- Home
- Entertainment
- ‘ఆస్కార్ కమిటీ’ నుంచి సూర్యకు ఆహ్వానం.. అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్..
‘ఆస్కార్ కమిటీ’ నుంచి సూర్యకు ఆహ్వానం.. అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్..
తమిళ స్టార్ హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆస్కార్ ఆర్గనైజర్ మెంబర్ షిప్ కమిటీ నుంచి తాజాగా ఆహ్వానం అందింది. దీంతో ఆస్కార్ ఆహ్వానం పొందిన తొలి తమిళ స్టార్ గా సూర్య గుర్తింపు పొందాడు.

తమిళ టాలెంటెడ్ హీరో సూర్య (Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియా మొత్తం ఇష్టపడే నటుడుల్లో ఆయన ఒకరు. సినిమా సినిమాకు కొత్తదనం చూపించడం ఒక్క సూర్యకే చెల్లిందని చెప్పాలి. ఆయన ఎంచుకునే కథలు, నటించే పాత్రలు ఇతర స్టార్ హీరోల సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సూర్య ఏ సినిమా చేసిన రోటీన్ కు భిన్నంగా.. క్రియేటివ్ గా చేస్తూ వస్తున్నాడు. అందుకే ఆయనను అభిమానించే వారి సంఖ్య కూడా ఒక్కో మూవీ లెక్కన పెరుగుతూనే వస్తోంది.
సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను ప్రకటిస్తున్నారు. అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులోనూ ఆయన చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు దర్శకనిర్మాతలు. తెలుగు ఆడియెన్స్ లోనూ సూర్య మంచి ఆదరణ ఉంది. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారు. మొత్తంగా సౌత్ లో సూర్యకు గట్టి ఇమేజ్ ఉంది. ఇప్పటికే ‘ఆకాశమే నీ హద్దురా, జై భీమ్, విక్రమ్’ చిత్రాలతో సూర్య తారా స్థాయికి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా సూర్యకు ఆస్కార్ ఆర్గనైజర్ మెంబర్ షిప్ కమిటీ నుంచి ఆహ్వానం అందింది. రెండు రోజుల కింద అకాడెమీ ఆప్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 397 మంది కళాకారులను, కార్యనిర్వాహకులను క్లాస్ ఆఫ్ 2022లో భాగంగా ఆహ్వానించింది. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సూర్యను ఆస్కార్ (Oscar) ఆర్గనైజర్ మెంబర్‌షిప్ కమిటీ నుంచి ఆహ్వానం పొందారు. అయితే తొలిసారిగా ఆస్కార్ నుంచి ఆహ్వానం పొందిన తమిళ నటుడిగా సూర్య గుర్తింపు పొందాడు. అదేవిధంగా మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గానూ ముద్ర వేసుకున్నాడు.
అయితే కమిటీ నుంచి ఆయన్ని ఆహ్వానించినందుకు సూర్య స్పందించారు. వారి ఇన్విటేషన్ ను అంగీకరిస్తున్నట్టు తెలిపారు. తనను విష్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరినీ గర్వపడేలా చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాని హామీనిచ్చారు. అదేవిధంగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా తన బ్రదర్ సూర్యను అభినందించాడు. ఆస్కార్ నుంచి ఆహ్వానం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
ముఖ్యంగా సూర్య నటించిన చిత్రాల్లో పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘జై భీమ్’, సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’ నేషనల్ లెవల్ లో ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ‘జై భీమ్’ చిత్రం ఆస్కార్ అవార్డు నామినీకి కూడా ఎంపికైంది. ప్రస్తుతం ఆస్కార్ ఆర్గనైజర్ మెంబర్‌షిప్ ర్యాంక్‌లో సూర్య ఉండటం తమిళ చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద విజయనే చెప్పాలి.
బాలీవుడ్ నుంచి నటి కాజోల్, లేడీ డైరెక్టర్ రీమా కగ్టి కూడా సూర్యతో పాటు 2022 ప్రముఖ క్లాస్‌లో ఉన్నారు. ఇక ప్రస్తుతం సూర్య పలు చిత్రాలకు ప్రొడ్యూస్ చేస్తూనే.. క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. బాలా దర్శకత్వంలో వస్తున్న సూర్య 41 షూటింగ్ లో బిజీగా ఉన్నారు సూర్య. అదేవిధంగా హిందీ రీమేక్ గా వస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’చిత్రంలోనూ కనిపించనున్నారు.