ఎవరినైనా స్నేహితుడు అని చెబుదామనుకుంటే వాళ్లు ఎలాంటి వాళ్లు, తనతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గుర్తుకొస్తుందని.. అలా గుర్తొచ్చినపుడు వారిని తాను స్నేహితులు అనలేనని జగపతి తేల్చేశాడు.  డు.


సినిమా లైఫ్ ప‌క్క‌న పెడితే జ‌గ‌ప‌తి బాబు త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉంటూ న‌చ్చిన‌ట్టు మాట్లాడే వ్య‌క్తి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏది అయినా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జ‌గ‌ప‌తి బాబుకు ఉండ‌టంతో అత‌డి రియ‌ల్ క్యార‌క్ట‌ర్ ను కూడా ఎంతో మంది ఇష్ట‌ప‌డుతారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడే మాటలకు ప్రత్యేక ప్రయారిటీ ఉంటుంది. తాజాగా ఆయన ఇండస్ట్రీ ప్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

జగపతి బాబు మాట్లాడుతూ... మూడు దశాబ్దాలకు పైగా తాను పని చేస్తున్న పరిశ్రమలో తనకు ఒక్కరంటే ఒక్క స్నేహితుడు కూడా లేదని తేల్చేశాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగానే మాట్లాడారు ఓ ఇంటర్వ్యూలో. తమిళ నటుడు అర్జున్ తనకున్న జెన్యూన్ ఫ్రెండ్స్‌లో ఒకడని జగపతిబాబు చెప్పాడు.తమది ఎన్నో ఏళ్ల అనుబంధం అని.. ఆ స్నేహంతోనే ఒకరి సినిమాల్లో ఒకరం నటించామని, వ్యక్తిగతంగా కూడా తమ మధ్య మంచి అనుబంధం ఉందని జగపతి చెప్పాడు.

అయితే అర్జున్‌, తాను గొడవపడే తీరు చూస్తే మాత్రం చూసే వాళ్లకు తాము స్నేహితుల్లా కాకుండా శత్రువుల్లా కనిపిస్తామని ఆయన అన్నాడు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మీకు స్నేహితులెవరూ లేరా అని అడిగితే.. నిజాయితీగా చెప్పాలంటే లేరు అనేశారు జగపతి. ఎవరినైనా స్నేహితుడు అని చెబుదామనుకుంటే వాళ్లు ఎలాంటి వాళ్లు, తనతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గుర్తుకొస్తుందని.. అలా గుర్తొచ్చినపుడు వారిని తాను స్నేహితులు అనలేనని జగపతి తేల్చేశాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనుకునేవాళ్లందరూ రాత్ గయా.. బాత్ గయా టైపే అని ఆయన వ్యాఖ్యానించాడు.

ఇక ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో విల‌న్ అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయ్యారు. దాంతో ఆ త‌ర‌వాత వ‌రుస నెగిటివ్ రోల్స్ చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. అంతే కాకుండా ఓ వైపు విల‌న్ గా న‌టిస్తూ మ‌రోవైపు తండ్రి పాత్ర‌లు కూడా చేస్తు ఆక‌ట్టుకుంటున్నారు.