'భారతీయుడు-2 ' ఓ రకంగా దిల్ రాజుకి లక్కీ, మరొక రకంగా అన్ లక్కీ
శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.

Dil raju
భారతీయుడు 2 సినిమా ట్రిమ్ చేసామన్నా మరొకటి అన్నా జనం థియేటర్స్ వెళ్లి చూసేలా కనపడటం లేదు. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి ప్లాఫ్ టాక్ వచ్చేసింది. దాంతో వీకెండ్ కలెక్షన్స్ లో బాగా డ్రాప్ కనపడింది. ఓపినింగ్స్ ఫరవాలేదనిపించినా శనివారం నాటికే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి మొత్తం దెబ్బ కొట్టేసింది. కలెక్షన్లు చూసుకున్న శంకర్ టీమ్ వెంటనే నష్ట నివారణ చర్యలతో రంగంలోకి దూకింది. ఎక్కడ ఈ సినిమా బోర్ కొడుతోందో జనాలు కామెంట్స్ ,రివ్యూలూ చూసుకుని ట్రిమ్ చేసారు. అయినా లాభం లేదు.
మరో ప్రక్క శంకర్ మీద ఓరేంజిలో ట్రోలింగ్ మొదలైంది. భారతీయుడు 2 (ఇండియన్ 2)ని, బాలయ్య చిత్రం ఒక్క మగాడు తో పోల్చుతూ కామెడీ చేసేసారు. ముఖ్యంగా కమల్ హాసన్ గెటప్స్, లుక్స్, సిద్దార్థ్ ఓవర్ యాక్షన్ మీద ట్రోలింగ్ నడించింది. చాలా మంది భారతీయుడు 2 చూసి వచ్చి ...దాని తలనొప్పి నుంచి బయిటపడటానికి భారతీయుడు 2 చూడాల ంటూ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీని తెలుగులో అందరూ తిరస్కరించారు. తమిళంలోనూ అంతంతమాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి.
అయితే ఇదే సమంయలో దిల్ రాజు ప్రస్తావన మొదలైంది. ఈ సినిమాని మొదట ప్రొడ్యూస్ చేయాల్సింది దిల్ రాజే. ‘ఇండియన్ 2’ సినిమా ఆఫర్ వచ్చింది. అన్ని ఓకే అనుకుని ఎగ్రిమెంట్ పై సంతకం కూడా చేశాడు. శంకర్ చూపించిన ఆలస్యానికి , సినిమాకు పెడుతున్న భారీ బడ్జెట్ కారణంగా దిల్ రాజు సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు దిల్ రాజు అదృష్టవంతుడు అంటున్నారు.
ఇండియన్ 2 వద్దనుకున్న తర్వాత దిల్ రాజుకి మరో సినిమా కథ చెప్పాడు శంకర్. దీనికి దిల్ రాజు నచ్చి ఓకే చేసాడు. అదే ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా నిజంగా దిల్ రాజు కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా అవుతుందని అంతా అంటున్నారు. అయితే భారతీయుడు 2 రిజల్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా బిజినెస్ పై పడుతుందని ప్రచారం జరుగుతోంది.
మాములుగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే..దాని ఎఫెక్ట్ వాళ్లు చేసే తదుపరి చిత్రంపై కచ్చితంగా ఉంటుంది. ఆ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్ చేసి ఉంటే.. సదరు హీరోకు, వాళ్ల అభిమానులకు టెన్షన్ తప్పదు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్ పట్టుకన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూసి వారు కంగారుపడుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కావడంతో రీలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్‌పై ఒత్తిడి తెచ్చారు. అప్‌డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడయా వేదికగా శంకర్‌కి, నిర్మాత దిల్‌రాజ్‌కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్.. ఇప్పట్లో రిలీజ్ వద్దంటూ రిక్వెస్ట్ లుచేస్తున్నారని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా దిల్ రాజు కు కొత్త తలనొప్పి.
Dil Raju
ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వం, దిల్ రాజు వంటి అగ్రనిర్మాత ఈ సినిమాకు నిర్మిస్తుండటంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వస్తున్న లీక్డ్ ఫోటోలు, వీడియోలు మరింత ఆసక్తిని పెంచాయి. అలా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ముందు నుంచి స్లో స్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తయిన మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇప్పటి వరకు శంకర్ 'ఇండియన్ 2' మూవీ రిలీజ్ నేపథ్యంలో బిజీ అయిపోయారు. ఇక మూవీ రిలీజ్ అయ్యింది. ఇక గేమ్ ఛేంజర్‌పై ఫోకస్ పెట్టి చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక మూవీ అవుట్ పుట్ చూసి, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ పూర్తి చేసి మూవీ రిలీజ్ డేట్ డిసైడ్ చేసి అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ స్పష్టం చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న
మరో ప్రక్క ట్రేడ్ నుంచి కూడా గేమ్ ఛేంజర్ రిలీజ్ కాస్త గ్యాప్ తీసుకుని పెట్టుకోమని దిల్ రాజుకు సలహాలు చెప్తున్నారు. ఈ టైమ్ లో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్‌డేట్ వస్తే భారతీయుడు 2 ని అడ్డం పెట్టి .. ట్రోలింగ్ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు గేమ్ ఛేంజ్ కు సంభందించి ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్ డేట్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి అని చిత్ర యూనిట్‌కి సలహాలు ఇస్తున్నారట.
ఇక భారతీయుడు 2 చిత్రం వసూళ్లు కూడా కంగారుపడుతున్నాయి. ఈ సినిమా వీకెండ్ మూడు రోజుల్లో కేవలం 58 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. శనివారం కంటే ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి. వీకెండ్ తర్వాత ఇంకా దారుణం అయ్యిపోయింది. పాత కథ, కథనం అవ్వడంతో ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చలేదు. ఈ సినిమాని నిర్మించిన కారణంగా లైకా ప్రొడక్షన్ నష్టపోయింది. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగే అవకాసం లేదని చిత్రం బ్రేక్ ఈవెన్ కు వస్తుందని నమ్మకం పోతోందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.