లేడీ గొంతుతో ఇమ్మాన్యుయెల్ పాడిన అమ్మ పాటకి పడిపోయిన `జబర్దస్త్` వర్ష..
First Published Jan 5, 2021, 5:46 PM IST
జబర్దస్త్` ప్రోగ్రామ్‌లో ఇమ్మాన్యుయెల్, వర్ష మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరు లవర్స్ గానే ట్రీట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ `జబర్దస్త్` షోకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్.. వర్షని ఫిదా చేశాడు. తన పాటతో పడేశాడు. ఆ కథేంటో మీరే చూడండి.

ఒకప్పుడు `జబర్దస్త్` లో యాంకర్ రష్మీ, కంటెస్టెంట్ సుడిగాలి సుధీర్ మధ్య మంచి కెమిస్ట్రీ పండేది. సుడిగాలి సుధీర్ స్క్రిప్ట్ లో కచ్చితంగా రష్మీపై పంచ్‌లు వేసేవారు. ఇప్పుడు వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య అలాంటి కెమిస్ట్రీనే రన్ అవుతుంది.

చూడబోతే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఇద్దరు జోడి ఏం చేసినా అది వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?