Guppedantha Manasu: శృతి మించిన శైలేంద్ర శాడిజం.. నిజం తెలుసుకొని షాకైన వసు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని తల్లడిల్లిపోతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రెండు ఉంగరాలు తీసుకుందాము ఒకటి ఆర్ వి రెండోది వి ఆర్ అంటాడు రిషి. అప్పుడు రెండు సిమిలర్గా అయిపోతాయి ఆర్ డి అని లెటర్స్ వచ్చేలాగా తీసుకుందాము రిషిధారలు అని అర్థం వస్తుంది అంటుంది వసు. ఆ పేరుని వసు చేతి మీద రాస్తాడు రిషి. చాలా బాగుంది అంటూ ముద్దు పెట్టుకుంటుంది వసు. ఐ వాంట్ టు దట్ స్వీట్ నెస్ అంటూ రిషి కూడా ఆ చేతిని ముద్దు పెట్టుకుంటాడు.
మరోవైపు శైలేంద్ర వింత ప్రవర్తనకి టెన్షన్ పడుతూ ఉంటుంది జగతి. అంతలోనే అక్కడికి వచ్చిన శైలేంద్ర ఏంటో చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. అదంతా పక్కన పెట్టి పదా మనం కూడా షాపింగ్ కి వెళ్దాం అంటాడు. నిజం చెప్పు రిషి ని ఏం చేయాలనుకుంటున్నావు అంటూ నిలదీస్తుంది జగతి. రిషి ని చంపాలన్నది నా ఉద్దేశం కాదు నా ఎండి సీటు నాకు ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తాను అంటాడు శైలేంద్ర.
ఆ సీటు నీకు ఇవ్వడం కుదరదు అంటూ కచ్చితంగా చెప్తుంది జగతి. మొదట్లో ఈ పంతాలు పట్టింపులు ఉంటాయి. పోను పోను నువ్వే అర్థం చేసుకుంటావు. పద.. మనం కూడా షాపింగ్ కి వెళ్దాము అక్కడ రిషి వాళ్ళకి ఏమైనా జరగొచ్చు అంటాడు శైలేంద్ర. రిషి కి ఏమైనా అపాయం తల పెడుతున్నాడా అంటూ కంగారుపడి శైలేంద్రతో వెళ్తుంది జగతి. సరదాగా కారులో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు రిషి, వసు.
కారుని సగం దూరం తీసుకొచ్చి ఆపుతాడు శైలేంద్ర. లారీ డ్రైవర్ కి ఫోన్ చేసి నీ పని ప్రారంభించు అంటాడు. ఆ మాటలు విన్న జగతి కంగారు పడిపోతుంది ఏం చేయబోతున్నావు అంటూ నిలదీస్తుంది. ఒకసారి అటు చూడు అనేసరికి ముందుకి చూస్తుంది జగతి కారులో రిషి వాళ్ళు వస్తుంటారు. ఒకవైపు ఇటు చూడు అని పక్కకి చూపిస్తాడు శైలేంద్ర.
అక్కడ నుంచి లారీ ఫాస్ట్ గా రిషి కారువైపు దూసుకుని వస్తూ ఉంటుంది. ఆ లారీ నేను అరేంజ్ చేసిందే ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అంటూ జగతిని టెన్షన్ పెడతాడు. ఏం చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జగతి. లాస్ట్ మినిట్ లో లారీని పక్కకు తప్పించమని చెప్పాడు శైలేంద్ర. అతను చెప్పినట్లే ఆఖరి నిమిషంలో కారు పక్క నుంచి పోనిస్తాడు లారీ డ్రైవర్.
అటు జగతి ఇటు రిషి వాళ్ళు కూడా కంగారు పడిపోతారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న రిషి, వసుకి ఏమైనా జరిగిందేమో అని కంగారు పడతాడు. జగతి పరిగెత్తుకొని వచ్చి ఏమి జరగలేదు కదా అంటూ కంగారుగా అడుగుతుంది. లారీ డ్రైవర్ ఏమైనా తాగేసి డ్రైవ్ చేస్తున్నాడా అంటూ ఏమీ తెలియనట్టు మాట్లాడుతాడు శైలేంద్ర. ఏమి జరగలేదు అయినా మీరు ఏంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి.
మీతో పాటు షాపింగ్ చేద్దామని పిన్నిని తీసుకొస్తున్నాను అంటాడు శైలేంద్ర. పదండి వెళ్దాం అంటాడు రిషి. ఇప్పుడు షాపింగ్ వద్దు ఏమి వద్దు అంటూ రిషిని కారు తీయమని ఆ కారులోనే తను వెళ్ళిపోతుంది జగతి. జగతి భయాన్ని చూసి నవ్వుకుంటాడు శైలేంద్ర. మరోవైపు విషయం తెలుసుకున్న మహేంద్ర వాళ్ళు ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు.
రిషి వాళ్ళు ఇంటికి రాగానే ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతాడు మహేంద్ర. ఎందుకు తరచుగా నీకే ఇలా జరుగుతుంది అంటూ ప్రేమ వలకబోస్తోంది దేవయాని. ఏమి జరగలేదు తాగి డ్రైవ్ చేసి వుంటాడు ఆ డ్రైవర్ అంటాడు రిషి. నువ్వు ప్రతిసారి ఇలాగే తేలిగ్గా తీసుకుంటున్నావు అంటూ మందలిస్తాడు మహేంద్ర. అవును రిషి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే నీకు అపాయం తలపెట్టవచ్చు.
నీకు ఎప్పుడు ఏ అవసరమైనా నాకు చెప్పు నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు శైలేంద్ర. ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటూ రిషికి వసుకి దిష్టి తీస్తుంది దేవయాని. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇలా ఎలా చేయగలుగుతున్నారు వాళ్లకి నిజం తెలియదు నేను నిజం చెప్పలేను అనుకొని బాధపడుతుంది జగతి. ఆ తర్వాత ఆలోచనలో జగతి దగ్గరికి వస్తాడు శైలేంద్ర.
నా కొడుకు జీవితంతో ఆడుకోవద్దు అంటుంది జగతి. నేనేం చేశాను నిజంగానే వాడిని ఏదైనా చేయాలి అనిపిస్తే గుద్దించేసేవాడిని కానీ పక్కకు తప్పించను కదా అంటాడు శైలేంద్ర. అనుకోకుండా ఈ మాటలు విన్న వసు నిర్గాంతపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.