- Home
- Entertainment
- Jailer 2 Movie 5 Days Collections: జైలర్ 2 5 రోజుల వసూళ్లు.. రజనీకాంత్ మూవీ బాక్సాఫీసు దుమారం
Jailer 2 Movie 5 Days Collections: జైలర్ 2 5 రోజుల వసూళ్లు.. రజనీకాంత్ మూవీ బాక్సాఫీసు దుమారం
సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్నారు. ఆయన నటించిన `జైలర్ 2` మూవీ నాన్ స్టాప్‌గా దూసుకుపోతుంది. ఐదో రోజు సోమవారం కూడా వసూళ్ల రికార్డు సృష్టించింది.

సంచలనాల దిశగా రజనీకాంత్ జైలర్ 2
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` రూపొందిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్ జే సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్ చేశారు. దసరా పండగ స్పెషల్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడుతుంది. సరికొత్త రికార్డుల దిశగా వెళ్తోంది. సోమవారం కూడా ఈ సినిమాకి సంచలన వసూళ్లు రావడం విశేషం.
జైలర్ 2 ఐదు రోజుల కలెక్షన్లు
రజనీకాంత్ `జైలర్ 2` మూవీ సోమవారం కూడా బాక్సాఫీసుని షేక్ చేసింది. ఐదో రోజు ఈ సినిమాకి ఇండియాలో రూ.42.35కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్ లో పది కోట్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమాకి రూ.477.75కోట్లు రావడం విశేషం. తెలుగులో దీనికి రూ.7.15కోట్లు వచ్చాయి. తమిళంలో ఐదో రోజు రూ.31.40 రావడం విశేషం. ఇక ఐదు రోజుల్లో ఇండియాలో రూ.283.75కోట్ల గ్రాస్ రాగా, రూ.242.25కోట్ల నెట్ రాబట్టింది. ఓవర్సీస్‌లో దీనికి రూ.194కోట్లు వచ్చాయి. మంగళవారంతో ఈ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్‌లో చేరబోతుందని చెప్పొచ్చు.
జైలర్ 2 కి లాభాల పంట
`జైలర్ 2` మూవీకి దాదాపు రూ.300కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం. దీనికి రూ.300 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌గా లెక్క కట్టారు. సినిమా హిట్ కావాలంటే దాదాపు ఆరువందల కోట్ల గ్రాస్ రావాలి. ఇంకా రూ.130కోట్లు వస్తే సినిమా సేఫ్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి ఓటీటీ రూపంలో భారీగానే వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్‌గా వెయ్యి కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ద్వారా నిర్మాతకి నాలుగు నుంచి ఐదు వందల కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితుల అంచనా. ఇది తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలవబోతుందని సమాచారం.
ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా `2.0`, `జైలర్` చిత్రాలున్నాయి. ఇప్పుడు వీటి రికార్డులను బ్రేక్ చేయబోతుంది. అదే సమయంలో తమిళంలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లు టచ్ చేసిన సినిమా లేదు. ఆ లోటుని రజనీకాంత్ `జైలర్ 2` తీర్చబోతుందని సమాచారం. ఈ సినిమా జోరు చూస్తుంటే అది ఈజీగానే దాటేస్తుందని సమాచారం. మరి ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.

