రియల్ హీరో సోనూసూద్ జీవితం గురించిన ఆసక్తికర అంశాలు
ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం, వేరే ప్రదేశంలో చిక్కుబడిపోయాము అంటే ఇంటికి చేరుస్తున్నాడు సోనూసూద్. ఒకరకంగా సహాయం అని అర్థించిన అందరికి సహాయం చేస్తున్నాడు. ప్రజలు ప్రభుత్వాలను అడగడం వదిలేసి ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ను సాధారణ ప్రజలు అడుగుతుండడం విశేషం.
లాక్ డౌన్ హీరో సోనూసూద్, లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.... తన దాన ధర్మాలనయితే కొనసాగిస్తున్నాడు. తాజాగా మన చిత్తూరు రైతుకు ట్రాక్టర్ ఇచ్చి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సోనూసూద్ ని చూసినప్పుడు అసలు అతని చేతికి ఎముక అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది.
ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం, వేరే ప్రదేశంలో చిక్కుబడిపోయాము అంటే ఇంటికి చేరుస్తున్నాడు సోనూసూద్. ఒకరకంగా సహాయం అని అర్థించిన అందరికి సహాయం చేస్తున్నాడు. ప్రజలు ప్రభుత్వాలను అడగడం వదిలేసి ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ను సాధారణ ప్రజలు అడుగుతుండడం విశేషం.
సోషల్ మీడియాలో అయితే ఏకంగా పన్నులు కూడా సోనూసూద్ కే కట్టమంటారా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా అందరి మన్ననలను అందుకుంటున్న సోను సూద్ జీవిత విశేషాలు మీకోసం.
సోనూ సూద్ పంజాబ్‌లోని మోగాలో జూలై 30, 1973న ఓక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శక్తి సాగర్ సూద్ వ్యాపారం చేసేవారు. తల్లి సరోజ్ సూద్ ఉపాధ్యాయినిగా పనిచేసేది. సోనూ సోదరి మోనికా సూద్ ప్రస్తుతం సైంటిస్టుగా పనిచేస్తున్నారు.
చిన్ననాటి నుండే సోనూసూద్ కష్టజీవి. సాయంత్రం బడి నుండి రాగానే తండ్రి దుకాణంలో కూర్చునేవాడు. ఆ తరువాత ఉన్నత విద్యాభ్యాసం కోసం మహారాష్ట్ర వెళ్ళాడు. యశ్వంత్ చవాన్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు.
కాలేజీ లో చదివే రోజుల్లోనే ఆయన ఒద్దుపొడువు మంచిగా ఉండడంతో మోడలింగ్ వైపుగా అడుగులు వేసాడు. అలా చిన్నగా షోస్ లో పాల్గొనడం మొదలుపెట్టాడు. మోడలింగ్ కెరీర్ లో ఆయన తొలి సంపాదన 500 రూపాయలు. దానితో జీన్స్ కొన్నాడు.
నాగపూర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం నిమిత్తం ముంబైలో అడుగుపెట్టాడు. మిత్రులతో కలిసి ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవాడు. ఆయన ఉద్యోగంలో ఫీల్డ్ వర్క్ నిమిత్తం తరచుగా ప్రయాణించాల్సి వచ్చేది. దానితో ఆయన ట్రైన్ పాస్ తీసుకున్నాడు. ఆ కాలంలో ఆయన ఉద్యోగం 4,500 రూపాయలు.
చాలీచాలని జీతంతో ముంబై మహానగరంలో బిక్కుబిక్కుమనుకుంటు కాలం వెళ్ళదీస్తూనే మోడలింగ్ కెరీర్ వైపుగా దృష్టి సారించాడు. గ్రాసిమ్ సూటింగ్స్ నిర్వహించిన మిస్టర్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5 లో నిలిచాడు. ఇక అలా యాక్టింగ్ వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు.
అప్పుడప్పుడే యాక్టింగ్ రంగంలో స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్న సోనూసూద్ కి వివాహమైంది. సోనాలి అనే యువతిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తొలినాళ్ళలో సోనూసూద్ కష్టపడ్డప్పటికీ... ఆయన భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలను పంచుకుంది.
సోనూసూద్ సినిమా ఇండస్ట్రీలోకి దక్షిణాది నుంచే ఎంట్రీ ఇచ్చాడు. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మూడు సంవత్సరాలకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తెలుగులో అరుంధతి సినిమాలో సోనూసూద్ నటన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ చిత్రంలో ఆయన పశుపతి పాత్రలో జీవించాడు.
2016లో సోను చైనీస్ చిత్ర పరిశ్రమలోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే నటనతో అదరగొట్టి జాకీచాన్ తో మంచి సంబంధం ఏర్పరుచుకున్నారు. సినెమాలతోపాటుగా పలు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు సోనూసూద్. సొంతగా తండ్రిపేరు మీద శక్తిసాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను సైతం నెలకొల్పాడు.
సోనూసూద్ కి ఒక్క అవలక్షణం కూడా లేదు. మందు ముక్క సిగరెట్ ఏవీ అలవాటు లేవు. ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మూగజీవాలపై ప్రేమ ఎక్కువ. దేవుడిపై కూడా భక్తి ఎక్కువ. ప్రత్యేకించి వినాయకుడంటే అధికమైన ఇష్టం.
సోనూసూద్ కి ట్రావెలింగ్ అంటే అధికంగా ఇష్టం. ఆయన కు లగ్జరీ కార్లపై మోజు ఎక్కువ. మణికర్ణిక చిత్రం నుంచి మధ్యలోనే వైదొలిగాడు. అప్పట్లో ఆ సినిమా విషయంలో కంగనా సోనూసూద్ మీద ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.