- Home
- Entertainment
- Guppedantha Manasu: కొడుకు మీద బెంగతో కళ్ళు తిరిగి పడిపోయిన జగతి! రిషి పెళ్లి విషయం గురించి అడిగిన దేవయాని!
Guppedantha Manasu: కొడుకు మీద బెంగతో కళ్ళు తిరిగి పడిపోయిన జగతి! రిషి పెళ్లి విషయం గురించి అడిగిన దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మహేంద్ర కంగారుగా ఏమైంది అని జగతిని అంటాడు. అప్పుడు జగతి, ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని అరుస్తుంది. ఏమైంది వసుధార!ఏమైనా తప్పు చేసావా అని మహేంద్ర అనగా,మీరందరూ తప్పు చేస్తున్నారు దేవయాని అక్కకి అవకాశం ఇవ్వకూడదు అని నేను చెప్పిన ప్రతిసారి ఏదో ఒక విధంగా అక్కకు అవకాశం ఇస్తున్నారు.ఎంత చెప్పినా వినడం లేదు అని అరుస్తుంది. అప్పుడు వసు, మన పంతం కోసం మొండిగా ఉండాలి కదా మేడం అని అనగా, ఇంక ఆపు వసు దండం పెడతాను, ఇంక చాలు.రిషి మనసు ఎంత సున్నితమైనదో నాకు తెలుసు. 20 ఏళ్లుగా నేను మా ఇంటికి దూరంగా ఉంటున్నాను అంటే ఆ ఇంటికి వెళ్లలేక కాదు, ప్రతిరోజు నేను ఓడిపోదు రిషిని గెలిపిస్తున్నాను. ఆ విషయం మీ అందరికీ తెలీదు. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అని అనగా వసు, అలా కాదు మేడం అని అంటుంది.దానికి జగతి ఆయాసంతో, ఇంక ఆపు వసు ఇంకేం మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు అని ఆయేస పడుతూ అంటుంది. అప్పుడు మహేంద్ర దీన్ని చూస్తూ, వసు నువ్వు త్వరగా బయటికి వెళ్ళమ్మా అని అంటాడు.
వసు జగతిని చూస్తూ బాధపడుతూ బయటకు వెళ్తుంది. అప్పుడు జగతి,మహీంద్రా దగ్గర ఏడుస్తూ, ఎంత చెప్పినా ఎందుకు మహేంద్ర ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నావల్ల మళ్లీ రిషికి బాధ కలుగుతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని బలవంతంగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది జగతి. ఆ తర్వాత సీన్లో రిషి కారులో వస్తూ ఉండగా ధరణి, జరిగిన విషయం అంతా రిషికి చెప్తుంది.ఇప్పుడు మేడం కి ఎలా ఉన్నది అని రిషి అనగా, ధరణి మనసులో, నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని నేను ఊహించలేదు రిషి అని అనుకోని, బానే ఉన్నారు ఇంటికి తీసుకొని వచ్చారు వైద్యం చేయడానికి డాక్టర్ వచ్చారు అని ఫోన్ పెట్టేస్తుంది.అప్పుడు రిషి మనసులో, ఈ విషయం వసుధారకు తెలుసా? కాలేజీలో పడిపోయారంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది అని అనుకుంటాడు రిషి. మరోవైపు డాక్టర్ జగతికి వైద్యం చేసి మహేంద్ర తో, ఈవిడ దేనికో మానసికంగా బాధపడుతున్నట్టున్నారు. కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పండి నేను మందులు ఇచ్చాను అవి వాడితే తగ్గిపోతాయి అని చెప్పి కిందకి వెళ్తుంది.
అప్పుడు కింద దేవయాని ఆ డాక్టర్ తో, పైనున్నవిడ ఎలా ఉన్నది? ఏమైంది? చస్తాదా బతికే ఉంటదా అని అడగగా, మీరు ఏంటండీ అలా మాట్లాడుతున్నారు అని డాక్టర్ అడుగుతుంది. అలా ఏమీ లేదు కానీ అసలు తనకి ఏమైంది అని అనగా, డిప్రెషన్ కి లోనయ్యారు అందుకే అలాగున్నారు అని చెప్తుంది ఆ డాక్టర్. అప్పుడు దేవయాని, ఇంట్లో వాళ్ళందరినీ పీక్కుతినేది అదే.దానికి ఏం బాధలుంటాయి లేండి అని అనగా, ఎవరో తనని రాక్షసత్వంగా హింసిస్తున్నట్టు ఉన్నారు అని దేవయాని వైపు చూస్తూ అంటుంది ఆ డాక్టర్. అప్పుడు దేవయాని, సర్లే మేము బానే చూసుకుంటాము అని ఆ డాక్టర్ని పంపించేస్తుంది. ఆ తర్వాత సీన్ లో రిషి కాఫీ షాప్ కి బయలుదేరుతాడు. అప్పుడు వసు, ఆర్డర్ చెప్పండి సార్ అని అనగా,అసలు ఏం జరుగుతుంది అని రిషి అంటాడు.దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అని అడగగా, మేడంకి ఎందుకు అలాగ అయింది అని రిషి అంటాడు. మేడంకి ఏమైంది సార్ ఏం మాట్లాడుతున్నారు సరిగ్గా చెప్పండి అని వసు అనగా నీకేం తెలియదా మేడం కళ్ళు తిరిగి పడిపోయారట ఇంట్లో ఉన్నారు అని అంటాడు రిషి.
దానికి వసు కంగారు పడుతూ అయ్యో అని బాధపడుతూ మేడం దేని గురించి అలా అయ్యుంటారో నేను ఊహించగలను సార్. మీరూ, మేడం ఒక విషయం గురించి బాధపడుతున్నారు అదేంటో మీకు తెలుసు. ఆ విషయం ప్రస్తావన నాకు ఇప్పుడు తేవాలని లేదు అని అంటుంది.అప్పుడు రిషి,ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా పాపం సార్ మేడం ఇన్నాళ్లు నిద్రించిన అగ్నిపర్వతంలా ఉండేవారు ఇప్పుడు తట్టుకోలేకపోయినట్టున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఇంటికి వెళ్దామా అని అనగా, రండి సార్ వెళ్దాము అని అంటుంది వసు. అప్పుడు రిషి,నేను ఇక్కడికి వచ్చింది కాఫీ తాగడానికి కాదు నేను ఇంటికి తీసుకువెళ్లడానికి అని అంటాడు. మరోవైపు మహేంద్ర జగతికి మందులు ఇస్తూ ఉంటాడు. అప్పుడు జగతి,ఇప్పుడు ఏమైందని మహేంద్ర నేను బానే ఉన్నాను కదా, ఇన్ని మందులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అనగా,నువ్వు బాగా లేవు జగతి నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావు?మనసులో ఏ బాధని పెట్టుకోవద్దు అని అంటాడు.
దానికి జగతి, నాకేం బాధలు లేవు మహేంద్ర.కేవలం రిషి, వాసుధార గురించి నా బాధంతా అని జగతి అంటుంది. కింద ఉన్న దేవయాని, రిషి నీ వసుధారని ఎలాగైనా విడగొట్టాలి. కొన్ని కొన్ని సార్లు రిషి నా మాట వినకుండా వసుధారని వెనకేసుకుని వస్తున్నాడు. ఇలాగే కొనసాగితే నాకు తెలియకుండా ఇంకేం జరుగుతాయో అని అనుకుంటుంది. ఇంతలో రిషి, వసూలు మెడలో దండలు వేసుకొని ఇంట్లోకి వస్తారు.దాన్ని చూసిన దేవయాని ఆశ్చర్యపోతూ ఉంటుంది.అప్పుడు రిషి దేవయానిని కదిపి ఏం పెద్దమ్మ అలా చూస్తున్నారు అని అనగా, మళ్లీ చూసేసరికి అక్కడ దండలు ఉండవు. అప్పుడు దేవయాని, ఇదంతా బ్రమా! అని అనుకుంటుంది. ఇంతలో వసు, జగతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దేవయాని రిషితో, ఇన్నాళ్లు నీతో మాట్లాడదాం అనుకున్నాను రిషి. నీ పెళ్లి విషయం గురించి అని అనగా, అందులో మాట్లాడడానికి ఏముంది పెద్దమ్మ. వసుధార వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్లి మాట్లాడాలి, మన ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి ఏమవ్వదు అని అంటాడు.
దానికి దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.మరోవైపు వసు, జగతి మహేంద్రల దగ్గరికి వస్తుంది. అప్పుడు జగతి, ఏమైంది వసు రిషికి నీ మీద కోపం తగ్గిందా అని అనగా అదే సమయంలో తలుపు వెనకాతల నుంచి రిషి వీళ్ల మాటలను వింటాడు.అప్పుడు వసు, రిషి సార్ కోపం, ప్రేమ పాలు నీళ్లు లాంటివి మేడం కలిసిపోతాయి. అయినా మీరేంటి మేడం ఇలాగున్నారు ఏమైనా తాగారా?ఏమైనా కావాలా? అని అడగగా జగతికి ఏం కావాలో నీకు నాకు తెలుసు కదా వసు. తెలియాల్సిన వాళ్లకే తెలీదు అని మహేంద్ర అంటాడు. అప్పుడు వసు పక్కనున్న జ్యూస్ ని ఇచ్చి, ఇది తాగండి మేడం మీరు త్వరగా కోలుకోవాలి. ఎప్పుడూ ఉన్నంత ఉత్సాహంగా ఉండాలి నన్ను తిట్టాలి అని అనగా, నేనెప్పుడూ ఇలాగే ఉండిపోతాను ఏంటి వసు. నేను మంచం మీద ఉన్నా,కాలేజీలో ఉన్నా జగతి ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటది.
కానీ జగతి లోపల ఉన్న అమ్మ మాత్రం బాధపడుతూనే ఉంటుంది అని అంటుంది. అప్పుడు వసు, మీరు అలా ఎందుకు బాధపడుతున్నారు మేడం. అవునట్టు చెప్పడం మర్చిపోయాను ఒక కాలేజ్ వాళ్ళు తోలుబొమ్మలాట ప్రోగ్రామ్ చేస్తున్నారట. అందులో జడ్జ్ గా మిమ్మల్ని ఆహ్వానించారు అని అనగా, జీవితం అనే తోలుబొమ్మలాటలో నేను ఓడిపోయినప్పుడు నేనేం జడ్జ్ చేస్తాను వసు అని జగతి అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!