- Home
- Entertainment
- `జబర్దస్త్` పంచ్ ప్రసాద్ కమ్ బ్యాక్.. బెడ్ రెస్ట్ లో ఉండాలని చెప్పినా రీఎంట్రీ.. కారణం చెబుతూ ఎమోషనల్
`జబర్దస్త్` పంచ్ ప్రసాద్ కమ్ బ్యాక్.. బెడ్ రెస్ట్ లో ఉండాలని చెప్పినా రీఎంట్రీ.. కారణం చెబుతూ ఎమోషనల్
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కమ్ బ్యాక్ బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు చెప్పినా వినకుండా షోకి రీఎంట్రీ.. అసలు కారణం చెబుతూ షోలోనే అందరి ముందు ఎమోషనల్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. కమెడియన్లని తయారు చేసింది. ఈ షో ద్వారా చాలా మంది సినిమాల్లో సెటిల్ అయ్యారు. హీరోలుగానూ, కమెడియన్లుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా రన్ అవుతునా, ఇప్పటికీ అదే క్రేజ్ ఈ షో సొంతం. ఇంటిళ్లిపాదిని నవ్వించే షోగా మారింది.ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తట్టుకుని నిలబడింది. ఇంకా లైఫ్ ఇస్తుంది. ఈ షోలో ద్వారా పాపులర్ అయిన వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు.
తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వులు పూయిస్తున్నారు. కామెడీ టైమింగ్‌లో, పంచ్‌లు వేయడంలో ప్రసాద్ తర్వాతనే ఎవరైనా అనేంతగా పేరుతెచ్చుకున్నారు. తన పంచ్ లను ఇంటిపేరుగా మార్చుకుని పంచ్ ప్రసాద్ అయ్యారు. అయితే ఆయన నిత్యం అనారోగ్యంతో మరింత వార్తల్లో నిలుస్తుంటారు. ప్రసాద్‌కి కిడ్నీ సమస్యలున్నాయి. ఆయన రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి.
కిడ్నీల సమస్యల కారణంగా ఇప్పటికే రెండు సార్లు ఆయన జబర్దస్త్ షోని వీడారు. దీంతో పాటు ఆయన `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ పాల్గొంటుంటారు. దీంతోఈ షోకి కూడా ఆయన రావడం లేదు. ఇటీవల మరోసారి ఆయనకు ఆసుపత్రి పాలయ్యారు. కిడ్నీలు ట్రాన్ఫప్లాంటేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఏపీ జగన్ ప్రభుత్వం సహకారంతో ఆ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన బెడ్ రెస్ట్‌లో ఉన్నారు.
కానీ అనూహ్యంగా ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు. ఆపరేషన్ జరిగిన రెండు నెలలకే ఆయన మళ్లీ షోస్ చేయడంప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలు, బాధలు పంచుకున్నారు పంచ్ ప్రసాద్. `అశ్వద్థామ 3.0` కమ్ బ్యాక్ అంటూ ఆయన తనదైన స్టయిల్లో డైలాగులు చెబుతూ రీఎంట్రీ ఇచ్చారు. ఉర్రూతలూగించారు. ఆ తర్వాత హైపర్ ఆదితో కలిసి కాసేపు కామెడీ చేశాడు.
ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్‌ని దిమ్మతిరిగిలేచేశాడు. బలుబు చూపించింది. ఇదేంటని అడగ్గా, బలుపు అని ఇమ్మాన్యుయెల్ చెప్పడం, ఇదే తగ్గించుకోమని ప్రసాద్ చెప్పడం నవ్వులు పూయించింది. ఈ క్రమంలో హైపర్ ఆది.. శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్ కావడం, ఇన్నాళ్లు ఇంట్లో ఉండటం ఎలా ఉందనే అనుభావాలను అడిగారు. దీనికి పంచ్ ప్రసాద్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
తన ఆపరేషన్ తర్వాత డాక్టర్లు ఆరు నెలలు కనీసం బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలిపారు. కానీ నేనే త్వరగా వచ్చాను. ఎందుకంటే అంటూ పంచ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అందరి ముందు స్టేజ్‌పైనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చెప్పేదాన్ని ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా తప్పని పరిస్థితుల్లో ఆయన రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇటీవల పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో మంచం పడటంతో ఆయనకు ఆపరేషన్ చేయడానికి డబ్బుల్లేవని, ఇమ్మాన్యుయెల్, ప్రసాద్ భార్య సునీత వేడుకున్నారు. దీంతో కొంత మంది దాతలు స్పందించారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఆయనకు సహకారం అందించిన విషయం తెలిసిందే.