- Home
- Entertainment
- జబర్దస్త్ అవకాశాల కోసం అబ్బాయినని అబద్ధం చెప్పా... కానీ నేను ట్రాన్స్ జెండర్ ని.. తన్మయి సంచలన విషయాలు వెల్లడి
జబర్దస్త్ అవకాశాల కోసం అబ్బాయినని అబద్ధం చెప్పా... కానీ నేను ట్రాన్స్ జెండర్ ని.. తన్మయి సంచలన విషయాలు వెల్లడి
`జబర్దస్త్`లో ఇప్పటికే ప్రియాంక.. ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడీయన్ అసలు రహస్యం బయటపడింది. జబర్దస్త్ కమెడీయన్ తన్మయి తన జెండర్ గురించి ఓపెన్ అయ్యింది. యాంకర్ సుమ ముందు తన గోడు వెళ్లబోసుకుంది.

`జబర్దస్త్` షో ఎంతో మంది కమెడీయన్లకి లైఫ్ ఇచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద కళాకారులకు గుర్తింపునిచ్చింది. వారిని స్టార్స్ ని చేసింది. అలా మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న వారిలో తన్మయి ఒకరు. జనరల్‌గా ఈ కామెడీ షోలో అబ్బాయిలు అమ్మాయిలుగా గెటప్‌లు మార్చి కామెడీలు చేస్తుంటారు. అలా కామెడీ చేసే వారి తన్మయి కూడా ఒకరు.
తన్మయి నిజజీవితంలో అబ్బాయిగా జన్మించిందట. కానీ తనకు అమ్మాయిల లక్షణాలు కనిపిస్తున్నాయట. ఏమైందని టెస్ట్ లు చేయిస్తే హార్మోన్స్ ఇమ్‌బ్యాలెన్స్ వల్ల జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో తాను అమ్మాయిగా మారిపోయానని తెలిపింది. అయితే దీనివెనకాల పెద్ద కథ ఉందని పేర్కొంది తన్మయి. తాజాగా ఆమె సుమ యాంకర్‌గా రన్ అవుతున్న `క్యాష్` ప్రోగ్రామ్‌లో పాల్గొంది. తన మదర్‌తో కలిసి ఆమె ఈ షోలో సందడి చేశారు.
ఈ సందర్భంగా తన జీవితంలోని రహస్యాన్ని బయటపెట్టింది. తాను తమ తల్లిదండ్రులకు అబ్బాయిగా జన్మించానని, కానీ ఇప్పుడు అమ్మాయిగా మారిపోయానని తెలిపింది. ఈ విషయంలో పేరెంట్స్ ని మోసం చేశానని పేర్కొంది తన్మయి. అందుకు తన అమ్మ కాళ్లు మొక్కి క్షమాపణలు తెలిపింది.
అయితే తాను అబ్బాయినే అని `జబర్దస్త్` షోలోనూ చెప్పుకుంటూ వస్తుందట. తాను అబ్బాయి కాదంటే ఎక్కడ ఛాన్స్ లు ఇవ్వరో అనే భయంతో, నన్ను ఇంట్లో వాళ్లు ఏమంటారు, వారి పరువు ఏమైపోతుందే అని అబ్బాయిగానే చెప్పుకుంటూ వస్తున్నట్టు తెలిపింది తన్మయి. అలానే షోలో ప్రవర్తించినట్టు పేర్కొంది.
దీనిపై వాళ్లమ్మ స్పందిస్తూ ఎవరెన్నీ అనుకున్నా.. నా బిడ్డ నాకు కావాలి అని పేర్కొనడం కన్నీళ్లు పెట్టిస్తుంది. తన్మయి చెప్పిన విషయాలకు ఇతర జబర్దస్త్ కమెడీయన్లు, ఆడియెన్స్ సైతం ఎమోషనల్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నారు.
ఈ సన్నివేశాలు తాజాగా విడుదలైన `క్యాష్` లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలోని సన్నివేశాలు. విడుదలైన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. అభిమానులను అలరిస్తుంది. ఈ శనివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకి తన్మయితోపాటు వినోద్ తన భార్యతో కలిసి, హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్ మదర్ తో షోలో పాల్గొన సందడి చేశారు.