లేడీ గెటప్పులతో అలరించే జబర్దస్త్ మోహన్ పెళ్లి వేడుక..హాజరైన కమెడియన్లు
జబర్దస్త్ లో లేడీ గెటప్పుల్లో కనిపించే వారికి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అయితే వారి ఒరిజినల్ ముఖాలు ఆడియన్స్ కి అంతగా తెలియవు. వారిని లేడీ గెటప్పుల్లోనే చూస్తుంటారు.
చాలా మంది కమెడియన్లకు జబర్దస్త్ అడ్డాగా మారింది. నటనలో ఆసక్తి ఉన్నవారు, హాస్యంతో మెప్పించగలిగేవారు జబర్దస్త్ లో రాణిస్తున్నారు. చాలా మంది జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో వెండితెరపై కూడా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, అదిరే అభి, చమ్మక్ చంద్రలాంటి వాళ్లంతా జబర్దస్త్ తో గుర్తింపు పొందినవారే.
ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్పుల్లో కనిపించే వారికి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అయితే వారి ఒరిజినల్ ముఖాలు ఆడియన్స్ కి అంతగా తెలియవు. వారిని లేడీ గెటప్పుల్లోనే చూస్తుంటారు. అలాంటి వారిలో జబర్దస్త్ మోహన్ ఒకరు. జబర్దస్త్ మోహన్ లేడీ గెటప్పుల్లో కనిపిస్తూ చాలా స్కిట్ లు చేశారు.
ఇదిలా ఉండగా జబర్దస్త్ మోహన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. జబర్దస్త్ మోహన్ వివాహం ఘనంగా జరిగింది. జబర్దస్త్ మోహన్ వివాహ వేడుకకి చాలా మంది కమెడియన్లు హాజరై వధూవరులని ఆశీర్వదించారు.
జబర్దస్త్ మోహన్ పెళ్లి వేడుకకి అదిరే అభి, గడ్డం నవీన్, రాకెట్ రాఘవ, అప్పారావు లాంటి కమెడియన్లు హాజరయ్యారు. మోహన్ పెళ్లి వేడుకకి సంబందించిన ఫోటోలని నవీన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
జబర్దస్త్ మోహన్ వేదికపై వేసే లేడీ గెటప్పులు భలే గమ్మత్తుగా ఉంటాయి. గెటప్పులు మాత్రమే కాదు.. అచ్చం లేడి లాగే బాడీ లాంగ్వేజ్ కనబరుస్తూ నవ్వించడం మోహన్ శైలి.
రాకెట్ రాఘవకి భార్యగా మోహన్ చాలా స్కిట్ లలో కనిపించాడు. అయితే జబర్దస్త్ మోహన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే క్లారిటీ కూడా లేదు.