MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాక్ పాట్‌ కొట్టిన రష్మి.. మొన్న సుధీర్‌, నిన్న అనసూయ.. ఊహించని ఆఫర్స్ తో `జబర్దస్త్` యాంకర్‌ రచ్చ..

జాక్ పాట్‌ కొట్టిన రష్మి.. మొన్న సుధీర్‌, నిన్న అనసూయ.. ఊహించని ఆఫర్స్ తో `జబర్దస్త్` యాంకర్‌ రచ్చ..

`జబర్దస్త్` యాంకర్‌ రష్మిని అదృష్టం వరించింది. ఆమెకి బ్యాక్‌ టూ బ్యాక్‌ జాక్‌పాట్‌ లు తగలడంతో ఆనందంలో మునిగితేలుతుంది. లేటెస్ట్ వచ్చిన ఆఫర్‌తో ఇప్పుడు ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2022, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యాంకర్‌ రష్మి(Anchor Rashmi) `జబర్దస్త్`(Jabardasth)తో పాపులర్‌ అయ్యి హాట్‌ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. ఈ కామెడీ షోలో రష్మి అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంటాయి. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `జబర్దస్త్`కి రేటింగ్‌ రావడంలో తన పాత్ర కీలకంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామెడీకి గ్లామర్‌ తోడు కావడంతో తొమ్మిదేళ్లుగా విజయవంతంగా రన్ అవుతుంది `జబర్దస్త్`. 
 

28

ఓ వైపు యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది Rashmi Gautam. `గుంటూరు టాకీస్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బోల్డ్ రోల్‌లో మెప్పించింది. ఆ తర్వాత ఒకటి అర సినిమాలు చేసింది. వాటిలో కొన్ని ఎప్పుడొచ్చాయో తెలియకుండా వచ్చిపోయాయి. మరికొన్ని విడుదలకు నోచుకోలేదు. దీంతో సినిమా ప్రయత్నాలకు దూరంగా ఉంది యాంకర్‌ రష్మి. 

38

కేవలం తనకు గుర్తింపు, క్రేజ్‌ని తీసుకొచ్చిన `ఎక్స్ ట్రా జబర్దస్త్` నే నమ్ముకుంది. చాలా రోజులుగా ఆ ఒక్క షోతోనే కెరీర్‌నీ లాక్కొస్తుంది రష్మి. మధ్యలో ఇతర షోస్‌లో గెస్ట్ గా పార్టిసిపేట్‌ చేస్తుంది తప్ప రెగ్యూలర్‌ షోస్‌ లేవు. అయితే `ఢీ 13`లో క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరించి అలరించారు. అందులోనూ సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో కలిసి రచ్చ చేశారు. జబర్దస్త్‌లోనే కాదు, ఢీ షోలోనూ వీరిద్దరు రెచ్చిపోయి కెమిస్ట్రీ పండించారు. షోలకు టీఆర్‌పీ తీసుకొచ్చారు. కానీ `ఢీ` లేటెస్ట్ సీజన్‌లో నుంచి తీసేశారు. మళ్లీ ఒక్క షోనే ఆమె చేతిలో ఉండిపోయింది.
 

48

కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. అదృష్టం రష్మిని వెంటాడుతుంది. ఒకదాని తర్వాత మరో షో వస్తూ ఆమెని ఫుల్‌ బిజీ చేస్తుంది. ఇప్పుడు రెండు పాపులర్‌ షోస్‌ యాంకర్‌ రష్మి తలుపు తట్టడం విశేషం. ఆ మధ్య యాంకర్‌గా చేస్తున్న సుడిగాలి సుధీర్‌ `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని వదిలేశాడు. దీంతోపాటు `జబర్దస్త్`ని కూడా ఆయన వదిలేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీ కావడం వల్ల ఈ షోస్‌ని వదిలేసినట్టు చెప్పారు. దీంతో సుధీర్‌ స్థానంలో యాంకర్‌గా రష్మికి ఛాన్స్ వచ్చింది.

58

`ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి కూడా యాంకర్‌గా చేస్తూ ఆకట్టుకుంటుంది. షోలను తనదైన స్టయిల్‌లో రక్తి కట్టిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో బంపర్‌ ఆఫర్‌ రష్మిని వరించింది. ఆమెకి `జబర్దస్త్` షో కి కూడా యాంకర్‌గా చేసే అవకాశం లభించడం విశేషం. `జబర్దస్త్` రెండు షోలుగా వస్తోన్న విషయం తెలిసిందే. గురువారం `జబర్దస్త్`, శుక్రవారం `ఎక్స్ ట్రా జబర్దస్త్` (ఈటీవీలో)ప్రసారమవుతాయి. జబర్దస్త్ కి అనసూయ(Anasuya), `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి రష్మి యాంకర్లుగా ఉన్నారు. 

68
<p>కామెడీ షో జబర్దస్త్ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ప్రేక్షకుల వినోద సాధనాలలో జబర్దస్త్ ఒకటిగా ఉంది. నాన్ స్టాప్ గా&nbsp;కామెడీ&nbsp;పంచే&nbsp;ఈ&nbsp;షోలో&nbsp;యాంకర్స్&nbsp;అందాల విందు కూడా మరో ఆకర్షణ. జబర్దస్త్ యాంకర్స్ గా ఉన్న రష్మీ&nbsp;మరియు అనసూయలకు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్&nbsp;తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు&nbsp;హీరోయిన్స్&nbsp;గా కూడా చేయడం జరిగింది.&nbsp;<br />&nbsp;</p>

<p>కామెడీ షో జబర్దస్త్ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ప్రేక్షకుల వినోద సాధనాలలో జబర్దస్త్ ఒకటిగా ఉంది. నాన్ స్టాప్ గా&nbsp;కామెడీ&nbsp;పంచే&nbsp;ఈ&nbsp;షోలో&nbsp;యాంకర్స్&nbsp;అందాల విందు కూడా మరో ఆకర్షణ. జబర్దస్త్ యాంకర్స్ గా ఉన్న రష్మీ&nbsp;మరియు అనసూయలకు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్&nbsp;తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు&nbsp;హీరోయిన్స్&nbsp;గా కూడా చేయడం జరిగింది.&nbsp;<br />&nbsp;</p>

అయితే అనసూయ కూడా `జబర్దస్త్`ని వీడింది. ఆమె సినిమాల్లో బిజీగా కావడం, `స్టార్‌ మా`లో `సూపర్‌ సింగర్‌ జూనియర్‌`కి యాంకర్‌గా చేసే ఛాన్స్ రావడం, భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో దీన్ని వదిలేసింది అనసూయ. దీంతో ఆమె స్థానంలో `జబర్దస్త్`కి కొత్త యాంకర్‌ని తీసుకొస్తారనే టాక్ వినిపించింది. కానీ దీనికి కూడా రష్మినే యాంకర్‌గా ఫైనల్‌ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఊరించి ఊరించి ఉసూరమనిపించారు `మల్లెమాల` నిర్వహకులు. 

78

`జబర్దస్త్`కి కూడా రష్మినే యాంకర్‌ గా ఫైనల్‌ చేయడంతో ఇప్పుడు ఆనందంలో మునిగితేలుతుందీ హాట్‌ యాంకర్‌. ఆమె సంతోషానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఇది చూసి ఫ్యాన్స్, నెటిజన్లు కూడా రెచ్చిపోతున్నారు. జాక్ పాట్‌ అంటే రష్మిదే అని, హాట్‌ యాంకర్‌కి బంపర్‌ ఆఫర్స్ అని, అదృష్టం రష్మి తలుపు తట్టిందని, సుధీర్‌, అనసూయ చేసిన పనికి పండగా చేసుకుంటున్న రష్మి అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రష్మిని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. 
 

88

మొత్తంగా ఇప్పుడు మూడు షోలతో దూసుకుపోతుంది రష్మి. `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలతో ఫుల్‌ బిజీ అయ్యింది. అనసూయ, సుడిగాలి సుధీర్‌ల కారణంగా పండగా చేసుకుంటుందీ సెక్సీ అందాల యాంకర్. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
వినోదం
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Dubey House: 'రామాయణం' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Recommended image2
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Recommended image3
Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved