MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: సమంత మళ్లీ తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోనుందా.? ఇంతకీ ఎవరా వ్యక్తి, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..

Samantha: సమంత మళ్లీ తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోనుందా.? ఇంతకీ ఎవరా వ్యక్తి, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..

సమంత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వ్యక్తిగత జీవితంలోపాటు కెరీర్ పరంగా నిత్యం వార్తల్లో ఉంటుంది సామ్‌. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ సామ్‌ మళ్లీ హెడ్ లైన్స్‌లోకి రావడానికి కారణం ఏంటంటే..  

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 19 2025, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Samantha

Samantha

2010లో 'ఏం మాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయైన అందాల తార సమంత. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలిందని చెప్పాలి. సౌత్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిందీ చిన్నది. ఈ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న నాగచైతన్యతో లైఫ్‌ షేర్‌ చేసుకున్న సామ్‌ అక్కినేని కోడలిగా మారింది. అయితే ఆ తర్వాత విడాకులతో ఒక్కసారిగా అభిమానులకు షాక్‌కి గురి చేసింది. తాము విడిపోతున్నామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సంచలనం సృష్టించారు. 
 

24

అనంతరం మయోసైటిస్‌ బారిన పడడం, సినిమాలకు దూరమయ్యారు. అయితే మయోసైటిస్‌ నుంచి విజయవంతంగా బయటపడ్డ సమంత ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టిసారించారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫ్యామిలీమ్యాన్‌, సిటాడెల్‌లో పనిచేసిన దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

34

ఈ క్రమంలోనే తాజాగా ప్రేమికుల దినోత్సవం రోజున సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఈ వార్తలకు బలం చేకూర్చింది. సమంత ఓ వ్యక్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో సామ్‌ నిజంగానే ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే రాజ్‌ నిడిమోరు ఎవరనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇంతకీ సమంతకు రాల్‌ ఎలా పరిచయమయ్యారు.? అసలు అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.? రాజ్‌ నిడిమోరుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

44

మన తెలుగువాడే.. 

రాజ్ నిడిమోరు మన తెలుగు వ్యక్తే అని మీలో ఎంత మందికి తెలుసు. రాజ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో జన్మించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే కొన్నేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. అయితే ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో భారత్‌కు వచ్చిన రాజ్‌ నిడిమోరు స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్‌ ఫిల్స్మ్‌ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఇందులో భాగంగా మొదట షాదీ అనే షార్ట్‌ ఫిలింను తెరకెక్కించారు.

ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు సిరీస్‌లకు మంచి ఆదరణ లభించింది. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ సమయంలోనే సమంతకు రాజ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో మొదలైన స్నేహమే ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్‌ నిడిమోరుకు ఇప్పటికే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. మరి సమంత నిజంగానే రాజ్‌ నిడిమోరుతో ఏడు అడుగులు నడవనుందా.? సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ఈ చర్చలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అటు సమంత కానీ, ఇటు రాజ్‌ కానీ అధికారికంగా స్పందించాల్సిందే. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Recommended image3
సుడిగాలి సుధీర్ ఎంత పిసినారో తెలసా? రూపాయి కూడా ఖర్చు పెట్టడా? ఆటో రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved