- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న `జబర్దస్త్` వర్ష.. మేకప్‌పై రచ్చ చేస్తున్న నెటిజన్లు..
బ్లాక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న `జబర్దస్త్` వర్ష.. మేకప్‌పై రచ్చ చేస్తున్న నెటిజన్లు..
జబర్దస్త్ వర్ష అనతి కాలంలోనే పాపులర్ అయ్యింది. ఆమె తనదైన కామెడీతో నవ్విస్తూ మంచి పేరుతెచ్చుకుంది. ఇమ్మాన్యుయెల్‌తో జోడీ కట్టి ఆకట్టుకున్న ఈ భామ గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

`జబర్దస్త్` వర్ష తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ ధరించి హోయలు పోయింది. టేబుల్‌పై కూర్చొని కవ్వించే పోజులిచ్చింది. కిల్లింగ్ పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతేకాదు బ్లాక్ డ్రెస్‌లో తన హాట్ అందాలతో సెగలు రేపుతుందీ సెక్సీ బ్యూటీ.
ప్రస్తుతం జబర్దస్త్ వర్ష పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో టూ హాట్‌గా ఉంది వర్ష. అందుకే ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
అయితే `జబర్దస్త్` షోలో వర్ష గెటప్‌పై సెటైర్లు వేస్తుంటాడు ఇమ్మాన్యుయెల్. ఇది అబ్బాయి అంటూ కామెంట్లు చేస్తుంటాడు. నవ్వించేందుకు చేసే ప్రయత్నం కాబట్టి వర్ష కూడా ఆ కామెంట్లని లైట్ తీసుకుంటుంది. అయితే ప్రారంభంలో మాత్రం ఆమె చాలా హర్ట్ అయ్యింది. పెద్ద గోల కూడా చేసింది. కానీ ఇప్పుడు కామన్‌గానే తీసుకుంటుంది.
అయితే ఇప్పుడు నెటిజన్లు కూడా అలాంటి వల్గర్‌కామెంట్లే చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె మేకప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మేకప్ తీసేసే అబ్బాయో, అమ్మాయో అర్థం కాదంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకుండా కనిపించు అసలు రూపం బయటపడుతుందంటూ, మేకప్ పూసుకుని బతికేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. చులకనగా మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది.
ఇక టీవీ సీరియల్స్ తో, యాంకరింగ్ చేస్తూ నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకుంది వర్ష. సీరియల్స్ తో మెప్పించింది. ఈ క్రమంలో `జబర్దస్త్` కామెడీ షోలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో ఇమ్మాన్యుయెల్‌తో కలిసి జోడీ కట్టింది. ఆయన టీమ్‌లో స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నారు. మొదట లవ్ స్కిట్లతో బాగా పాపులర్ అయ్యారు.
సుడిగాలి సుధీర్, రష్మి లాగా, వారి తర్వాత ఆ రేంజ్ క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ స్టేజ్‌మీదే లవ్ ప్రపోజల్స్, స్టేజ్‌మీదే, డ్యూయెట్లు, రొమాంటిక్ సాంగులు పాడుకున్నారు. అంతేకాదు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం, పెళ్లి వరకు వెళ్లారు. ఇవన్నీ టీవీ షో నిర్వహకులు టీఆర్‌పీ స్టంట్స్ అని తెలిసిందే.
కానీ వర్ష, ఇమ్మాన్యుయెల్ నిజంగానే ప్రేమించుకుంటున్నారని, ఒకరు లేకపోతే మరొకరు లేరనేలా షోస్ లో కలరింగ్ ఇప్పించారు. అభిమానుల్లో అలాంటి భావాలనే నింపారు. దీంతో వీరిద్దరు కలిసి స్కిట్లు చేయకపోయినా, ఇతరులతో చేసినా అభిమానులు అభ్యంతరం తెలియజేయడం గమనార్హం.
అంటే వీరిద్దరిని జంటగా తప్ప విడిగా చూసే పరిస్థితులో ఆడియెన్స్ లేరంటే టీవీ నిర్వహకులు ఎంతగా ఈ జంటని ఇంజెక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ భావన పోగొట్టే ప్రయత్నం చేస్తుందీ ఈ జోడీ. విడి విడిగా స్కిట్లు చేసే ప్రయత్నం చేస్తుంది.
ఇక గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది వర్ష. గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రతి వారం ఒకటి రెండు సార్లు ఇలా హాట్‌గా అందాలను ఆవిష్కరిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుందీ హాట్ బ్యూటీ.