విశాల్ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదేనా..? అసలు విశాల్ కు ఏమయ్యింది..?
రీసెంట్ గా హీరో విశాల్ ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవ్వడంతో పాటు కుమిలిపోతున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉండే హీరో.. నడవడానికే ఇబ్బందిపడుతూ కనిపించాడు. అసలు విశాల్ కు ఏమయ్యింది..? విశాల్ పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి దీనికి లింక్ ఏంటి..?
Vishal
రీసెంట్ గా విశాల్ ఒకప్పుడు నటించిన మదగజరాజా సినిమా చాలా కాలం తరువాత రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు సబంధించిన ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అంతా షాక్ అయ్యారు. ఎంత స్ట్రాంగ్ గా ఉండే విశాల్ సన్నగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.చాలా వీక్ అయిపోయిన విశాల్ నడవలేక, మాట సరిగ్గా రాక.. మైక్ పట్టుకున్నా వణుకుతూ కనిపించారు. దాంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అవ్వడంతో పాటు మా హీరోకు ఏమయ్యింది అంటూ కుమిలిపోయారు.
విశాల్ కు ఏదైనా వ్యాధి ఉందా అన్నా నుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని. అందుకే అలా అయిపోయారని.. వైరల్ ఫీవర్ మూలగానే విశాల్ అలా కనిపిప్తున్నారంటూ మరో మాట బయటకు వచ్చింది. మదగజరాజ సినిమా ఈవెంట్ కోసమే.. ఆయన కష్టమైనా వచ్చారని ఆయన టీమ్ నుంచి వచ్చిన సమాచారం.
అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్ కు సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డూప్ లేకుండా స్ట్రంట్స్ చేసేవారు. ఈక్రమంలో ఓ షూటింగ్ లో ఆయన తలకు దెబ్బ తగడం వల్ల లోపల రెండు నరాలు డామేజ్ అయ్యాయని, దాంతో ఆయనకు తీవ్రమైన తలనొప్పి వస్తుండేదట.దాంతో విశాల్ విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడట.
vishal Engagement
ఇక ఈ ఇబ్బంది వలనే ఆయన పెళ్ళి చేసుకోవడంలేదు అని మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే రెండు సార్లు విశాల్ పెట్టి క్యాన్సిల్ అయ్యింది. అప్పట్లో.. అర్జున్ రెడ్డి సినిమాలో నటించి అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. కాని పెళ్ళి టైమ్ వచ్చే వరకూ అది క్యాన్సిల్ అయ్యింది. అయితే విశాల్ స్వయంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాడన్న రూమర్స్ కూడా వస్తున్నాయి.
తనకు ఉన్న ఈ ప్రాబ్లమ్ వల్ల.. ఆయనే పెళ్ళి వద్దు అనుకున్నారట. ఇది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా యాక్ట్రస్ కుష్బు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశాల్ కు ఏమీ కాలేదు. ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చింది. దాంతో అలా అయిపోయారు. 104 ఫీవర్ రావడంతో వణుకుతూ ఉన్నారు. తన సినిమా ఈవెంట్ మిస్ అవ్వకూడదు అనే విశాల్ అక్కడికి ఓపిక లేకపోయినా వచ్చారు.
ఈవెంట్ అయిపోగానే డైరెక్ట్ గా హాస్పిటల్ కు విశాల్ వెళ్ళిపోయారు అని అన్నారు కుష్బు. అయితే ఈ విషయంలో వస్తున్న రూమర్స్ లో ఎటువంటి నిజం లేదన్నారు. వైరల్ న్యూస్ ల కోసం రకరకాలుగా రూమర్స్ సృష్టిస్తుంటారు. అది ఒక సీజన్ లా తయారయ్యింది. వాటిని పట్టించుకోనవసరం లేదు అన్నారు ఖుష్బు.