- Home
- Entertainment
- Naga Chaitanya: నాగార్జునని మించిన మన్మథుడు నాగచైతన్య.. ఆ రహస్యాలు బయటపెట్టిన జగపతిబాబు
Naga Chaitanya: నాగార్జునని మించిన మన్మథుడు నాగచైతన్య.. ఆ రహస్యాలు బయటపెట్టిన జగపతిబాబు
సాధారణంగా టాలీవుడ్‌లో నాగార్జుననే మన్మథుడు అంటుంటారు. కానీ ఆయన్ని మించిన మన్మథుడు నాగచైతన్య అని అంటున్నాడు జగపతిబాబు. చైతూకి సంబంధించిన పలు రహస్యాలను బయటపెట్టారు.

నాగచైతన్య తండ్రి నాగార్జునకి మించిన మన్మథుడా?
టాలీవుడ్‌లో మన్మథుడు అంటే అక్కినేని నాగార్జుననే గుర్తుకు వస్తారు. నాగేశ్వరరావు ఎక్కువగా రొమాంటిక్, లవ్ స్టోరీస్ చేసినా ఆయనకు ఆ ట్యాగ్ రాలేదు. కాకపోతే పర్సనల్‌గా బాగా రొమాంటిక్ అని హీరోయిన్లు అంటుంటారు. అయితే నాగార్జునకి మాత్రం మన్మథుడు ట్యాగ్ బాగా పాపులర్ అయ్యింది. అంతేకాదు ఆయనతో హీరోయిన్లు ఉండే విధానం, ఆయన హీరోయిన్లని ట్రీట్ చేసే విధానం అన్ని చూశాక ఈ ట్యాగ్ పర్‌ఫెక్ట్ అని అభిమానులు భావించారు. ఇండస్ట్రీ కూడా అదే నమ్ముతుంది. ఇప్పటికీ హీరోయిన్లు ఆయనపై క్రష్‌ని పెంచుకోవడం కూడా అందుకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే నాగార్జునకి మించిన మన్మథుడు నాగచైతన్య అని అంటున్నారు జగపతిబాబు. తాజాగా చైతూకి సంబంధించిన పలు రహస్యాలను ఆయన బయటపెట్టాడు.
జగపతిబాబు `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో చైతూ సందడి
నాగచైతన్య తాజాగా జగపతిబాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో పాల్గొన్నారు. ఇందులో చైతూ, జగ్గూభాయ్ మధ్య ఆసక్తికర కన్వర్జేషన్ జరిగింది. ఒక నెంబర్ సీక్రెట్‌ని బయటపెట్టాడు జగపతిబాబు. దీంతో టెన్షన్ పడ్డాడు చైతూ. అంతేకాదు ఏం చేయకుండానే అమ్మాయిలు నీ వెంటపడతారని చెప్పడం ఫన్నీగా ఉంది. మీ నాన్న బయటపడతాడు. నువ్వు బయటపడవు అంటూ చైతూలోని మరో యాంగిల్‌ని బయటకు తీశారు జగపతిబాబు. ఆ విశేషాలేంటో చూస్తే. జగపతిబాబు హోస్ట్ జీ తెలుగులో `జయమ్ము నిశ్చయమ్మురా` షో రన్ అవుతుంది. ఇందులో టాప్ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. మొదట నాగార్జుననే గెస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత నాని, వర్మ, సందీప్ రెడ్డి వంగా, మీనా, ప్రభుదేవా వంటి వారు పాల్గొన్నారు. ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది.
నాగచైతన్య రహస్యాలు బయటపెట్టిన జగపతిబాబు
ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో నాగచైతన్య పాల్గొన్నారు. వచ్చీ రావడంతోనే జగ్గూభాయ్ ఏదో పదం అనగా చైతూ నవ్వాడు. హైదరాబాద్‌లో హిపో క్లాస్, అక్కడ మాస్ అని జగపతిబాబు అనగా, నిజానికి స్కూల్‌లో ఛాక్లెట్ బాయ్‌నే అని చెప్పాడు చైతూ. రానా చెడగొట్టాడా? అని జగపతిబాబు అడగడంతో ఆయోమయంలో పడ్డ చైతూ పాపం అలా అనకండి అన్నారు. దీంతో హౌజ్‌లో నవ్వులు విరిశాయి. చిన్నప్పట్నుంచి సిగ్గు ఎక్కువే అనుకుంటా నీకు అని జగపతిబాబు అడగ్గా, ఒక్కసారి పరిచయం అయిన తర్వాత ఇంకో సైడ్ బయటకు తీసుకొస్తాను అన్నాడు చైతూ. దీంతో ఆ సైడ్ ఏంటో చెప్పవా అంటూ జగపతిబాబు అడగడం ఫన్నీగా ఉంది. నవ్వులు పూయించింది.
చైతూలో ఇంతటి రొమాంటిక్ యాంగిల్ ఉందా?
అనంతరం 5 9 12 19 అని ఓ నెంబర్ చెప్పాడు జగపతిబాబు. ఇది వింటే ఏమైనా గుర్తుకు వస్తుందా అని చైతూని అడిగాడు. దానికి అయోమయంలో, ఆలోచనలో పడ్డాడు చైతూ. కాసేపు ఆగి ఏదైనా ఇంపార్టెంట్ డేట్సా ఇప్పుడే చెప్పండి అన్నాడు. అనంతరం అమ్మాయి నెంబరా? అని చైతూ అనడంతో మిస్ అయ్యావా? అని జగపతిబాబు కూపీ లాగే ప్రయత్నం చేశాడు. ఏం మిస్ అవ్వలేదని చైతూ అనడంతో ఆ నెంబర్ వెనకాల ఎవరో అమ్మాయి స్టోరీ ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వేమీ అటెంప్ట్ చేయకుండానే ఆడాళ్లు పడి పడి దొర్లుతుంటారు నీ కోసం అని జగపతిబాబు అనగా, ఇదేమిటో అని చైతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనంతరం మీ నాన్న అయినా దొరుకుతాడేమోగానీ నువ్వు మాత్రం దొరకవు ఎక్కడా అని జగపతిబాబు అనగా, దొరకడం ఏంటి బాబుగారు, ఏదైనా చేసి ఉంటే దొరుకుతాం, ఏం చేయకుండా ఎలా దొరుకుతామని చైతూ చెప్పడంతో `అబ్బా ఓయ్ ఓయ్` అంటూ జగపతిబాబు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అదిరిపోయింది. మొత్తంగా చైతూలో బయటకు తెలియని మన్మథుడు ఉన్నాడని అర్థమవుతుంది. అంతేకాదు ఆయన జీవితంలో చాలా రహస్యాలున్నాయని స్పష్టమవుతుంది. పెళ్లి కాకముందు ఓ ఇంటర్వ్యూలో నాగ్ కూడా అనుమానం వ్యక్తం చేశాడు. చైతూకి గర్ల్ ఫ్రెండ్ ఉందని అనుమానం, కానీ దొరకడం లేదన్నాడు. సో చైతూ రహస్యంగా చాలా చేస్తున్నాడని దీని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఎవరికీ దొరక్కుండా చేస్తున్నాడని తెలుస్తోంది.
నాగచైతన్య లవ్ స్టోరీస్, మ్యారెజెస్
నాగచైతన్య `జోష్` చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ ఆడలేదు. ఆ తర్వాత `ఏం మాయ చేసావె` మూవీతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. చైతూకీ పరిచయం అయ్యింది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకుంది. సరిగ్గా నాలుగేళ్లకి విడిపోయారు. అనంతరం మరో హీరోయిన్ శోభితా దూళిపాళ ప్రేమలో పడ్డాడు నాగచైతన్య. ఈ ఇద్దరు గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. శోభితాకిది ఫస్ట్ మ్యారేజ్ కాగా, చైతూకి రెండో వివాహం కావడం గమనార్హం. చివరగా `తండేల్`తో హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.