MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తనని పెళ్లి చేసుకోవాలంటే అది కావాలంటూ ఇమ్మాన్యుయెల్‌కి జబర్దస్త్ వర్ష కండీషన్‌.. రంగంలోకి చిరు, నాగ్‌, పవన్

తనని పెళ్లి చేసుకోవాలంటే అది కావాలంటూ ఇమ్మాన్యుయెల్‌కి జబర్దస్త్ వర్ష కండీషన్‌.. రంగంలోకి చిరు, నాగ్‌, పవన్

`జబర్దస్త్`లో హాట్‌ ఫేవరేట్‌గా నిలుస్తుంది వర్ష-ఇమ్మాన్యుయెల్‌ జోడి. రష్మి, సుధీర్‌  తర్వాత ఆ స్థాయిలో పాపులర్‌ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరు పెళ్లికి సిద్దమవడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 03 2022, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో సందడి చేస్తుంది వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జోడీ. ఇందులో తమదైన స్కిట్లతో నవ్వులు పూయిస్తుంటారు. లవ్‌ స్టోరీని బయటపెడుతూ ఈ జంట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ గా ఆడియెన్స్ లో ముద్ర వేసుకున్నారు. అయితే ఈ జంటపై చాలా రూమర్స్  వచ్చాయి. తాజాగా ఏకంగా వీరిద్దరు పెళ్లికి సిద్ధమవడం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వర్ష..  గతంలో ఇమ్మాన్యుయెల్‌ని లేకుండా లైఫ్‌ని ఊహించుకోవడం కష్టం అంటూ `జబర్దస్త్`స్టేజ్‌పైనే కామెంట్‌ చేసింది. పలు మార్లు మ్యారేజ్‌ స్కిట్లు కూడా చేశారు. స్టేజ్‌పై తమ మధ్య కెమిస్ట్రీని రక్తికట్టించారు. ఇప్పుడు మరోసారి మ్యారేజ్‌కి సిద్ధపడ్డారు. అయితే తమ పెళ్లి జరగాలంటే ఆ పని చేయాలని కండీషన్‌ పెట్టింది వర్ష. 
 

36

ఇమ్మూ మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ కావాలని తెలిపింది. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన ఇమ్మాన్యుయెల్‌,  దానిదేముందే తనకు చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌ వీలంతా తెలుసు అంటూ బిల్డప్‌ కొట్టారు. దీంతో వారిని పెళ్లికి తీసుకురమ్మని చెప్పింది వర్ష. ఆమె కోరికని కాదనలేకపోయాడు ఇమ్మూ. ఆమెపై ఉన్న  ప్రేమ ముందు  ఇది పెద్ద కష్టం కాదనుకున్నాడు. దీంతో సెలబ్రిటీలను రంగంలోకి దించారు. 
 

46

చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణని  పెళ్లికి ఆహ్వానించారు. వారంతా వచ్చిన డాన్సులతో రఫ్ఫాడించారు. తమదైన సిగ్నేచర్‌ స్టెప్పులతో హోరెత్తించారు. పెళ్లికి ముందు మరో ట్విస్ట్ ఇచ్చింది వర్ష. సంగీతం ఫంక్షన్‌ పెట్టుకుందామని తెలిపింది. దీంతో చిరు, నాగ్‌,  పవన్‌(గెటప్ ఆర్టిస్టులు)లతో కలిసి మాస్‌ స్టెప్పులేసింది. `నేను అట్టాంటి ఇట్టాంటి  ఆడదాన్ని  కాదు మామో.. ` అనే పాటకి  ఊరమాస్‌ స్టెప్పులేసింది వర్ష. 
 

56

ఇది చూసిన ఇమ్మాన్యుయెల్‌ఆమెపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. చిరు,  నాగ్‌,  పవన్‌ లకు సారీ చెబుతూ, ఆమె అంతకు ముందు అలాంటి పనులే చేసేది అందుకే ఇలా చేసింది,  ఏమనుకోకండి అంటూ తెలిపారు. దీంతో జబర్దస్త్ హౌజ్‌లో నవ్వులు పూయగా, వర్ష మొఖం వాడిపోయింది. వీరి స్కిట్‌ ఆద్యంతం కామెడీని పండించింది. హైలైట్‌గా నిలిచింది. 
 

66

ఎక్స్ ట్రా  జబర్దస్త్ లేటెస్ట్  ప్రోమో విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో గెటప్‌ శ్రీను, గౌతమ్‌రాజు, రాకేష్‌ టీమ్‌ల స్కిట్లు సైతం నవ్వులు పూయించాయి.దీనికి ఖుష్బు  చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఇది అసలైన కామెడీ షో అంటూ కీతాబిచ్చింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Recommended image2
Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?
Recommended image3
Trisha: 3 సినిమాలు, 1200 కోట్లు, ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన త్రిష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved