- Home
- Entertainment
- 28 ఏళ్ల వయసులో 1000 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, ఇళ్లు, సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
28 ఏళ్ల వయసులో 1000 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, ఇళ్లు, సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
28 ఏళ్ల వయసులో 1000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉంది ఓయంగ్ హీరోయిన్, వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి, నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

స్టార్ కిడ్ ఆస్తి 1000 కోట్లు
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ కిడ్స్ చాలామంది ఉన్నారు. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన అందరికి లైఫ్ వస్తుందన్న నమ్మకంలేదు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తమను తాము నిరూపించుకునే పనిలో ఉన్నారు. అలాంటి పనిలోనే ఉంది ఓ హీరోయిన్. తల్లి వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చి, కమర్షియల్ హీరోయిన్ గా నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది. నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ బ్యూటీ.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం టాలీవుడ్ గుమ్మం తొక్కింది. 1000 కోట్లకు పైగా కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ ను ఏంజాయ్ చేస్తూనే.. ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
2018లో బాలీవుడ్ ఎంట్రీ
జాన్వీ కపూర్ 2018లో ధడక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మరికొన్ని రోజుల్లో తన కూతురిని హీరోయిన్ గా చూడాలి అనుకున్న ఆ సమయంలోనే, శ్రీదేవి హఠాత్ మరణం చోటుచేసుకుంది. తల్లి కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చిన జాన్వీ, తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహి, Mr. & Mrs. మాహి వంటి కథా బలం ఉన్న సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించింది. కానీ సాలిడ్ కమర్షియల్ సినిమాలు మాత్రం చేయలేదు జాన్వీ.
వేల కోట్ల ఆస్తులు
కేవలం 28 సంవత్సరాల వయసులో జాన్వీ కపూర్ వేల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ముంబైలోని బాంద్రాలో ఆమెకు ఉన్న విలాసవంతమైన ఇల్లు రూ.65 కోట్లు విలువ చేసేలా ఉంది. ఇది 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, స్విమ్మింగ్ పూల్, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సదుపాయాలతో నిర్మించబడింది. చెన్నైలో ఉన్న శ్రీదేవి కొనుగోలు చేసిన మరో భవనం కూడా జాన్వీ కుటుంబానికి ఉంది. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి, బీచ్ వ్యూ, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, కళాత్మక ఇంటీరియర్‌తో ఉండే విలాసవంతమైన ప్రాపర్టీ. ప్రస్తుతం దీనికి వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా. వీటితో పాటు హైదరాబాద్, తిరుపతి, ఇతర దేశాల్లో కూడా జాన్వీ కపూర్ పేరు మీద లగ్జరీ ఇళ్లు ప్రాపర్టీస్ ఉన్నాయని సమాచారం. అంతే కాదు జాన్వీ కపూర్ ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్లు ఉంటుందని సమాచారం.
కోట్ల విలువైన కార్ల కలెక్షన్
జాన్వీ కపూర్‌కు కార్లంటే చాలా ఇష్టం ఆమె గ్యారేజ్ లగ్జరీ కార్లతో నిండిపోయి ఉంది. జాన్వీ కపూర్ దగ్గర ఉన్న ముఖ్యమైన కార్లు, వాటి విలువ ఎంతంటే?
మెర్సిడెస్ మేబ్యాక్ S560 – 1.94 కోట్లు
బీఎండబ్ల్యూ X5 – 95 లక్షలు
లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 – 2.7 కోట్లు
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ – 1.62 కోట్లు
మెర్సిడెస్ GLE 250d – 67 లక్షలు
టాలీవుడ్ ఎంట్రీ, పాన్ ఇండియా టార్గెట్
తెలుగు సినీ పరిశ్రమ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుండటంతో, జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన జాన్వీ కపూర్, టాలీవుడ్ లో మాత్రం పక్కా కమర్షియల్ సినిమాలకు సైన్ చేస్తోంది. బోల్డ్ క్యారెక్టర్స్ తో రచ్చ చేస్తోంది. ఆమె తొలి తెలుగు చిత్రం దేవర, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందింది. ఈసినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కనిపించింది చాలా తక్కువే అయినా.. ఆమె పాత్ర ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. దేవర పార్టు 2 లో జాన్వీ పాత్ర ఎక్కువగా ఉంటుందని సమాచారం.
రామ్ చరణ్ జోడీగా
ప్రస్తుతం జాన్వీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కు భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినా, జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. తన తల్లి శ్రీదేవి కలల్ని నెరవేర్చేందుకు సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండే జాన్వీ, లగ్జరీ లైఫ్‌ను ఆస్వాదిస్తూ, స్టార్‌డమ్ కోసం నిరంతరం శ్రమిస్తోంది.