MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • సర్పైజ్: “కల్కి”లో ఎన్టీఆర్? ఆ పాత్రలోనే, అందుకే నాగ్ అశ్విన్ కు అంత థీమా

సర్పైజ్: “కల్కి”లో ఎన్టీఆర్? ఆ పాత్రలోనే, అందుకే నాగ్ అశ్విన్ కు అంత థీమా

ఎన్నో అంచనాలతో మరి కొద్ది గంటల్లో రిలీజ్ కి రాబోతున్న   “కల్కి 2898 ఎడి” గురించిన ప్రతీ విషయం ఆసక్తిగానే ఉంటోంది. సినిమాలో చాలా సర్పైజ్ లు ఉన్నాయని వినికిడి. 

3 Min read
Author : Surya Prakash
Published : Jun 26 2024, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Kalki

Kalki


గత కొన్ని రోజులుగా, కల్కి 2898 AD’ సినిమా గురించిన కబుర్లే వినపడుతున్నాయి. మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా అవుతూండటంతో ఈ సినిమాలో ఏమేమి విశేషాలు అన్నాయనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   మరోవైపు ఈ చిత్రానికి గ్రౌండ్ లెవల్‌లో భారీగా హైప్ లేదని అంటున్నారు. కానీ, అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ అయిన దగ్గర నుంచి షాక్ ఇస్తోంది. ఈ సినిమా టిక్కెట్లు దక్కించుకోవడానికి ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలనే లో ప్రొఫైల్ పబ్లిసిటీ క్యాంపైన్ ప్లే చేసారని, సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ దాచి థియేటర్ లో సర్పైజ్ ఇద్దామనే నాగ్ అశ్విన్ స్ట్రాటజీ అని చెప్తున్నారు. అలా సినిమాలో ఉన్న ఓ సర్పైజ్ ఎలిమెంట్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది. అదేమిటో చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


ప్రస్తుతం ‘క‌ల్కి’మేనియా భీబత్సంగా నడుస్తున్న ఈ సమయంలో ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వ‌చ్చినా అది సోష‌ల్ మీడియాను షేక్ చేసేస్తోంది. దానికి తోడు క‌ల్కి టీమ్ చాలా  ప్ర‌మోష‌న్ కంటెంట్ రెడీ చేసి మెల్లిమెల్లిగా వదులుతున్నారు. విడుద‌ల‌కు ముందు వారం రోజుల నుంచి ఆ కంటెంట్ అంతా మన ముందు పెడుతున్నారు. తాజాగా ‘క‌ల్కి’ నుంచి  వచ్చిన ఈ పాట ఊపేస్తోంది.  ‘క‌ల్కి’ థీమ్ మొత్తాన్ని ఈ పాట‌లో పొందుప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. ఈ పాట‌తో `క‌ల్కి`పై ఆశ‌లు, అంచ‌నాలూ మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయం. 

310

 
ఎన్నో అంచనాలతో మరి కొద్ది గంటల్లో రిలీజ్ కి రాబోతున్న   “కల్కి 2898 ఎడి” వరల్డ్ వైడ్ గా భారీగానే బిజినెస్ జరుపుకుంది.  తెలుగు సహా హిందీ, తమిళ్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ కాబోతుంది. అన్నిచోట్లా బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలా వేగంగా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పక్కర్లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. 

410


“కల్కి 2898 ఎడి”లో  ఎన్టీఆర్ సీనియర్ పెద్ద సర్పైజ్ గా కనపడనున్నారని వార్త. AI టెక్నాలిజీ వాడి ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడుగా చూపించబోతున్నారు. అశ్వనీదత్ కు సీనియర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. ఆయన బ్యానర్ పేరు వైజయంతి మూవీస్ ని కూడా ఆయనే సజెస్ట్ చేసారు. ఈ క్రమంలో కథను అనుసకరించి ఎన్టీఆర్ మరొక్కసారి శ్రీకృష్ణుడుగా చూపించబోతున్నట్లు చెప్తున్నారు. అదే నిజమైతే థియేటర్స్ దద్దరిల్లటం ఖాయం.
 

510


అప్పట్లో వెంకటేష్,సిమ్రాన్ నటించిన కలిసుందాం రాచిత్రంలోనూ ,యమదొంగ చిత్రంలోనూ సీనియర్ ఎన్టీఆర్ ని చూపించారు. ఆ రెండు సినిమాలు మెగా హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ తో ఎన్టీఆర్ ని ఏఐ టెక్నాలిజీతో మరోసారి మన ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కురుక్షేత్ర యుద్దం కొద్దిసేపు వస్తుందని అప్పుడు ఎన్టీఆర్ కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఏ మేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.   
  

610


తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న  ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

710


మరో ప్రక్క ‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయగా.. ఇప్పుడు ‘సలార్‌’ (Salaar) రికార్డును కూడా అధిగమించింది.  ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే (జూన్‌26) విడుదల కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి ప్రభాస్‌ (Prabhas) గత చిత్రం రికార్డును బ్రేక్ చేశాయి. 
 

810


‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ప్రారంభించిన గంటల్లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇక ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.
 

910


 ‘కల్కి’ ఓపెనింగ్‌ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్‌ గతంలో నటించిన ‘బాహుబలి-2’, ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సాహో’ చిత్రాలు మొదటిరోజు రూ.100కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. వీటికంటే ‘కల్కి’కి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశమున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

1010
kalki 2898 ad theme song Santhosh Narayanan prabhas Nag Ashwin

kalki 2898 ad theme song Santhosh Narayanan prabhas Nag Ashwin

జయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved