- Home
- Entertainment
- రెడ్ లెహంగా చోళీలో `జబర్దస్త్` యాంకర్ అందాలు మైండ్ బ్లాక్.. ఆ స్మైల్‌కి ఎవ్వరైనా పడిపోవాల్సిందే
రెడ్ లెహంగా చోళీలో `జబర్దస్త్` యాంకర్ అందాలు మైండ్ బ్లాక్.. ఆ స్మైల్‌కి ఎవ్వరైనా పడిపోవాల్సిందే
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు నెమ్మదిగా అనసూయ, రష్మిల రూట్‌లోకి వస్తుంది. వారిలాగే ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

`జబర్దస్త్` యాంకర్ సౌమ్య రావు ప్రతి వారం గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంది. లేటెస్ట్ గా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది కొత్త యాంకర్. రెడ్ లెహంగా చోళీలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ సౌమ్య రావు అందం మరింత పెరిగిపోవడం విశేషం.
అసలే స్లిమ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేసే అందం సౌమ్య రావుది. కత్తిలాంటి నడుము, చురకత్తుల్లాంటి చూపులు కుర్రాళ్లని గుచ్చేస్తుంటాయి. దానికి అదిరిపోయే డ్రెస్ తోడైతే, మరింత హాట్‌గా పోజులిస్తే ఆ ఘాటు ఓవర్ లోడ్ అవుతుంది. ఇప్పుడు రెడ్ డ్రెస్‌లో జబర్దస్త్ కొత్త యాంకర్ అందాలు అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.
అంతకు ముందు `జబర్దస్త్`కి అనసూయ యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. అనసూయ ఈ షోకోసం ముస్తాబైన తీరు, డాన్సులు అదిరిపోయేలా ఉండేవి. ఆమె ఫోటో షూట్ పిక్స్ షేర్ చేస్తే ఇంటర్నెట్ షేక్ అయిపోయేది. అంతటి క్రేజీ అనసూయ సొంతం. ఇప్పుడు సౌమ్య రావు కూడా నెమ్మదిగా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కాస్త హాట్ డోస్ పెంచుతుంది.
ఇక తనదైన స్టయిల్‌లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అందాల సోయగం. ఆమె చెప్పే డైలాగ్‌లు, వేసే పంచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. వచ్చీ రాని తెలుగులో క్యూట్ క్యూట్‌గా డైలాగులు చెబుతూ మెస్మరైజ్ చేస్తుంది సౌమ్య రావు. ఆడియెన్స్ ని అలరిస్తుంది.
మొదట్లో హైపర్ ఆదితో కలిసి బాగా రచ్చ చేసింది. ఈ బ్యూటీని రెండు మూడు ఎపిసోడ్లలో బాగా ఆడుకున్నాడు హైపర్ ఆది. పంచ్ ల మీద పంచ్‌లేస్తూ అదరగొట్టాడు. ఈ అమ్మడు కూడా అదే రేంజ్‌లో కౌంటర్లిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే క్రమంలో ఆ పంచ్‌లు తగ్గిపోయాయి. మొదటి రెండు మూడు వారల్లో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో షో రెగ్యూలర్‌గా సాగిపోతుందనే ఫీలింగ్ అభిమానుల నుంచి వ్యక్తమవుతుంది.
సౌమ్య రావు కన్నడ నుంచి వచ్చిన నటి. తెలుగులో సీనియర్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ షోకి యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ షోకి యాంకర్‌గా చేస్తూ ఆటోమెటిక్‌గా వాళ్లు పాపులర్ అయిపోతుంటారు. సౌమ్య రావుకి కూడా ఆ పాపులారిటీ వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.