Janaki Kalaganaledu: చదవకూడదని నిర్ణయం తీసుకున్న జానకి.. జ్ఞానాంబ మనసు మారనుందా?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ వాళ్ళ భర్త జ్ఞానాంబతో ,చిన్న తప్పు చేశాడని పేగు బంధాన్ని నువ్వు వదిలేసుకుంటావా?నీకు అబద్ధం చెప్పాడని చెప్పి రామని బాధ పెడుతున్నావు కానీ, నీ నమ్మకానికి జానకి ఆశకి మధ్య అతను ఎంత నలిగిపోతున్నాడో నీకు అర్థం కావడం లేదు. ఆ శ్రీరాముడైన తల్లి మాట జావదాటుతాడేమో కాని మన రాముడు నీ మాట జవదాటడు.
జానకి వచ్చిందని నీ మాటకు గౌరవించడం లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆ రోజు గుడిలో తన ప్రాణాలను పణంగా పెట్టి మన అందరి ప్రాణాలను కాపాడింది జానకి అని అంటాడు. జ్ఞానాంబ బాధతో, ఒకప్పుడు నాకు చెప్పకుండా పడుకోడానికి కూడా వెళ్లేవాడు కాదు. నాకు రామ అంటే అంత గుడ్డి నమ్మకం ఉండేది.ఇప్పుడు నన్నే గుడ్డిదాన్ని చేసేసాడు అని బాధపడుతుంది జ్ఞానాంబ.
ఎక్కడ జ్ఞానాంబ మనసు కరిగిపోతుందేమో అని మల్లికా భయపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఏం నిర్ణయం తీసుకున్న ఆలోచించే తీసుకుంటారు అలాంటి అత్తయ్య గారిని తప్పు పట్టడం ఎందుకు మావయ్య అని మల్లికా అంటుంది. మల్లికా వాళ్ళ మామయ్య మల్లికని నోరు విప్పితే చెంప పగులుతది అని గట్టిగా తిడతాడు మల్లికా వాళ్ళ భర్త కూడా మల్లికా నీ నోరు మూసుకో అని తిడతాడు. ఇంతట్లో జానకి, జ్ఞానాంబ కాళ్ళ మీద పడుతుంది.
మీరు నాకు ఏ శిక్ష వేసిన భరిస్తాను,నన్ను క్షమించండి ,అంతేగాని మీరు ఆయనతో మాట్లాడకుండా ఆయనకి పెద్ద శిక్ష వేయొద్దు అని ప్రాధేయపడుతుంది జానకి. రామ కూడా జ్ఞానాంబ ని బతిమిలాడుతాడు. ఆలోచనలలో పడుతుంది జ్ఞానాంబ. నా పంతం కోసం పిల్లలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని జ్ఞానాంబ మనసులో అనుకొని, జానకి దగ్గర నుంచి వాయనం పుచ్చుకుంటుంది. మల్లిక ముఖం మాడిపోతుంది.
జానకిరామాలు ఎంతో ఆనందపడి దేవుడికి నమస్కరిస్తారు. తర్వాత జానకి గదిలోకి వచ్చి తన తల్లిదండ్రులను గుర్తుచేసుకొని వాళ్లకి ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకొని మీకు ఇచ్చిన మాట నేను తీర్చలేకపోయాను వీధి నన్ను ఓడించింది మీరు నన్ను ఎంతో కష్టపడి చదివించాలి అనుకున్నారు కానీ మీ మరణం తో నా కళ అక్కడే ఆగిపోయింది అని బాధపదుతుంది.
రామా దగ్గరికి వెళ్లి నా చదువు కోసం మీరు ఎంతో బాధపడ్డారు , ఏనాడూ మీ అమ్మగారికి ఎదురు చెప్పని మీరు నావల్ల అత్తయ్యముందు దోషిగా నిలబడ్డారు నన్ను క్షమించండి అని బాధపడుతుంది. ఇంక మనము చదువు విషయం గురించి అత్తయ్య గారి ముందు తేకపోవడమే మంచిది అని అంటుంది ఈ మాటలన్నీ జ్ఞానాంబ మూల నుంచి వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!