Prema Entha Madhuram: భయంతో పరుగులు తీసిన మాన్సీ.. కొనఊపిరితో ఆర్య!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అసూయతో రగిలిపోతూ ఇంటిని నరకంగా మారుస్తున్న ఒక పెద్దింటి కోడలు కధ ఈ సీరియల్. ఈరోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో డెలివరీ టైం దగ్గర పడింది మీరందరూ ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోండి అని చెప్తుంది డాక్టర్. సర్ మీరు మాత్రం ఇక్కడే ఉండండి అంటూ ఆర్యని రిక్వెస్ట్ చేస్తుంది అను. తప్పకుండా ఉంటాను భయపడకు అంటాడు ఆర్య. సార్ మీరు ఆ పెయిన్స్ చూసి తట్టుకోలేరు పానిక్ అయిపోతారు అంటూ ఆర్యని కూడా వెళ్ళిపోమంటుంది డాక్టర్.
అందుకు ఒప్పుకోడు ఆర్య. ఆర్య ఇక్కడే ఉంటే అనుకి రాజనందినిని ఆవహించేలాగా చేయడం అవ్వదు అనుకుంటాడు జలంధర్. నేను లోపలే ఉన్నాను మీ బావ గారిని ఎలాగైనా బయటికి తీసుకెళ్ళు అని మాన్సీకి మెసేజ్ పెడతాడు. అప్పుడు జలంధర్ ని గమనిస్తుంది మాన్సీ. ఎలా ఆర్య ని బయటికి రప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఒక సిస్టర్ దగ్గరికి వెళ్లి ఐ సి యు లో ఉన్న వ్యక్తి తాలూకా బ్లడ్ నాకు కావాలి అంటుంది.
కుదరదు అంటుంది సిస్టర్. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటూ వెంట వెంటనే ఆమె అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసి ఎవరికి చెప్పను నాకు ఈ హెల్ప్ చేయండి అంటుంది మాన్సీ. డబ్బులకి ఆశపడిన సిస్టర్ భయపడుతూనే ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది. నీరజ్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్లి మీ ఎవరిలో అయినా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఉన్నారా అని అడుగుతుంది.
మా దాదా ఉన్నారు అంటాడు నీరజ్. అర్జెంటుగా ఒక పేషెంట్ కి అవసరం ఆ బ్లడ్ కావాలి అంటుంది సిస్టర్. అర్జెంట్ అంటున్నారు కదా వెళ్లి ఆర్యని అడుగు లేకపోతే నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపు నేను ఇస్తాను అంటుంది శారదమ్మ. అదే విషయాన్ని ఆర్యకి చెప్తాడు నీరజ్. అమ్మ వద్దు నేను బ్లడ్ ఇస్తాను అంటాడు ఆర్య. అదే విషయాన్ని అను చెప్పి 10 నిమిషాల్లో వచ్చేస్తాను ధైర్యంగా ఉండు అంటాడు.
మీరు వచ్చేవరకు పెయిన్స్ రావడానికి వచ్చే ఇంజక్షన్ ఇవ్వద్దని చెప్పండి అంటుంది అను. అక్కడే ఉన్న డాక్టర్ సరే అంటుంది. ఆర్య వెళ్ళిన తర్వాత జలంధర్ అనుకి ఇంజక్షన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు. అను ఎంత చెప్తున్నా వినిపించుకోడు. జలందర్ ని గుర్తు పడుతుంది అను. అప్పుడే ఆమెకి రాజనందిని ఆవహిస్తుంది. జలంధర్ మీద విరుచుకుపడుతుంది.
ఆమెని అలా చూసి అందరూ నిర్ధాంత పోతారు. డాక్టర్లందరినీ ఒక్క తోపు తోసి జలంధర్ ని చితక్కొడుతుంది. బయటనుంచి ఈ హడావిడి చూసిన అంజలి ఆశ్చర్య పోతుంది అను ఎందుకలా బిహేవ్ చేస్తుంది అని శారదమ్మని అడుగుతుంది. ఆమె ఒంట్లోకి రాజనందిని ఆవహించింది అని చెప్తుంది శారదమ్మ. వెళ్లి తొందరగా ఆర్యని తీసుకురా అని నీరజ్ ని పంపిస్తుంది.
ఆర్య వెళ్లి నీరజ్ కి విషయం చెప్తాడు. బ్లడ్ డొనేట్ చేస్తున్న ఆర్య కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. దారిలో వినాయకుడు కి దండం పెట్టుకొని అక్కడ ఉన్న బొట్టు పట్టుకొని అను దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆవేశంగా జలంధర్ మీద అటాక్ చేస్తున్న అనుని అతి కష్టం మీద కూర్చోబెట్టి ఆమెకి బొట్టు పెడతాడు ఆర్య. జలంధర్ ని చూపిస్తూ స్పృహ కోల్పోతుంది అను.
ఆర్య వెళ్లి నీరజ్ కి విషయం చెప్తాడు. బ్లడ్ డొనేట్ చేస్తున్న ఆర్య కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. దారిలో వినాయకుడు కి దండం పెట్టుకొని అక్కడ ఉన్న బొట్టు పట్టుకొని అను దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆవేశంగా జలంధర్ మీద అటాక్ చేస్తున్న అనుని అతి కష్టం మీద కూర్చోబెట్టి ఆమెకి బొట్టు పెడతాడు ఆర్య. జలంధర్ ని చూపిస్తూ స్పృహ కోల్పోతుంది అను.
అప్పుడు జలంధర్ ని గుర్తుపడతాడు ఆర్య. పారిపోతున్న జలంధర్ ని పట్టుకొని బయటికి తీసుకు వస్తాడు. జెండే కి విషయాన్ని చెప్తాడు. నువ్వు అను దగ్గర ఉండు వీడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు జెండే. వద్దు వీడొక్కడే వచ్చాడో లేకపోతే వీటితో పాటు ఇంకెవరైనా వచ్చారు ఎంక్వయిరీ చేయించు వీడి సంగతి నేను చూస్తాను అంటూ జలంధర్ ని అక్కడి నుంచి తీసుకుపోయి చావచిదగ్గొడతాడు.
ఇదంతా చూసిన మాన్సీ భయంతో పరుగులు తీస్తుంది. అదే సమయంలో అనుకి నొప్పులు ప్రారంభమవుతాయి. మరో పక్కన నా బిడ్డ ప్రాణం పోసుకుంటున్న రోజు అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను అంటూ రాడ్ విసిరేసి వచ్చేస్తాడు ఆర్య. అయితే అదే రాడ్ తో జలంధర్ ఆర్య తలపగలగొడతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.