నేను స్టార్ డైరెక్టర్ కాదా ? జగపతి బాబుకి షాకిచ్చిన ఆర్జీవీ
Ram gopal varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV)ఏం చేసినా? ఏం చెప్పినా? అది ఎప్పుడూ సెన్సేషనల్‌గా మారిపోతుంది. తాజాగా ‘నేను సార్ట్ డైరెక్టర్ కాదా?’అని ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఆ కామెంట్స్ చేశారు?

రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Ram gopal varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన ఆర్జీవి, తాజాగా కాంట్రవర్సీలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వరుసగా వివాదాలతో వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఏం చేసినా, ఏం చెప్పినా అది ఎప్పుడూ సెన్సేషనల్‌గా మారిపోతుంది. తాజాగా ‘నేను సార్ట్ డైరెక్టర్ కాదా?’అని ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఆ కామెంట్స్ చేశారు? అసలేం జరిగింది?
ఆర్జీవీ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ శివ
ఒకప్పడు ఆర్జీవీ అంటే ఓ బ్రాండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎదిగిన వారందరూ ఆయన దగ్గర పని చేసిన వారే. కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో 'శివ' (1989) లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన ఘనత రామ్ గోపాల్ వర్మ కే దక్కుతుంది. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అప్పటి వరకు ఒక మూస ధోరణిలో వెళ్ళిన టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఆర్జీవీ. సినిమా తీసే విధానం, ప్రేక్షకులు చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశారు ఆర్జీవీ. అందుకే తెలుగు సినిమా 'శివ'కి ముందు, 'శివ' తర్వాత అని మాట్లాడుకుంటుంటాం. అలా ఆర్జీవీ తన శివ మూవీతో ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఆర్జీవీ ఇలా ప్రత్యేక స్థానాని సంపాదించుకున్నారు.
వివాదాలను కేరాఫ్
బాలీవుడ్‌లో బిగ్ బీ అమిత్ బచ్చన్ లాంటి బడా హీరోలతో బస్టర్ మూవీస్ తీశారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్‌లోని పెద్ద హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ (RGV), ఒకప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే, కాలానుగుణంగా ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుకు నచ్చకపోవడం, మార్కెట్‌లో ఫ్లాప్‌లు రావడం వలన వర్మ గ్రాఫ్ తగ్గిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లను తనకు నచ్చినట్టు తెరకెక్కిస్తూ తరుచు వివాదాల్లో ఇర్కుంటున్నారు.
ఆర్జీవీపై జగ్గు బాయ్ సెటైర్లు
టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఈ షోలో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు హాజరై తమ కెరీర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాలుగవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో విడుదలైంది.
ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ (RGV), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. "అందరికీ RGV, నాకు మాత్రం సైతాన్" అని రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు వేశారు. RGV " నేను ప్రేక్షకులకు ఏది చెప్పినా వినరు" అని ఆర్జీవీ చెప్పగా, "10 నిమిషాలు నీతో కూర్చుంటే నేను కూడా నీలా అయిపోతానా" అని జగపతి బాబు నవ్వుల పూవ్వులు పూయించారు.
ఆర్జీవీకి అవమానం
ఆ తరువాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షోలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్బంగా సందీప్ ను జగపతిబాబు హాగ్ చేసుకుని వెంటనే అతనికి వోడ్కా బాటిల్ అందజేశారు. దీంతో ఆర్జీవీ షాక్ అయ్యారు. "నాకెందుకు ఇవ్వలేదు? సందీప్ సూపర్ డైరెక్టర్.. నేను స్టార్ డైరెక్టర్ కాదా?' అంటూ ప్రశ్నించారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వెంటనే ఆర్జీవీ తన ఫన్నీ రియాక్షన్ తో షోను కూల్ చేశారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ 'ZEE5'లో సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ అవుతుంది. హీరో జగపతి బాబు, ఆర్జీవీ, సందీప్ రెడ్డి మధ్య ఫన్నీ, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.