనపై 16 వ ఏట అత్యాచారం జరిగింది అని చెబుతోంది. 21 ఏళ్ళు వచ్చేవరకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు సైలెంట్ గా ఉంది. 18 ఏళ్ళ తర్వాత ఫిర్యాదు చేసి ఉండొచ్చు కదా.
జానీ మాస్టర్ ఇమేజ్ ని కావాలనే దెబ్బతీసే కుట్ర ఇది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అనే నిజాలు త్వరలోనే బయట పెడతా. ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరిస్తా అంటూ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అని సి కళ్యాణ్ అన్నారు. రేపో మాపో ఇంకొకరు వచ్చి కొన్నేళ్ల క్రితం ఫలానా హీరో , ఫలానా డైరెక్టర్ నన్ను వేధించాడు.. కొన్నేళ్ల క్రితం అని బ్లాక్ మెయిల్ కి దిగే అవకాశం ఉంది అని సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.