MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ మదర్ శివ కుమారిలో రేర్ ట్యాలెంట్..ఎట్టకేలకు బయటకి, యంగ్ రెబల్ స్టార్ ప్రతి సారి ఏం చేస్తాడంటే.. 

ప్రభాస్ మదర్ శివ కుమారిలో రేర్ ట్యాలెంట్..ఎట్టకేలకు బయటకి, యంగ్ రెబల్ స్టార్ ప్రతి సారి ఏం చేస్తాడంటే.. 

ప్రభాస్ తల్లి పేరు శివ కుమారి. ఆమె ఎప్పుడూ బయట కనిపించలేదు. అసలు ఆమె కనీసం ప్రభాస్ సినిమాలు అయినా చూస్తారా అనే డౌటు ఫ్యాన్స్ కి ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2024, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 900 కోట్ల పైగా వసూళ్లు సాధించి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో అదరగొట్టేశాడు. క్లైమాక్స్ లో ప్రభాస్ మహాభారతంలోని ఒక వీరుడిగా కనిపించిన విధానం ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. 

26

ఫస్ట్ హాఫ్ విషయంలో కాస్త నెగిటివిటి ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఎవ్వరినీ నిరాశపరచలేదు. బుజ్జి కారుతో కలసి ప్రభాస్ రచ్చ రచ్చ చేశాడు. దీనితో ఆడియన్స్ అంతా కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. వందల కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. అతని తల్లి ఎప్పుడూ మీడియా ముందు కనిపించలేదు. 

36

ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ చాలా ఏళ్ళ క్రితమే మరణించారు. దీనితో కృష్ణంరాజు ప్రభాస్ ని టాలీవుడ్ లో నడిపించారు. కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల ఎక్కువగా మీడియా ముందు కనిపించేవారు. కల్కి రిలీజ్ తర్వాత కూడా శ్యామలాదేవి గారే ఎక్కువగా థియేటర్స్ వద్ద సందడి చేశారు. 

46

ప్రభాస్ తల్లి పేరు శివ కుమారి. ఆమె ఎప్పుడూ బయట కనిపించలేదు. అసలు ఆమె కనీసం ప్రభాస్ సినిమాలు అయినా చూస్తారా అనే డౌటు ఫ్యాన్స్ కి ఉంది. ఎట్టకేలకు ఆ అనుమానాన్ని శ్యామలాదేవి తీర్చారు. శివ కుమారి గారు బయట కనిపించరు కానీ ఆమెకి రేర్ ట్యాలెంట్ ఉందట. సినిమాలు బాగా చూస్తారట. చూడడం మాత్రమే కాదు.. ఆ సినిమాని పక్కాగా అనలైజ్ చేస్తారట. ఏది బావుంది.. ఏం బాగాలేదు.. ఈ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయాన్ని ఆమె పక్కాగా చెబుతారట. 

56

తన చిత్రం రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ తన తల్లి కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారట. ఆమె చూసి సినిమా ఎలా ఉందో చెప్పేస్తారు. బాగాలేని సినిమాని కూడా బావుందని చెప్పడం ఉండదు. బాగాలేకుంటే బాగాలేదు అని ముఖం మీదే చెప్పేస్తారట. 

66

ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ కూడా నిర్మాతగా చేశారు. కాబట్టి శివకుమారి గారికి ఆ ట్యాలెంట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే బయట జనాలు ఏమనుకుంటున్నారు అని నాతో ఆమె డిస్కస్ చేస్తారు అని శ్యామల దేవి తెలిపారు. ఇప్పుడు కల్కి గురించి బయట విశేషాలన్నీ నేను ఆమెకి చెప్పాలి అంటూ శ్యామల దేవి నవ్వుతూ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: తమ్ముడి కవల పిల్లల బర్త్ డే వేడుకలో మహేష్‌ బాబు నమ్రత సందడి.. నయా లుక్‌లో అదరగొడుతున్న ప్రిన్స్
Recommended image2
Vijay Trisha Marriage: ఎన్నికల తర్వాత విజయ్-త్రిష పెళ్లి? హింట్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌ తల్లి ?
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ వేలు పెట్టారా ? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇదే..హరీష్ శంకర్ ఓపెన్ గా ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved