- Home
- Entertainment
- మైత్రి నిర్మాతలకు వందల కోట్ల భూములు, సుకుమార్ కి కూడా వాటా ?.. ఐటీ అధికారుల అనుమానాలు ఇవే
మైత్రి నిర్మాతలకు వందల కోట్ల భూములు, సుకుమార్ కి కూడా వాటా ?.. ఐటీ అధికారుల అనుమానాలు ఇవే
గత రెండు రోజుల నుంచి మైత్రి నిర్మాణ సంస్థ నిర్మాతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు.

గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలపై కన్నేసి ఉంచారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనుమానాలు వచ్చినప్పుడల్లా రంగంలోకి దిగేస్తున్నారు. నిర్మాతల ఇళ్లపై, ఆఫీస్ లపై సోదాలు చేయడం సహజమే కానీ ఈసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఐటీ అధికారులకు టార్గెట్ గా మారారు.
గత రెండు రోజుల నుంచి మైత్రి నిర్మాణ సంస్థ నిర్మాతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. రెండు రోజుల నుంచి ఐటీ అధికారులు తమ ఆపరేషన్ కొనసాగుతూ మైత్రి సంస్థ లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఐటీ అధికారులు రెండు రోజులుగా జరిపిన సోదాల్లో అనేక విషయాలు గుర్తించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైత్రి నిర్మాణ సంస్థ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వీరి నిర్మాణంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప 1 లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.
ప్రస్తుతం ఈ సంస్థ నిర్మాణంలో పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాల పెట్టుబడులు, ఆదాయం లాంటి వ్యవహారాల గురించి ఐటీ అధికారులు సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మైత్రి నిర్మాతలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి సంస్థలో కొందరు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
అలాగే ఇటీవల కొన్నేళ్లలో మైత్రి నిర్మాతలు మొయినాబాద్, శంకర్ పల్లి లాంటి ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్.. భారీ చిత్రాల నిర్మాణం కోసం ముంబైలో ఫైనాన్షియర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలకు సంబందించిన సరైన డాక్యుమెంట్స్ లేవని ఐటి అధికారులు గుర్తించారట.
అలాగే నిబంధనల్ని ఉల్లంఘించి విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ వ్యక్తిగత ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారట. పుష్ప చిత్రం కోసం మైత్రి సంస్థతో సుకుమార్ ఎలాంటి ఇప్పందాలు చేసుకున్నారో తెలపాలని కోరినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ సుకుమార్ కూడా సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రస్తుతం మైత్రి సంస్థలోనే సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.రంగస్థలం చిత్రం నుంచి సుకుమార్ మైత్రి సంస్థతో అసోసియేట్ అవుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రం కూడా మైత్రి నిర్మాణంలోనే తెరకెక్కింది. అప్పటి నుంచి సుక్కు నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. దీనితో మైత్రి నిర్మాతలు కొనుగోలు చేసిన వందల కోట్ల ఆస్తుల్లో సుకుమార్ కి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఆ దిశగా సుక్కు ఆస్తుల చిట్టా విప్పుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రిలీజ్ కాబోతున్న సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంలో కూడా సుకుమార్ వాటాదారు.