కేజీఎఫ్ లో సూపర్ అన్నారు.. కానీ 'టైగర్ నాగేశ్వర రావు'పై విమర్శలు.. ఎందుకిలా?
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కించారు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కించారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేయగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించారు. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నేడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. రవితేజ నటన, టెక్నికల్ అంశాలు బ్రిలియంట్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. టైగర్ నాగేశ్వర రావు పాత్రకి కావాల్సిన విధంగా రవితేజ మాస్ యాటిట్యూడ్ తో అదరగొట్టారు.
కానీ మితి మీరిన యాక్షన్, కొన్ని నమ్మశక్యం కానీ సన్నివేశాల వల్ల ఈ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ కూడా వస్తోంది. అంతే కాదు టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని కెజిఎఫ్ తో పోల్చుతూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ కూడా సాగుతోంది. కొన్ని సన్నివేశాలని కెజిఎఫ్ తో సమానంగా తెరకెక్కించి మెప్పించారు అని ఆడియన్స్ అంటున్నారు.
అందులో ముఖ్యమైనది రవితేజ ఎంట్రీ. రవితేజ ఎంట్రీ సీన్ ని గూస్ బంప్స్ తెప్పించే విధంగా దర్శకుడు ప్లాన్ చేసి అదరగొట్టారు. అయితే కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉన్నాయనే విమర్శ కూడా తలెత్తుతోంది. కేజీఎఫ్ చిత్రంలో హీరో ఏకంగా పార్లమెంట్ కి వెళ్లి విలన్ షూట్ చేసి చంపుతాడు. వాస్తవంగా అయితే అది అసాధ్యం. కానీ ఆ సీన్ థియేటర్స్ లో క్లాప్స్ కొట్టించింది.
దానికి కారణం రాఖీ భాయ్ పాత్రకి ముందు నుంచి ఇస్తున్న ఎలివేషన్. ప్రధాన మంత్రిని కూడా వణికించగల సత్తా ఉన్నోడు రాఖీ భాయ్ అని చెప్పేందుకు డైరెక్టర్ చాలా సన్నివేశాలతో ఎలివేషన్ బిల్డప్ చేశారు. అందువల్ల రాఖీ భాయ్ పార్లమెంట్ కి నేరుగా తుపాకీ పట్టుకుని వెళ్లినా ఆడియన్స్ ఆశ్చర్యపోలేదు.
kgf 2
కానీ ఇదే తరహా సన్నివేశం టైగర్ నాగేశ్వర రావు లో బెడిసి కొట్టింది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టైగర్ నాగేశ్వర రావు కి భయపడి ప్రధాన మంత్రి సెక్యూరిటీని కూడా పెంచండి అంటూ ట్రైలర్ లో చూపించారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయి. కానీ అవి మెప్పించలేదు సరికదా ఏమాత్రం లాజిక్ లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని బోల్తా కొట్టించి టైగర్ నాగేశ్వర రావు దొంగతనం చేసినట్లు.. ఆయన గొప్పతనం తెలుసుకుని ఇందిరా గాంధీ అభినందించినట్లు టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో చూపించారు. ఇవన్నీ ఏమాత్రం సూట్ కాలేదు అని ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే టైగర్ నాగేశ్వర రావు నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దొంగ కాదు. అతడి ప్రభావం ఆంధ్ర,తమిళనాడు వరకే పరిమితం.
టైగర్ నాగేశ్వర రావు ఇక్కడ పోలీసులని ముప్పు తిప్పలు పెట్టి ఉండొచ్చు. కానీ పీఎం సెక్యూరిటీని బోల్తా కొట్టించే సీన్ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కెజిఎఫ్ చిత్రం బయోపిక్ కాదు. కానీ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ చిత్రం. కాబట్టి వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రకు తగ్గ ఎలివేషన్ ఇచ్చి ఉంటే బావుండేది అని ఆడియన్స్ అంటున్నారు.