- Home
- Entertainment
- Guppedantha Manasu: కోపంతో శివంగిలా మారిన జగతి.. పిన్ని చుట్టూ ఉచ్చు బిగించిన శైలేంద్ర!
Guppedantha Manasu: కోపంతో శివంగిలా మారిన జగతి.. పిన్ని చుట్టూ ఉచ్చు బిగించిన శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానాన్ని సంపాదించుకుంది. కన్న కొడుకు కోసం మరిది కొడుకు జీవితాన్ని రిస్క్ లో పెడుతున్న ఒక పెద్దమ్మ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీలో ఒక రూమ్ కి తీసుకెళ్లి నీకు ఈ రూమ్ గుర్తుందా ఫస్ట్ టైం నేను నిన్ను ఇక్కడే కలిసాను. ఆరోజు అడ్మిషన్ ఇవ్వను బయటికి పొమ్మన్నాను అంటాడు రిషి. గుర్తుంది సార్ ఆరోజు మీరే పొమ్మన్నారు ఈరోజు మీరే నన్ను తీసుకువచ్చారు అంటుంది వసు. ద్వేషాన్ని పుట్టించవచ్చు కానీ చివరికి అది ప్రేమగా మారుతుంది అంటాడు రిషి.
ఎమోషనల్ అయిన వసు, రిషి ని హత్తుకొని ఐ లవ్ యు చెప్తుంది. ఇంతలో ఒక వ్యక్తి అటుగా వెళ్లడం గమనిస్తారు వసు, రిషి. ఒక్కసారిగా కంగారు పడతారు ఇద్దరూ. బయటకు వెళ్లి చూద్దాం అంటాడు రిషి. బయటికి వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి అతని మీద అటాక్ చేయబోతాడు. తృటిలో తప్పించుకుంటాడు రిషి. అతనిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు కానీ దొరక్కుండా పారిపోతాడు అగంతకుడు.
బాగా భయపడిపోతుంది వసు. వాచ్మెన్ ని పిలిచి విషయం చెప్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ రిషిని తీసుకుని వెళ్ళిపోతుంది. కారులో ముభావంగా ఉన్న వసుని చూసి ఎందుకు బాధపడతావు నేను బానే ఉన్నాను కదా అంటాడు రిషి. చాలా భయంగా ఉంది అంటూ రిషి ని పట్టుకొని ఏడుస్తుంది వసు.
మరోవైపు రిషి మీద అటాచ్ జరిగిందని తెలుసుకొని కంగారు పడిపోతున్నట్లుగా నటిస్తుంది దేవయాని.వసుధార పక్కన ఉంటే ఏం జరగదు అంటావు? ఇప్పుడు చూడు తన పక్కనుండగానే దాడి జరిగింది నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి అంటూ నిలదీస్తుంది. ఇది చిన్న విషయం కాదు మనం సీరియస్ గా రియాక్ట్ అవ్వాలి అంటాడు ఫణీంద్ర. పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఫోన్ చేయబోతుంటే వద్దు అంటాడు రిషి.
ఇలాంటి విషయాల్లో వెనకడుగు వేయకూడదు అంటాడు ఫణీంద్ర. ఇదే మొదటి సారా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడుగుతాడు శైలేంద్ర. స్పాట్ వేల్యూషన్ అప్పుడు, కిడ్నాప్ జరిగినప్పుడు సంగతులన్నీ చెప్తాడు మహేంద్ర. ఎందుకు ఇవన్నీ భరిస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర. అనుకున్నది సాధించాలంటే కొన్ని భరించాలి అంటాడు రిషి. పోలీస్ కంప్లైంట్ ఎందుకు వద్దంటున్నారు అంటుంది వసు. పిల్లల భవిష్యత్తు కోసం.. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు ఈ గొడవలు అంటే పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి కూడా టెన్షనే అందుకే మన ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకుందాం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
మరోవైపు డాబా మీద పచార్లు చేస్తూ ఉంటుంది జగతి. అక్కడ వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి శైలేంద్ర రావడం గమనిస్తుంది. శైలేంద్ర ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాడు. మీరు చెప్పిన పని మిస్ అయినా కూడా ఎందుకు ఫుల్ పేమెంట్ ఇస్తున్నారు అంటాడు ఆ వ్యక్తి. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండటానికి కొన్ని రోజులు ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండకు అని చెప్పి పంపించేస్తాడు శైలేంద్ర. ఆ మాటలు విన్న జగతి నిర్ధాంత పోతుంది. మరోవైపు రిషి తప్పించుకున్నాడని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని.
రిషి తప్పించుకుంటాడని నాకు తెలుసు వాడు తప్పించుకోవడమే మంచిది ప్రతిక్షణం ఏం జరుగుతుందో అని భయంతో వణికి పోవాలి. వాళ్ళంతట వాళ్లే ఆ పదవులను వదులుకోవాలి. అలా జరగని రోజు నా చేతులతో నేనే ఆ రిషి ని చంపేస్తాను అంటాడు శైలేంద్ర. శైలేంద్ర అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వస్తుంది జగతి. మీరు అసలు మనుషులేనా నా కొడుకుని చంపటానికి ప్లాన్లు వేస్తున్నారా.. నేనుండగా నా కొడుక్కి ఏమీ కానివ్వను.
ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను అంటుంది జగతి.ఏంటి బెదిరిస్తున్నావా అంటుంది దేవయాని. తరువాయి భాగంలో నీ కొడుకు ప్రాణమా.. కాలేజీలో పదవులా నువ్వే తేల్చుకో నేను చెప్పినట్లు చేస్తే నీ కొడుక్కి ప్రాణభిక్ష పెడతాను అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర. మరోవైపు ఏడుస్తున్న జగతిని చూసి కంగారు పడతారు రిషి వాళ్ళు. ఏం జరిగింది అని అడుగుతాడు రిషి. జగతి ఏదో చెప్తుంది. మీరు ఉండగా నాకేం జరగదు అంటూ ధైర్యం చెప్తాడు రిషి.