MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమెకేం తక్కువా... నాగ చైతన్య చేసుకుంటే సమంత చేసుకోదా... ఇదంతా వాళ్ళ పనేనా?

ఆమెకేం తక్కువా... నాగ చైతన్య చేసుకుంటే సమంత చేసుకోదా... ఇదంతా వాళ్ళ పనేనా?

సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమె వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ ఎక్కువైంది. మీడియాలో పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 22 2022, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha


35 ఏళ్ల సమంత రెండో పెళ్ళికి సిద్దమవుతున్నారనేది తాజా వార్త. ఆధ్యాత్మికవేత్త సద్గురు బాబా దీని వెనకున్నారట. ఆయన సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనేది టాక్. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమంత మనసు మార్చి ఆయన సిద్ధం చేశారట. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈ వార్తల్లో నిజం ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం. ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న పుకారు అంటున్నారు. స్వయంగా సమంత పీఆర్ టీం కూడా ఈ న్యూస్ వెనుక ఉండే అవకాశం కలదు. ఒక ప్రక్క నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వెలువడుతుండగా, సమంత పెళ్లి తెరపైకి తెచ్చారని అంచనా. 

36


బలమైన కారణంతో విడిపోయిన నాగ చైతన్య-సమంత ఒకరిపై మరొకరు బాగా కోపంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమ పిఆర్ ల ద్వారా ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేయిస్తున్నారనే వాదన ఉంది. విడాకుల సమయంలో సమంతపై అనేక ఆరోపణలు వచ్చాయి. అవన్నీ నాగ చైతన్య టీమ్ మీడియాకు లీక్ చేసి ప్రచారం చేయించారని సమంత నమ్ముతున్నారు.
 

46

 
ఈ మధ్య నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అఫైర్ నడుపుతున్నాడన్న వార్త గుప్పుమంది. ఈ ప్రచారం చేయించింది సమంత పిఆర్ టీమ్ ని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ ఆరోపణలపై సమంత నేరుగానే స్పందించారు. ఒక అమ్మాయి మీద వచ్చే పుకార్లు నిజాలు... అబ్బాయి మీద వస్తే అవి ఉద్దేశపూర్వకంగా ఒక అమ్మాయి చేయిస్తున్నట్లు...  అని అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ పోస్ట్ చేసింది. 

56

ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లి వార్తల వెనుక ఆమె పిఆర్ టీం ఉండవచ్చని అంచనా. నాగ చైతన్య ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ధీటుగా సమంత పెళ్లి పుకార్లు తెరపైకి తెచ్చారు అంటున్నారు.

66


సమంత ప్రస్తుత వయసు 35 ఏళ్ళు కాగా... ఆమె లేట్ చేయడానికి ఆస్కారం లేదు. మరోవైపు గత అనుభవాల రీత్యా సమంత ఇకపై పెళ్లి చేసుకోకూడని నిర్ణయించుకున్నారనే వాదన కూడా ఉంది. పెళ్లి తప్పించుకోవడం కోసం ఆమె గర్భాశయం తొలగించుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. రోజుకో విషయం తెరపైకి వస్తున్న తరుణంలో వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image2
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
Prabhas: ఆయన చేయేస్తే 100 కోట్లు, ప్రభాస్ పై సమంత సంచలన వాఖ్యలు, ఎందుకలా అన్నదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved