- Home
- Entertainment
- నా అందంపై ఆ హీరో కన్నేశాడు.. ఒంటరిగా రమ్మని నొక్కి మరీ చెప్పాడు, 45 ఏళ్ళ హీరోయిన్ హాట్ కామెంట్స్
నా అందంపై ఆ హీరో కన్నేశాడు.. ఒంటరిగా రమ్మని నొక్కి మరీ చెప్పాడు, 45 ఏళ్ళ హీరోయిన్ హాట్ కామెంట్స్
90వ దశకం చివర్లో కెరీర్ ప్రారంభించిన హాట్ బ్యూటీ ఇషా కొప్పికర్ తెలుగు వారికీ కూడా పరిచయమే. నాగార్జున చంద్రలేఖ, వెంకటేష్ ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది.

Isha Koppikar
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అయితే ఆడిషన్స్ పేరుతో లైంగిక వేధింపులు కూడా జరుగుతాయని చాలా మంది నటీమణిలు తమ చేదు అనుభవాలని గతంలో బయట పెట్టారు. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల్లో హీరోయిన్ల పై జరుగుతున్న వేధింపులు చాలా వరకు బయట పడ్డాయి.
Isha Koppikar
90వ దశకం చివర్లో కెరీర్ ప్రారంభించిన హాట్ బ్యూటీ ఇషా కొప్పికర్ తెలుగు వారికీ కూడా పరిచయమే. నాగార్జున చంద్రలేఖ, వెంకటేష్ ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్ళు. అయినప్పటికీ ఇషా కొప్పికర్ చెరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటోంది.
Isha Koppikar
కెరీర్ ఆరంభంలో తనకి కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఇషా కొప్పికర్ తెలిపింది. కానీ తాను ఎవరికీ తల వంచలేదని, ప్రలోభాలకు గురి కాలేదని ఇషా కొప్పికర్ పేర్కొంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా వ్యక్తిత్వం కనిపించాలి. అందుకే నేను ఎక్కడా తగ్గలేదు.
Isha Koppikar
నాకు అవకాశాలు రావాలంటే నా అందం, నటన మాత్రమే ముఖ్యం అని భావించాను. కానీ కొందరు హీరోల కంట్లో ఉంటామని నాకు తెలియదు. ఒక రోజు నిర్మాత ఫోన్ చేసి ఆ హీరో లిస్టులో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పారు. ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. తెలుసుకుందామని ఆ హీరోకి ఫోన్ చేశాను.. దీనితో అతడు నన్ను ఒంటరిగా రమ్మని.. స్టాఫ్ ని ఎవరిని తీసుకుని రావద్దని నొక్కి మరీ చెప్పాడు.
Isha Koppikar
దీనితో అతడు నా అందంపై కన్నేశాడని అర్థం అయింది. దీనితో నిర్మాతని పిలిచి.. నేను అవకాశాల కోసం ఇలా దిగజారుతానని ఎలా అనుకున్నారు. నా అందం, పనితనం వల్లే నాకు అవకాశాలు వస్తాయి అంటూ కడిగి పారేశాను. దీనితో ఆ నిర్మాత నన్ను సినిమా నుంచి తొలగించారు అని ఇషా కొప్పికర్ పేర్కొంది.
Isha Koppikar
ఇషా కొప్పికర్ 1998లో చంద్రలేఖ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఇషా వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె హాట్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు అంటే అతిశయోక్తి కాదు.