బిగ్ బాస్ 9 షో 2.0.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బజ్.. లిస్ట్ లో ఎవరెవరంటే?
Bigg Boss Telugu 9 Wild Card Entries: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ట్విస్టులు, డ్రామాలు, కాంట్రవర్సీలతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రియాలిటీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో న్యూ కంటెస్టెంట్లు హౌస్ లోకి రాబోతున్నారట.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల బజ్
Bigg Boss Wild Card Entries: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ట్విస్టులు, డ్రామాలు, కాంట్రవర్సీలతో షో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటివరకు విజయవంతంగా రెండు వారాలను పూర్తి చేసుకుని, మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సారి సెలబ్రిటీలు vs సామాన్యులు కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. షో ప్రేక్షకులకి ఆశించినంత ఉత్కంఠ ను ఈ రియాలిటీ ఎంటర్టైన్‌మెంట్ అందిస్తోంది. టాస్కులు, గేమ్స్. కాంట్రవర్సీలతో బిగ్ బాస్ హౌస్ ను హీటెక్కించి, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు షో నిర్వహకులు.
మరింత జోష్
ఇప్పటివరకు ఎంతో ఉత్కంఠ గా సాగుతున్న ఈ బిగ్ బాస్ షో మరింత జోష్, అదనపు ఉత్సాహాన్ని, రెట్టింపు వినోదాన్ని అందించడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కామనర్స్, సెలబ్రెటీల కంటెస్టెంట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఆ పోటీని మరింత ఉత్కంఠ భరితంగా మార్చడానికి, నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు సోషల్ మీడియా, బిగ్బాస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే వీకెండ్ లో గానీ, ఆ తర్వాత వారంలో గాని ఐదు నుండి ఏడుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకురాబోతున్నారు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పాత కంటెస్టెంట్లు కాగా, మిగతా వారందరూ కొత్తవారే. అందులో కొత్తమంది సెలబ్రెటీలు కాగా, కొంతమంది కామర్స్ కూడా వచ్చే అవకాశముందట.
వైల్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ ఇదే..
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 2.0 ప్రారంభించి, షో ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చబోతున్నారట. అలాగే, ఈ వారం డబుల్ ఎవిక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి, పాత వారిని ఎలిమినేట్ చేసి, కొత్త కంటెస్టెంట్లకు రెడ్ కార్పెట్ వేయబోతున్నారట. బిగ్ బాస్ రివ్యూయరస్ ప్రకారం.. సీరియల్ నటి సుహాసిని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ బుల్లి తెర భామకు టీవీ సీరియల్ తో మంచి ఫేమ్ ఉంది. ఆమెను టీవీ ప్రేక్షకులు తమ ఇంటి ఆడపడుచుగా అభిమానిస్తారు.. ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో కాలుపెడితే.. టీఆర్పీ ఎగబాగడం ఖాయం. మరో వైపు సిరీయల్ నటి కావ్య కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సీరియల్ తో ఈమెకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే టీవీ సీరియల్స్ నటుడు, యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన శివ కుమార్ కూడా హౌస్‌లోకి రాబోతోందని సమాచారం.
కాంట్రవర్సీ క్వీన్స్
అలాగే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా రమ్య మోక్ష కంచర్ల (అలియాస్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య), రాజకీయ నాయకురాలు ప్రసిద్ధి చెందిన దివ్వెల మాధురి కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యను మొదటనే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, ఆమెను కావాలనే వ్యూహాత్మకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించబోతున్నారట.
బిగ్ బాస్ ఫేమ్
పైన పేర్కొన్న వారితో పాటు షో నిర్వాహకులు వా చెఫ్ సంజయ్ తుమ్మా లేదా మాజీ పోటీదారుడిని హౌస్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నారట. సీజన్ 6 ఫేమ్ అమర్‌దీప్ చౌదరిను కూడా హౌస్‌లోకి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం కొద్దిరోజుల్లో వెల్లడించబడుతుంది. అయితే హౌస్‌లో కొత్త ఎంట్రీలతో రియాలిటీ షో మరింత ఉత్కంఠభరితంగా మారబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.