- Home
- Entertainment
- Guppedantha Manasu: నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు వసుధార.. కన్నీళ్లు పెట్టించిన జగతి!
Guppedantha Manasu: నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు వసుధార.. కన్నీళ్లు పెట్టించిన జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంతుంది. ఇక ఈ రోజు జూన్ 1న ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జగతి (Jagathi).. రిషి ని చూస్తే నాకు భయమేస్తుంది. అసలేం జరిగింది అని వసు (Vasu) ను నిలదీస్తుంది. అంతేకాకుండా రిషి బార్ లో మందు కొడుతున్న పిక్ వసుకు చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన వసు ఒకసారిగా స్టన్ అవుతుంది. ఇక జగతి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది.
ఇక వసు రిషి (Rishi) సార్ నాకు ప్రపోజ్ చేశారు.. నేను రిజెక్ట్ చేశాను అన్నట్లు చెబుతుంది. ఆ మాటతో జగతి (Jagathi) ఎంతో ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా నా కొడుకుని రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటో? తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఇక ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు నేను వెళ్ళిపోతాను అని అంటుంది.
ఇక వసు (Vasu) రిషి సార్ నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాలని రూల్ లేదు కదా మేడం అని అంటుంది. ఆ మాటతో జగతి (Jagathi) స్టన్ అవుతుంది. అంతేకాకుండా నీ మనసు ఒకటి చెబుతుంది. నీ పెదవులు ఇంకొకటి చెబుతున్నాయి అని అంటుంది. ఇక నేను రిషి ని బాధపెట్టిన దానికి.. నువ్వు తనని వెయ్యిరెట్లు బాధ పెట్టావు అని అంటుంది.
మరోవైపు కాలేజీలో రిషి (Rishi) తన దుఃఖాన్ని దాచుకుని ఏమీ జరగనట్టుగా మహేంద్ర (Mahendra) తో నవ్వుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇక మహేంద్ర నువ్వు మనసులోని బాధను దాచుకుంటే మేము కనిపెట్టలేమా అన్నట్లు మాట్లాడుతాడు. ఇక నువ్వు ఎంత కప్పి పుచ్చినా నిజమేంటో మాకు కూడా తెలుస్తుంది కదా అని అంటాడు. ఇక రిషి ఏమి సమాధానం చెప్పకుండా అక్కడికి వెళతాడు.
ఆ తర్వాత జగతి (Jagathi) హడావిడిగా ఇంటికి వచ్చి మహేంద్ర ను రిషి (Rishi) ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. ఇప్పుడే కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను అని అంటాడు. జగతి మహేంద్ర ను కాలేజీ కి తీసుకుని వెళుతుంది. మరోవైపు వసు ఫ్రెండ్ పుష్ప రిషి సార్ తో లాంగ్ జర్నీ చేసినందుకు పార్టీ ఇవ్వమని అడుగుతుంది. ఇక వసు ఆ మాటకు ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత రిషి (Rishi) క్లాస్ చెబుతూ ఉండగా.. అక్కడకు వసు (Vasu) వెళ్లి మే ఐ కమింగ్ సార్ అని అడుగుతుంది. ఆ మాట విన్న రిషి చాక్ పీస్ ను బ్లాక్ బోర్డు కు పెట్టి గట్టిగా అదుముతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.