- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. ఆల్‌రెడీ పెళ్లి అయిపోయిందంటూ షాక్..
విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. ఆల్‌రెడీ పెళ్లి అయిపోయిందంటూ షాక్..
జాన్వీకపూర్ బాలీవుడ్ హాట్ సెన్సేషన్, విజయ్ దేవరకొండ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్. ఆ మధ్య విజయ్ దేవరకొండపై తన క్రష్‌ని బయటపెట్టిన జాన్వీ తాజాగా ఆయన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image: Janhvi Kapoor/Instagram
జాన్వీ కపూర్(Janhvi Kapoor) హాట్ ఫోటో షూట్లతో బాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. హద్దులు చెరిపే అందాల ప్రదర్శనతో ఆమె తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ సారి తన కామెంట్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్‌గా, సంచలనంగా మారాయి.
విజయ్ దేవరకొండకి ఆల్‌రెడీ మ్యారేజ్ అయిపోయిందంటూ ఆమె వ్యాఖ్యనించడం దుమారం రేపుతుంది. మరి ఆమె ఎందుకు అలా కామెంట్ చేసిందనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ `మిలి` అనే చిత్రంలో నటించింది. తనే మెయిన్ లీడ్. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది జాన్వీ.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండపై నోరు జారింది. ఆయన రిలేషన్‌షిప్‌పై కామెంట్ చేసింది. అందులో యాంకర్ మీకు స్వయంవరం పెడితే ఏ హీరోని ఎంపిక చేసుకుంటారు అని అడింది. అందులో రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, విజయ్ దేవరకొండ వంటి పేర్లు చెప్పారు. రణ్‌వీర్‌కి పెళ్లి అయిపోయిందనగా, విజయ్ దేవరకొండ పేరుని ప్రస్తావించారు యాంకర్. దీనికి జాన్వీ చెబుతూ, `ప్రాక్టీకల్లీ విజయ్‌కి పెళ్లి అయిపోయిందిగా` అని వ్యాఖ్యానించడం రచ్చ లేపుతుంది.
Image: Janhvi Kapoor/Instagram
మరి విజయ్ కి పెళ్లి అయిపోయిందని ఆమె ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. అదే సమయంలో ఆయనకు పెళ్లి కాలేదు కదా అని అడగ్గా, తన ఉద్దేశ్యం ఆయన తమ జాబితాలో లేదని, తమతో అంతగా పరిచయం లేదని ఆమె చెప్పడం గమనార్హం. అయితే జాన్వీ.. విజయ్‌కి పెళ్లి అయిపోయిందని ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా(Rashmika Mandanna) మధ్య లవ్ ఎఫైర్ ఉందని, వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య ఈ ఇద్దరు మాల్డీవులకు వెకేషన్ కూడా వెళ్లారు. ఒకేసారి వెళ్లడం, ఒకేసారి రావడంతో ఇద్దరి మధ్య రిలేషన్‌ని కన్ఫమ్ అయ్యిందనే కామెంట్లు వినిపించాయి. దానికి మరింత బలం చేకూరేలా ఇప్పుడు జాన్వీ వ్యాఖ్యానించడం పెద్ద హిట్ టాపిక్ అవుతుంది. మరి ఈ చర్చ ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మొదటగా `గీతగోవిందం` చిత్రంలో నటించారు. ఇందులో వీరి కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. పదిహేను కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా వంద కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ చిత్రంతో ఇద్దరు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`తో మరోసారి అలరించింది. ఈ సినిమా టైమ్‌లో వీరి మధ్య బాండింగ్ మరింత బలపడిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత నుంచే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు, కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతున్నారు. దీంతో ఆ వార్తలు కంటిన్యూ అవుతున్నాయి.
మరోవైపు జాన్వీ కపూర్ ప్రస్తుతం సింగిల్‌గానే ఉందట. తాజాగా ఇంటర్వ్యూలో తెలిపింది. తాను సింగిల్‌గానే ఉన్నానని, ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టం చేసింది. ఇటీవల జాన్వీ, ఒర్హాన్ అవత్రమణి ప్రేమలో ఉన్నారనే ఓ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులోనిజం లేదనే విషయాన్ని ఇప్పుడు పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది జాన్వీ.