ఇతనే షారుఖ్ ఖాన్ డూప్.. దేవుడా, సంపాదన మీడియం రేంజ్ హీరోయిన్ల కంటే ఎక్కువే
కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
ఆడియన్స్ నుంచి వస్తున్నరెస్పాన్స్ కి తగ్గట్లుగానే వసూళ్లు కూడా నమోదవుతున్నాయి. రెండు రోజుల్లోనే ఈ చిత్రం 250 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. దీనితో షారుఖ్ ఖాతాలో మరో బిగ్ విక్టరీ ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. జవాన్ చిత్రంతో షారుఖ్ ఖాన్ కి గత 15 ఏళ్లుగా డూప్ గా నటిస్తున్న ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్డె. షారుఖ్ కి డూప్ అయినప్పటికీ రచయితగా, దర్శకుడిగా , నిర్మాతగా కూడా ప్రశాంత్ రాణిస్తున్నాడు. ఆ రేంజ్ లో ప్రశాంత్ సంపాదన ఉంది.
తాజాగా ప్రశాంత్ జవాన్ చిత్ర విశేషాలని పంచుకున్నాడు. షారుఖ్ ఖాన్ కి తాను ఈ చిత్రంలో పలు సన్నివేశాల్లో డూప్ గా చేశానని తెలిపాడు. షారుఖ్ ఖాన్ తండ్రిగా క్లోజప్ గా కనిపించాల్సి వస్తే నేను కొడుకుగా.. ఆయన కొడుకుగా కనిపించాల్సి వస్తే నేను తండ్రిగా చేసినట్లు ప్రశాంత్ తెలిపారు.
షారుఖ్ కి డూప్ గా చేస్తున్నందుకు ప్రశాంత్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. మీడియం రేంజ్ హీరోయిన్లకంటే షారుఖ్ డూప్ ప్రశాంత్ సంపాదనే ఎక్కువ. ఒక రోజుకు ప్రశాంత్ రూ 30 వేలు తీసుకుంటాడట. అంతే సినిమా మొత్తం పూర్తయ్యే సరికి అతడి సంపాదన 30 లక్షల వరకు ఉంటుంది. ప్రశాంత్ సంపాదన కి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
జవాన్ చిత్రం సూపర్ సక్సెస్ కావడంతో షారుఖ్ డూప్ ప్రశాంత్ కూడా ఫేమస్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశాంత్ పిక్స్ షేర్ చేస్తూ ఇతడే షారుఖ్ బాడీ డబుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.