- Home
- Entertainment
- డెవిల్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఎగిసిపడే యవ్వనాలతో సెగలు పుట్టిస్తున్న స్టార్ కిడ్
డెవిల్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఎగిసిపడే యవ్వనాలతో సెగలు పుట్టిస్తున్న స్టార్ కిడ్
బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంటోంది జాన్వీ కపూర్. ఆమె క్రేజీ ఫోటో షూట్లతో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది. తరచూ అందాల దాడితో ఉక్కిరి బిక్కిరి చేసే ఈభామ ఇప్పుడు బయపెడుతుంది.

అందంతో కనువిందు చేసే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇప్పుడు అందంతో భయపెడుతుంది. హలోవీన్ లుక్‌లో కనిపించి ఫియర్ పుట్టిస్తుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. అందాల రాక్షసి తరహాలో ట్రీట్ ఇస్తూ పిచ్చెక్కిస్తుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె పంచుకునే ఫోటోలు ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి.
శనివారం సాయంత్రం ముంబయిలో సెలబ్రిటీలు హలోవీన్ బాష్(Janhvi Halloween Bash) పార్టీకి వెళ్లారు. ఇందులో జాన్వీ కపూర్ వంటి తారలు హలోవీన్ గెటప్‌లో మెరిశారు. అంతేకాదు ఓ వైపు ఎగిసిపడే అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఓ వైపు పార్టీలో రచ్చ చేస్తూనే మరోవైపు పిచ్చెక్కించే అందంతో మత్తెక్కిస్తుంది జాన్వీ. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ గ్లామర్ విందులో ముందే ఉంటుంది. అందాల ఆరబోతకి ఎప్పుడో హద్దులు చెరిపేసింది. మొదట్నుంచి ఆమె గ్లామర్ విందు వడ్డిస్తుంటుంది. సోషల్ మీడియాలో క్రేజ్‌కి ఏం కావాలో తెలుసుకున్న జాన్వీ అందాల విస్పోటనంతో క్రేజ్‌ని పెంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీ.
ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు ఇలా గ్లామర్ ట్రీట్‌తో కనువిందు చేస్తుంటుంది జాన్వీ. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న `మిలి` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. నవంబర్ 4న ఇది విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఈ అందాల భామ. అందుకే బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది.
అయితే ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది జాన్వీ కపూర్. కానీ ఏది సరైన బ్రేక్ ఇవ్వలేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడం, తండ్రి నిర్మాత బోనీ కపూర్ ఉండటంతో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. అయితే నటన పరంగా నాట్ బ్యాడ్ అనేలానే పేరుతెచ్చుకుంటుంది జాన్వీ. సినిమా సినిమాకి షైన్ అవుతుంది.
తాను స్టార్ కిడ్ అయినంత మాత్రాన ఇక్కడ ప్రతిభ ఉంటేనే నిలబడగలం అని, అందుకోసం నిత్యం శ్రమిస్తున్నానని చెబుతుంది జాన్వీ. తాను తెర వెనుక రాణించేందుకు ఎంతో ఒత్తిడికి గురవుతున్నామని, ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఈ స్థాయి గుర్తింపు సాధ్యమవుతుందని అంటోంది జాన్వీ. ఆ దిశగానే తాను రాణించేందుకు ప్రయత్నిస్తుంది.
అందుకే తాను ఒకేసారి భారీ చిత్రాలు చేయకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ ఓ మోస్తారు బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఒక్కో సినిమాతో తన నటనని మెరుగుపర్చుకుంటూ, తన ఇమేజ్‌ని పెంచుకుంటూ ఎదుగుతుంది జాన్వీ. ఆదర్శంగా నిలుస్తుంది.