- Home
- Entertainment
- అనారోగ్యంతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడా..? ఇదేం ట్విస్ట్ సామీ!
అనారోగ్యంతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడా..? ఇదేం ట్విస్ట్ సామీ!
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడన్న వార్త సంచలనం రేపుతోంది. ఇమ్మానియేల్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేయడంతో వైరల్ గా మారింది.

Jabardasth Punch Prasad
జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకడైన పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కిడ్నీ సంబంధించిన వ్యాధికి గురయ్యారు. ప్రాణాల మీదకు రావడంతో తోటి కమెడియన్స్ ఆదుకున్నారు. పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి కావలసిన ఆర్థిక సహాయం చేశారు. జబర్దస్త్ జడ్జెస్ రోజా, నాగబాబు కూడా తమ వంతు సహాయం చేశారని సమాచారం.
Jabardasth Punch Prasad
ఈ కారణంగా చాలా కాలం పంచ్ ప్రసాద్ బుల్లితెరకు దూరమయ్యాడు. జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోస్ లో అతడు కనిపించలేదు. డయాలసిస్ చేయించుకుంటున్న ప్రసాద్ కోలుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక రీ ఎంట్రీ ఇచ్చాడు.
Jabardasth Punch Prasad
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి కామెడీ షోలలో పంచ్ ప్రసాద్ పాల్గొంటున్నారు. తనమార్కు కామెడీ పంచెస్ వేస్తూ నవ్వులు పోయిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై కూడా కమెడియన్స్ జోకులు వేస్తారు. ఆయన కూడా తనపై తాను పంచెస్ వేసుకుంటున్నారు.
Jabardasth Punch Prasad
అలాంటి పరిస్థితుల్లో ఉన్న పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడన్న వార్త సంచలనం రేపింది. కమెడియన్ ఇమ్మానియేల్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. ఆరోగ్యం అంతంత మాత్రం ఉన్న ప్రసాద్ రెండో వివాహం చేసుకోవడం ఏంటనే సందేహాలు మొదలయ్యాయి.
Jabardasth Punch Prasad
అయితే ఇదంతా కమెడియన్ ఇమ్మానియేల్ క్రియేట్ చేసిన హైప్ అని తెలుస్తుంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రసాద్ కి ఆయన భార్యతో పెళ్లి చేశారు. ఆ ఎపిసోడ్లో పంచ్ ప్రసాద్ కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ వీడియో ప్లే చేశారు.
Jabardasth Punch Prasad
యూట్యూబ్ లో పెట్టిన పంచ్ ప్రసాద్ పెళ్లి వీడియోకి వ్యూస్ రాబట్టడం కోసం ఇమ్మానియేల్ తన ఇంస్టాగ్రామ్ లో పంచ్ ప్రసాద్ కి రెండో పెళ్లి అని థంబ్ నైల్ పెట్టి వదిలాడని తెలుస్తుంది. ఆ థంబ్ నైల్ లో అమ్మాయి ముఖం బ్లర్ చేయడంతో నిజమేనని కొందరు భ్రమపడ్డారు. జరిగిన విషయం అది, పంచ్ ప్రసాద్ ఎవరినీ పెళ్లి చేసుకోలేదని క్లారిటీ వచ్చేసింది.