- Home
- Entertainment
- Jana Nayakudu: విజయ్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అప్పుడే కోటి మంది చూశారు.. సీఎంకు షాక్
Jana Nayakudu: విజయ్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అప్పుడే కోటి మంది చూశారు.. సీఎంకు షాక్
Jana Nayakudu: విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పైరసీ చేసిన ఈ సినిమాను ఏకంగా 1.2 కోట్ల (12 మిలియన్ల) మంది చూశారని పోలీసులు వెల్లడించారు.

విజయ్‌ను వీడని వివాదాలు
'జన నాయకుడు' సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు విజయ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భార్యతో విడాకులు, కెరూరు విషాదం, 'జన నాయగన్' వివాదం వంటివి ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. అన్ని అడ్డంకులను, వివాదాలను దాటుకుని ఆయన జనం మనసు గెలుచుకున్నారు. సీఎం అయ్యారు. అయినా ఆయన సినిమా విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.
పోలీసుల వాదన ఏంటి?
ఈ మూవీ వివాదానికి సంబంధించిన కేసులో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరి బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. పైరసీ చేసిన సినిమాను ఆన్‌లైన్‌లో 12 మిలియన్ల మంది చూశారని పోలీసులు చెప్పిన మాటను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
21 మందిపై కేసు నమోదు!
విజయ్ నటించిన 'జన నాయగన్'(జన నాయకుడు) సినిమాను ఆన్‌లైన్‌లో పైరసీ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫిర్యాదు మేరకు, చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు 21 మందిపై కేసు ఫైల్ చేసి, కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన రజనీకాంత్, జయప్రకాశ్ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది.

