MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అన్న వదినెక్కడ అందరూ అడుగుతున్నారు వర్ష మాత్రం నా ఫోన్ ఎత్తదు... లవ్ ట్రాక్స్ తో లైఫ్ నాశనం చేశారు

అన్న వదినెక్కడ అందరూ అడుగుతున్నారు వర్ష మాత్రం నా ఫోన్ ఎత్తదు... లవ్ ట్రాక్స్ తో లైఫ్ నాశనం చేశారు

జబర్దస్త్ ఇమ్మానియేల్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన లవర్ వర్షను ఉద్దేశిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేము లవర్స్ కాదంటూ బాంబు పేల్చాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 14 2022, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jabardasth Varsha

Jabardasth Varsha


ఈటీవీ షోస్ లో లవ్ ట్రాక్స్ వెరీ కామన్. సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ బుల్లితెర ప్రేమికులు అనే బ్రాండ్ నేమ్ తో ఫుల్ ఫేమస్ అయ్యారు. అది టెలివిజన్ షోస్ మేకర్స్ కి కూడా భారీ టిఆర్పి తెచ్చిపెట్టాయి. వాళ్ళ స్పూర్తితో అనేక బుల్లితెర లవర్స్ పుట్టుకొచ్చారు. వాళ్లలో మంచిగా ఫేమస్ అయిన జంట ఇమ్మానియేల్, వర్ష. 

 

26

సీరియల్ నటి వర్ష ఓ రెండేళ్ల క్రితం జబర్దస్త్ లోకి వచ్చారు. ఆమె చాలా త్వరగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కారణం... మరో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ లో ఆమె రొమాన్స్ కురిపిస్తూ ఉంటారు. అతనంటే చచ్చేంత ప్రేమ అన్నట్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆన్ స్కిట్ కాకుండా ఆఫ్ స్కిట్ లో ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటారు. అతడు లేకుండా బ్రతకలేను అంటారు.

36


చాలా సందర్భాల్లో ఇమ్మానియేల్ ని వర్ష తన లవర్ అన్నట్లు ప్రేక్షకుల్లో అభిప్రాయం కలిగేలా చేశారు. ఈ లవ్ ట్రాక్స్ వర్ష, ఇమ్మానియల్ కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఇవన్నీ కేవలం హైప్ కోసం వేసే ట్రాక్స్ మాత్రమే మా మధ్య ఏమీ లేదని ఇమ్మానియేల్ ఓపెన్ అయ్యారు. 

46


లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లితెర లవర్స్ పై స్కిట్ చేశారు. గెటప్ శ్రీను యముడు గెటప్ వేయగా... లవర్స్ చనిపోయి నరకానికి వెళితే అక్కడ వాళ్లకు ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కామిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వర్ష, ఇమ్మానియేల్ వంతు రాగా... ఆయన మేము లవర్స్ కాదని ఒప్పుకున్నాడు. 

56

నేను దాన్ని వాడుకొని ఫేమస్ కావడం ఏమిటీ నన్ను వాడుకొని అది ఫేమ్ తెచ్చుకుంది. ఎవరండీ లవర్స్, మేం లవర్స్ కాదు. అక్కడ ఓ ట్రాక్ ప్లే చేస్తారు. వర్ష, నేను చిన్నగా దగ్గరకు వెళతాం. ఈ ట్రాక్‌లు వేసి నా కొంప ముంచారు.స్కిట్ అవ్వగానే ఇంటికి వెళ్లి నా నంబరు బ్లాక్‌లో పెడుతుంది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా...  అన్నా.. వదిన ఎక్కడా? అని అడుగుతున్నారు. వర్ష ఎక్కడుంటుందో నాకేం తెలుసు, అని ఫన్నీగానే ఉన్న విషయం చెప్పారు. 
 

66

ఇమ్మానియేల్ లేటెస్ట్ కామెంట్స్ తో వాళ్ళ రిలేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. రష్మీ, సుధీర్ సైతం కేవలం స్కిట్స్ కోసం ప్రేమికులుగా నటించినట్లు వెల్లడించారు. అలాగే తాము మంచి మిత్రులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. బుల్లితెరపై ప్రేమికులుగా నటించేవాళ్లలో అందరూ ఈ బాపతే.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: మాల్దీవుల్లో భర్తతో గేమ్ ఛేంజర్ హీరోయిన్, రొమాంటిక్ ఫోటోస్ వైరల్
Recommended image2
Trisha : దళపతి విజయ్ కోసం స్టార్ హీరోయిన్‌తో త్రిష గొడవపడిందా? నిజమెంత?
Recommended image3
Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved