MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హీరోయిన్లకి గిఫ్ట్స్ ఇచ్చి కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న హీరో, ఇలా కూడా జరుగుతుందా.. ఓపెన్ గా చెప్పేశాడు

హీరోయిన్లకి గిఫ్ట్స్ ఇచ్చి కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న హీరో, ఇలా కూడా జరుగుతుందా.. ఓపెన్ గా చెప్పేశాడు

కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన జగపతి బాబు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఆశ్చర్యకరమే. తన ఆర్థిక సమస్యలకి కారణాలని ఆ మధ్యన ఇంటర్వ్యూలో జగపతి బాబు వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 09 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. విలక్షణమైన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు. రంగస్థలం, అరవింద సమేత లాంటి చిత్రాల్లో జగపతి బాబు విలనిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా అభిమానులని సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ జగపతి బాబుని జగ్గూ భాయ్ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. అయితే జగపతి బాబు కెరీర్, పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ విషయంలో జగపతి బాబుకి ఎలాంటి సమస్య లేదు కానీ.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

38

కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన జగపతి బాబు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఆశ్చర్యకరమే. తన ఆర్థిక సమస్యలకి కారణాలని ఆ మధ్యన ఇంటర్వ్యూలో జగపతి బాబు వివరించారు.  సాధారణంగా జగపతి బాబు గురించి బయట జరిగే ప్రచారం ఏంటంటే.. ఆయన ఎక్కువగా జూదం ఆడతారు. 

48

గోవాలో క్యాసినో ఆడడం వల్ల ఎంతో డబ్బు పోగొట్టుకున్నారు అనే ప్రచారం ఉంది. జూదం వల్లే జగపతి బాబు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయనకి టాలీవుడ్ లో విలన్ గా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల నిలదొక్కుకోగలిగారు అని అంటారు. అయితే ఇందులో జగపతి బాబు వాదన వేరే విధంగా ఉంటుంది. 

58

తన ఆర్థిక సమస్యలకి జూదం ఒక్కటే కారణం కాదు. నిజమే నేను జూదం ఆడతాను. జీవితమే పెద్ద గ్యాంబిల్. ఎప్పుడు పుడతామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. నేను జూదంలో మహా అయితే రెండు కోట్లు పోగొట్టుకుని ఉంటానేమో అని అన్నారు. మరి అంత ఆస్తి ఎలా పోయింది అని యాంకర్ ప్రశ్నించగా.. అది సమాధానం చెప్పలేని పెద్ద ప్రశ్న అని నవ్వేశారు. హీరోయిన్లకు, మహిళలకుపెద్దఎత్తున క్లాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కూడా డబ్బు పోగొట్టుకున్నారని తెలిసింది అని యాంకర్ అన్నారు. 

68

దీనికి జగపతి బాబు వివరణ ఇచ్చారు. హీరోయిన్లకి గిఫ్టులు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మహిళలని నేను అంత చీప్ గా చూడను. కానీ వాళ్లని కలసినప్పుడు బాగా ట్రీట్ చేస్తాను. ఖర్చుకు వెనుకాడను. హీరోయిన్లతో పార్టీలకు వెళ్ళినప్పుడు బిల్ నేనే కడతాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు హీరోయిన్లకు మాత్రమే కాదు ఎవరికైనా నా జేబులో డబ్బే ఖర్చు చేస్తా. నాకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్లు షాపింగ్ చేస్తే నేనే బిల్ కట్టేవాడిని. 

78

ఇది మాత్రమే కాదు.. నా ఫ్రెండ్స్ మగవాళ్ళకి కూడా నేను చాలా బిల్లులు కట్టాను. నిర్మాతలకి డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే నా దగ్గర డబ్బు లేని సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్టడం పెద్ద మైనస్ అని జగపతి బాబు అన్నారు. వడ్డీల రూపంలోనే 20 కోట్ల వరకు పోయాయి. 

88

ఇక ఆసుపత్రికి వెళితే అక్కడ ఎవరైనా డబ్బు లేకుండా ఇబ్బంది పడుతుంటే వారి బిల్ నేను కట్టేవాడిని. ఒక సందర్భంలో కొందరు కుర్రాళ్ళు యాక్సిడెంట్ అయి ఆసుపత్రికి వచ్చారు. వాళ్ళకి బిల్ కట్టేంత స్తోమత లేదు. నేను డబ్బు కట్టి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించా. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని జగపతి బాబు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved