Guppedantha Manasu: ఒక్కటైన వసుధార, రిషి.. సంతోషంలో జగతి,మహేంద్ర?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జయచంద్ర మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో అందులో రాసి ఈ బౌల్లో వేయండి మీ ఓటింగ్ స్టార్ట్ అని చెబుతాడు. అప్పుడు మహేంద్ర జగతి నీ ఓటు ఎవరికి వేస్తున్నావు అనగా అలా చెప్పకూడదు మహేంద్ర అనడంతో ఇదేమి జనరల్ ఎలక్షన్ కాదు కదా అనగా అంతకంటే ఎక్కువ చాలా ఇంపార్టెంట్ అని అంటుంది జగతి. రిషి తన మనసులో వసుధార అన్న మాట తెలుసుకుని అవును కరెక్టే తప్పు చేయలేదు తన స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు.
అప్పుడు జయచంద్ర వసుధార రిషి లను కూడా ఓటు వేయమని చెబుతాడు. అప్పుడు ఓటు వేసి జయచంద్ర చేతికి ఇస్తారు. అప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయా అని జయచంద్ర లెక్కిస్తూ ఉంటాడు. అప్పుడు ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అందరూ చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడే లెక్క అయిపోలేదు ఇంకా రెండు ఓట్లు నా దగ్గర ఉన్నాయి అని అంటాడు జయచంద్ర. నా చేతిలో ఉన్న రెండు ఓట్లు ఒకటి వసుధార ది ఒకటి రిషిది ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూద్దాం అని అంటాడు.
అప్పుడు రిషి వసుధార పేరు రాయడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వసుధార సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వసుధార ఎవరికి ఓటు వేసిందో తెలుసుకుందాం అని జయచంద్ర అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వసు రిషికి ఓటు వేసింది అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. వీరిద్దరిని సమర్ధించేవారు సమానంగా ఉండడం ఒక ఎత్తు అయితే, వీరిద్దరూ ఒకరికి ఒకరు ఓటు వేసుకోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం అని అంటాడు జయచంద్ర. ఇందాక వాళ్ళిద్దరూ ఒకరు నేను కరెక్ట్ అంటే ఒకరు నేను కరెక్ట్ అనుకుంటూ వాదించారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరివాదన ఒకరికి నచ్చక మరొకరి వాదన నచ్చింది అంటూ ఓటు వేశారు అని అంటాడు జయచంద్ర.
అందుకు కారణం ఒకటుంది. వీరిద్దరికీ అది అభిప్రాయాల మీద ఇంకొకరికి చాలా గౌరవం ఉంది అని అంటాడు. అప్పుడు వసు, రిషి ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి, వసు మనసులోని మాటలు జయచంద్ర బయట పెట్టడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి చెబుతున్నాను వీరిద్దరూ సమానమే అని అంటారు జయచంద్ర. తర్వాత స్పీచ్ అయిపోవడంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోగా రిషి, వసు మాత్రమే మిగులుతారు. అప్పుడు ఇద్దరు దగ్గరగా వచ్చి హత్తుకుంటారు. అప్పుడు రిషి, వసు హత్తుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు.
జయచంద్ర మహేంద్ర జగతి అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు జయచంద్ర రిషి వాళ్ళ దగ్గరికి వస్తారు. చూశారా మీ ఇద్దరి మధ్య ఎంత మంచి అవగాహన ఉందో, మీరిద్దరూ ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేరు. మీ స్వభావాలే మీ దూరానికి కారణం. మీ ప్రేమకు పునాది కూడా ఆ స్వభావాలే పని మంచి మాటలు చెబుతూ ఉంటారు జయచంద్ర. ఓటింగ్ లో ఇద్దరు మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయ పడుతున్నారో అనడంతో రిషి,వసు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీరిద్దరూ కలిసి ఉండాలని గట్టిగా అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం వచ్చినా కూడా మిమ్మల్ని ఇబ్బంది విడదీయలేరు అని చెబుతాడు జయచంద్ర.
సార్ మీరు మంది వివాహ బంధం అనుకుంటే ఈ తాళి నా మెడలో ఉంటుంది సార్, అప్పుడు మహేంద్ర రిషి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. మహేంద్ర గారు రిషికి ఆలోచించుకునే సమయం ఇవ్వండి అని అంటారు జయచంద్ర. సరే రిషి రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నాను అని అంటాడు మహేంద్ర. తర్వాత జయచంద్ర బయలుదేరుతుండడంతో అందరూ సంతోషంగా జయచంద్ర గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. యంగ్ మాన్ వెళ్ళొస్తాను ఇప్పటికీ మీ జంట ఇలాగే ఉండాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వసుతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు రిషి. చాలు ఇప్పటితో మా ఇద్దరి మధ్య ఉన్న బంధానికి ముగింపు పలకాలి అనుకుంటూ ఉంటాడు రిషి..