- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషీ వసుల మధ్య ప్రేమ యుద్ధం.. దేవయనికి సూపర్ వార్నింగ్ ఇచ్చిన జగతి!
Guppedantha Manasu: రిషీ వసుల మధ్య ప్రేమ యుద్ధం.. దేవయనికి సూపర్ వార్నింగ్ ఇచ్చిన జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 27 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu),జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఇంతలో జగతి వచ్చి మాట్లాడుతుండగా అప్పుడు వసు జరిగిన విషయం చెప్పబోతుండగా ఇంతలోనే రిషి వస్తాడు. అప్పుడు రిషి (rishi)మినిస్టర్ గారు రమ్మని చెప్పారు ఫైల్ తీసుకొని మీరు మీ స్టూడెంట్ వెళ్ళండి అని చెబుతాడు.
అప్పుడు జగతి(janagthi) నాకంటే మీరు వెళ్లడమే కరెక్ట్ అని అనడంతో వెంటనే రిషి సరే మీ స్టూడెంట్ రెడీ గా ఉండమని చెప్పండి నేను కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి వసు కి జాగ్రత్తలు చెబుతుంది. ఇంతలోనే జగతి ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా దేవయాని(devayani)ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని వెటకారం గా మాట్లాడుతుంది.
అప్పుడు జగతి (jagathi)ఇప్పుడే కదా అక్క ఇంటి నుంచి వచ్చాను అప్పుడే అలా అడుగుతున్నారు ఏంటి అని అనడంతో వెంటనే దేవయాని మహేంద్ర ఉన్నాడా అని అడిగి నాతో ఒక రెండు నిమిషాలు మాట్లాడుతావా అని అంటుంది. అప్పుడు రిషి(rishi) కొద్ది రోజుల నుంచి డల్ గా ఉంటున్నాడు అని అనగా అవును నేను కూడా గమనించాను అని అనడంతో గమనించగానే సరిపోదు కదా అని అంటుంది.
అప్పుడు జగతి (jagathi)స్కూల్ పిల్లాడు అయితే చెప్పగలం కానీ కాలేజీ ఎండి కదా అని అనడంతో అప్పుడు వెంటనే దేవయాని ఈ విషయంలో నీ మేధావి శిష్యురాలు మేధస్సును వాడుకోలేక అని అంటుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా దేవయానికి జగతి గట్టిగా బుద్ధి చెబుతుంది. మరొకవైపు రిషి, వసు(vasu) ఇద్దరు కలిసి కార్ లో వెళ్తుంటారు. అప్పుడు వసు, రిషి సీటు బెల్టు పెట్టుకున్నట్లు భ్రమ పడుతుంది.
అప్పుడు రిషి (rishi)సీట్ బెల్ట్ పెట్టుకుని బయల్దేరుదాం అని అనడంతో అప్పుడు వసు ముఖం ఒకలాగా పెడుతుంది. అప్పుడు వసు రిషి నీ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండగా రిషి మాత్రం చిరుబురులాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసు, రిషి మినిస్టర్ గారిని కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తారు. అప్పుడు వసుధార(vasudhara)మినిస్టర్ గారికి ఎక్సప్లయిన్ చేయడం చూసి మినిస్టర్,రిషి ఇద్దరు ఆశ్చర్యపోతారు.
మరొకవైపు జగతి(jagathi)కి మినిస్టర్ ఫోన్ చేసి రిషి లాంటి కొడుకునీ కన్నందుకు మిమ్మల్ని అభినందించాలి అని జగతిని పొగుడుతాడు. మరోవైపు రిషి,వసు ఇద్దరు కార్ లో వెళ్తూ ఉండగా వసు మాటలకు రిషి(rishi) కాస్త వెటకారంగా సమాధానం చెబుతారు. ఆ తర్వాత వసు,రిషి ఇద్దరు ఆకలిగా ఉంది అని పక్కనే ఉన్న పుచ్చకాయ బండి దగ్గరికి వెళ్తారు.
అప్పుడు రిషి (Rishi)ఏంటి ఈ సారి భేరాలు లేవా అని అడుగగా డబ్బులు ఇచ్చేది మీరు కదా అని అనడంతో బాగా క్లారిటీ గా ఉన్నావు అని అంటాడు రిషి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పుచ్చకాయని తింటూ ఉంటారు. అప్పుడు రిషి మూతికి పుచ్చకాయ అవ్వగా అప్పుడు వసు (vasu)ఫోన్ లో ఫోటో తీసి రిషీ కి చూపిస్తుంది.