- Home
- Entertainment
- Janaki Kalganaledu: జానకిను జంతువుతో పోల్చిన మల్లిక.. కూలి పనికి వెళ్లడానికి సిద్ధమైన రామచంద్ర!
Janaki Kalganaledu: జానకిను జంతువుతో పోల్చిన మల్లిక.. కూలి పనికి వెళ్లడానికి సిద్ధమైన రామచంద్ర!
Janaki Kalganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalganaledu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

మల్లిక (Mallika) ఇంటి పక్కన ఆవిడకు చెప్పుకుంటూ జానకికి వినపడేలా సిగ్గు శరం లేకుండా ఇక్కడే వేలాడుతున్నారు అని అంటుంది. అంతేకాకుండా ఆమె నా తోటి కోడలు కాదు. పెద్ద తోడేలు అంటూ జానకి (Janaki) ను అవమాన పరుస్తుంది.
ఇక అదే క్రమంలో మల్లిక (Mallika) జానకి దగ్గరికి వెళ్లి మా అత్తయ్య గారు నిన్ను ఇక్కడ కనిపించకుండా దూరంగా వెళ్ళమని చెప్పింది కదా.. మరి వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి సిగ్గు లేదా అని అంటుంది. ఇక మల్లిక మాటలతో అసహనం వ్యక్తం చేసిన జానకి (Janaki) మల్లికను చంప మీద కొట్టబోతుంది.
ఇక ఈ లోపు అక్కడకు జ్ఞానాంబ (Jnanaamba) వచ్చి నా కోడలు ఇద్దరూ కొట్టుకోవడానికి రోడ్డు మీదకు వచ్చారు అనే చెడ్డ పేరు నాకు తీసుకురావాలని చూస్తున్నావా అని జానకి పై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత స్వీట్ కొట్టు బాధ్యతను అఖిల్ (Akhil) ని చూసుకోమని జ్ఞానాంబ చెబుతుంది.
ఈ లోపు అక్కడికి జానకి (Janaki) వచ్చి అత్తయ్య గారు అఖిల్ బాగా చదువుతాడు. తనకి ఇప్పుడే ఈ భాద్యతలు అప్పగించ కూడదు అని చెబుతుంది. దాంతో జ్ఞానాంబ (Jnanaamba) మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎవరు నువ్వు అని అడుగుతుంది.
ఆ మాటతో జానకి (Janaki) ఎంతో బాధను వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా రామచంద్ర కూడా చాలా బాధ పడతాడు. ఆ క్రమంలో రామచంద్ర (Ramachandara) వాళ్ల అమ్మ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ మా కోసం చిన్నప్పుడు అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుంది అంటూ బాధపడతాడు.
ఆ తర్వాత దొరబాబు (Dhorababu) అనే వ్యక్తి రామచంద్ర కు కాల్ చేసి మా కార్ఖానాల్లో పని చేస్తావా అని ఆఫర్ చేస్తాడు. దాంతో రామచంద్ర ఎంతో ఆనంద పడుతూ ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. అంతేకాకుండా ఈ పని దొరకడానికి కారణం మా అమ్మ అని రామచంద్ర (Ramachandra) తన భార్యతో చెప్పుకుంటూ ఎంతో ఆనంద పడతాడు. ఈ విషయంతో జ్ఞానాంబ ఎలా స్పందిస్తుందో చూడాలి.