MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Jananayagan Censor: సీఎం విజయ్ జననాయగన్ కు సెన్సార్ పూర్తయ్యిందా? A సర్టిఫికెట్ వార్తల్లో నిజమెంత?

Jananayagan Censor: సీఎం విజయ్ జననాయగన్ కు సెన్సార్ పూర్తయ్యిందా? A సర్టిఫికెట్ వార్తల్లో నిజమెంత?

దళపతి విజయ్ నటిస్తున్న 'జననాయగన్' సినిమాకు సెన్సార్ పూర్తయి 'A' సర్టిఫికెట్ వచ్చిందంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ రాలేదని చిత్రబృందం స్పష్టం చేసింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
'జననాయగన్' సెన్సార్ నిజంగానే అయ్యిందా?
Image Credit : Asianet News

'జననాయగన్' సెన్సార్ నిజంగానే అయ్యిందా?

తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ నటిస్తున్న 'జననాయగన్' సినిమాకు సెన్సార్ పూర్తయిందని, 'A' సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలన్నీ ఉత్త పుకార్లేనని ఇప్పుడు తేలిపోయింది. సెన్సార్ పనులు ముగిశాయి కాబట్టి జులైలోనే సినిమా రిలీజ్ పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి 'జననాయగన్' చిత్రానికి ఇంకా ఎలాంటి సర్టిఫికెట్ రాలేదని సినిమా టీమ్ వర్గాలు స్పష్టం చేశాయి. సెన్సార్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తేల్చి చెప్పాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మరి 'జననాయగన్' సినిమా పరిస్థితి ఏంటి?
Image Credit : KVN Productions

మరి 'జననాయగన్' సినిమా పరిస్థితి ఏంటి?

'జననాయగన్' సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ప్రస్తుతం సెన్సార్ బోర్డు అనుమతి కోసం టీమ్ ఎదురుచూస్తోంది. వచ్చే వారంలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఆశిస్తున్నారు. "మేము ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చే వారంలోగా వస్తుందని నమ్మకం ఉంది. సినిమాకు 'A' సర్టిఫికెట్ వచ్చిందనే వార్తలన్నీ వదంతులే. సర్టిఫికెట్ రాగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం" అని చిత్రబృందానికి చెందిన ఒకరు తెలిపారు.

Related Articles

Related image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Related image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
34
జులై రిలీజ్ వార్తలన్నీ అబద్ధమేనా?
Image Credit : KVN Productions

జులై రిలీజ్ వార్తలన్నీ అబద్ధమేనా?

మొదట 'జననాయగన్' సినిమాను జులై 16న రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కొన్ని కట్స్ సూచించి, CBFC ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ ఇచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ జులై 16 మిస్ అయితే, జులై 24న లేదా జులై 31న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అయితే, జులై 31న విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా 'సిగ్మా' రిలీజ్ అవుతుండటంతో ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని కూడా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారం లేదని స్పష్టమైంది.

44
పైరసీ దెబ్బ.. కోట్లలో వ్యూస్
Image Credit : Jana Nayagan X Page

పైరసీ దెబ్బ.. కోట్లలో వ్యూస్

'జననాయగన్' సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఏప్రిల్ 9న లీకైన ఈ సినిమాను సుమారు 1.20 కోట్ల మంది చట్టవిరుద్ధంగా చూశారని చెన్నై పోలీసులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ లీక్ కేసుకు సంబంధించి ఇప్పటికే 21 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ 'జననాయగన్' సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు 'భగవంత్ కేసరి' స్ఫూర్తితో తీస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే, మలయాళ నటి మమితా బైజు హీరోయిన్లుగా నటించారు. పూజా హెగ్డే 'కాయల్' అనే పాత్రలో, మమితా బైజు 'విజయలక్ష్మి' పాత్రలో కనిపించనున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved