Guppedantha Manasu: కొడుకుని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్న జగతి.. తమ్ముడితో యుద్ధం తప్పదంటున్న శైలేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. చనిపోయాడనుకున్న తమ్ముడు బ్రతికున్నాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మిషన్ ఎడ్యుకేషన్ మీ ఇద్దరిని టేకప్ చేయమని మహేంద్ర సార్ వాళ్లు అడుగుతున్నారు మీ ఇద్దరికీ ఇష్టమే కదా అని రిషి, వసుధారలని అడుగుతాడు విశ్వనాథం. వసుధార ఒప్పుకుంటుంది కానీ రిషి తన వైపు కోపంగా చూడటంతో రిషి సర్ అభిప్రాయం కూడా తెలియాలి కదా అంటుంది. అప్పుడు రిషి అభిప్రాయం అడుగుతాడు విశ్వనాథం.
రిషి ముందు ఒప్పుకోడు కానీ విశ్వనాథం రిక్వెస్ట్ చేయడంతో సరే అంటాడు కానీ డి బి ఎస్ టి కాలేజీ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వసుధార అతనిని ఫాలో అవుతుంది.తర్వాత మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి మళ్లీ ఎందుకు నా జీవితంలోకి వచ్చారు ప్రశాంతంగా ఉన్నాను లేదో చూద్దామనా అని కోపంగా అడుగుతాడు. నన్ను మోసగాడు అని ముద్ర వేసి పంపించేశారు కదా ఈ మోసగాడితో మీకేం పని అని నిష్టూరంగా మాట్లాడుతాడు.
అప్పుడు జగతి చేతులు జోడించి నేను తప్పే చేశాను కాదనట్లేదు కానీ నిన్ను రమ్మంటున్నది మా కోసం కాదు డిబిఎస్టీ కాలేజీ వైభవం పోతుంది, మిషన్ ఎడ్యుకేషన్ ప్రభావం తగ్గిపోతుంది అందుకే నిన్ను రమ్మని బ్రతిమాలుతున్నాను అని రిక్వెస్ట్ చేస్తుంది జగతి. అయినా తన మాటలు వినిపించుకోకుండా దయచేసి నా జీవితంలో నుంచి వెళ్లిపోండి అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మహేంద్ర అతనిని పిలవబోతుంటే మహేంద్రని ఆపి సార్ కి ఇంకా కోపం తగ్గలేదు.
మళ్లీ మామూలు మనిషి అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కానీ మిషన్ ఎడ్యుకేషన్ కచ్చితంగా ఆయన టేక్ అప్ చేస్తారు అంటుంది వసుధార. జగతి ఎమోషనల్ అవుతూ వసుధారని ముట్టుకో పోతుంది. దయచేసి నన్ను ముట్టుకోకండి ఇప్పుడు మన మధ్య ఏ బంధము లేదు మనం చేసిన తప్పు వల్ల మీ బంధం మీకు దూరమైంది నా బంధం నాకు దూరమైంది నా బంధం నాకు దక్కినప్పుడే మళ్ళీ మన బంధం కలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది వసుధార.
ఆ తర్వాత ఇంటికి వస్తారు మహేంద్రవాళ్లు. విశ్వనాథం ఎదురెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ టేక్ అప్ చేయటానికి రిషి ఒప్పుకున్నాడా అని అడుగుతాడు. లేదు అంటాడు మహేంద్ర. ఇలాంటి విషయాల్లో రిషి ముందుంటాడు కానీ ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో అంటాడు విశ్వనాథం. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యత చాలా పెద్దది కదా సర్ అందుకే ఆలోచిస్తున్నారేమో అయినా అతనికి ఆలోచించుకోవటానికి రెండు రోజులు గడువు ఇచ్చాము అంటుంది జగతి.
కచ్చితంగా రిషి దీనికి ఒప్పుకుంటాడు అని చెప్పిన విశ్వనాథం రెస్ట్ తీసుకోమని చెప్పి మహేంద్ర దంపతులని లోపలికి పంపించేస్తాడు. తర్వాత రిషి వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తూ గర్వపడతాడు. అనుకోకుండా ఈ మాటలన్నీ వింటాడు రిషి. మరోవైపు రిషి బ్రతికున్నందుకు ఆవేశం తో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. ఈరోజు కాకపోతే రేపైనా కాలేజీ ఎండి సీట్ నాకు దక్కుతుంది అనుకున్నాను కానీ నువ్వు బ్రతికుంటే ఆ పని జరగదు.
అందుకే నీ మీద ఎన్నిసార్లు అయినా అటాక్ చేయడానికి నేను సిద్ధం ఇకపై మనిద్దరికీ యుద్ధం తప్పదు అని కోపంగా అనుకుంటాడు. మరోవైపు బట్టలు సర్దేసిన మహేంద్ర పద బయలుదేరుదాం అని జగతితో అంటాడు. నాకు రావాలని లేదు రిషి ఉన్న చోటనే ఉండాలని ఉంది అంటుంది జగతి. మనం ఉన్న సిచువేషన్ లో అలా ఎలా కుదురుతుంది మనం ఎక్కడ ఉంటే రిషి ప్రశాంతంగా పని చేసుకోలేడు అంటాడు మహేంద్ర.
ఆ సిచువేషన్స్ కు భయపడే నేను పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకున్నాను. అమ్మ అని పిలుపుని దూరం చేసుకున్నాను నా కొడుకుని డి బి ఎస్ టి కాలేజీకి దూరం చేశాను అయినా రిషి నన్ను అసహ్యించుకుంటున్నాడో, దూరం పెడుతున్నాడో అవన్నీ నాకు కనిపించడం లేదు వినిపించడం లేదు రిషి నన్ను అమ్మ అని ఒకసారి పిలిచాడు ఆ పిలుపే నాకు పదే పదే వినిపిస్తుంది అని ఎమోషనల్ అవుతుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.