సింగర్ సునీత ఇంట్లో ఐటీ రైడ్స్, వాళ్ళతో సంబంధం ఉన్న ఎవ్వరినీ వదలడం లేదుగా..
రెండు రోజులుగా ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళని జల్లెడ పడుతున్నారు. బడా నిర్మాతలని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన చిత్రాల నిర్మాతల ఇళ్ళలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Singer Sunitha
రెండు రోజులుగా ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళని జల్లెడ పడుతున్నారు. బడా నిర్మాతలని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన చిత్రాల నిర్మాతల ఇళ్ళలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలని దిల్ రాజు నిర్మించారు.
Singer Sunitha
ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ చిత్రాల బిజినెస్ లెక్కలు నిగ్గు తేల్చేందుకు ఐటీ అధికారులు రైడ్ నిర్వహించి పలు లావాదేవిలని పరిశీలించారు. దీని కోసం దిల్ రాజు సతీమణిని తేజస్వినిని కూడా బ్యాక్ వద్దకి అధికారులు తీసుకెళ్లారు. ఆమె చేత లాకర్ ని పరిశీలించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఆఫీసుల్లో కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. పుష్ప 2 చిత్ర బిజినెస్, లావాదేవిలని పరిశీలించినట్లు తెలుస్తోంది. పలు కీలక లావాదేవీలని అధికారులు గుర్తించినట్లు సమాచారం. అదే విధంగా సుకుమార్ ఇంట్లో కూడా దాడులు చేశారట. నిర్మాతలతో సంబంధం ఉన్న ఎవ్వరినీ అధికారులు వదలడం లేదు.
సింగర్ సునీత ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయట. ఆమె భర్త రామకృష్ణ వీరపనేని మాంగో మీడియా అధినేతగా ఉన్నారు. ఆయనకి దిల్ రాజుతో బిజినెస్ లో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఐటీ అధికారులు ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించారట. మరి ఈ సోదాల్లో ఏం బయటపడ్డాయి ? నిర్మాతలు రహస్యంగా దాచిన లెక్కలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది.