MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 3: షాకింగ్.. అమూల్య పెళ్లి వెనుక అసలు సూత్రధారి ప్రేమ

Illu Illalu Pillalu Today Episode Feb 3: షాకింగ్.. అమూల్య పెళ్లి వెనుక అసలు సూత్రధారి ప్రేమ

Illu Illalu Pillalu Today Episode Feb 3: అమూల్యను బలవంతం చేయబోతే ఆమె తిరగబడుతుంది. కత్తితో బెదిరిస్తుంది. ఇక అమూల్య పెళ్లి వెనుక అసలు సూత్రధారి ప్రేమ అని ఈ ఎపిసోడ్లో తెలిసిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

4 Min read
Author : Haritha Chappa
Published : Feb 03 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమూల్యకు అండగా విశ్వక్ తల్లి
Image Credit : Jio hotstar

అమూల్యకు అండగా విశ్వక్ తల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజుకు ఐసీయూలో చికిత్స జరుగుతూ ఉంటుంది. డాక్టరు బయటకు వచ్చి గుండె చాలా బలహీనంగా ఉందని, ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో ఉంచామని చెబుతారు. దీంతో ధీరజ్.. ప్రేమను పట్టుకొని ఏడ్చేస్తాడు. తన నాన్న గురించి చెబుతూ ధీరజ్ తో ఎమోషనల్ అయిపోతాడు. నాన్నని ఎప్పుడూ ఇలా చూడలేదు ప్రేమ అని కన్నీరు పెట్టుకుంటాడు. నాన్నను ఇలా చావు బతుకుల మధ్య చూస్తూ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అంటూ ఏడుస్తాడు.

ఇక్కడి నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. రేవతి చాలా ప్రేమగా అమూల్యను గదిలోకి తీసుకువచ్చి ప్రేమగా మాట్లాడుతుంది. నీకు ఏది అవసరమైన నన్ను పిలువు అని చెబుతుంది. అమూల్య తన వారిని చూసేందుకు గదిలోని కిటికీలు తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ లోపు విశ్వకు వచ్చి ‘అది ఓపెన్ అవ్వదు. మీ ఇంటిని మీ ఇంట్లో వాళ్ల్ ముఖాలని మా నాన్నమ్మ చూడకూడదని మా అత్తమ్మ కిటికీలను పర్మినెంట్గా క్లోజ్ చేసింది’ అని చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమూల్యను బలవంతం చేయబోయిన విశ్వక్
Image Credit : Jio hotstar

అమూల్యను బలవంతం చేయబోయిన విశ్వక్

అమూల్య మీరెంతో మూర్ఖులో నాకు తెలుసు అని అంటుంది. వెంటనే వివ్వక్ ‘నేనెంత మూర్ఖుడినో.. నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా. ఇప్పుడు చూపిస్తాను’ అంటాడు విశ్వక్. ‘నువ్వు ఒక రోజంతా నా గదిలో ఉన్నావని.. మనిద్దరం కలిసి గడిపామని చెప్పి ఊరంతా నీ గురించి చెడుగా ప్రచారం చేసి మీ నాన్న గుండె పగిలి చచ్చేలా చేయాలనుకున్నాను. కానీ నువ్వు తాళి వేసుకొని వచ్చి మనం పెళ్లి చేసుకున్నామని అందరికీ చెప్పి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసావ్. మీ నాన్న మీద పగ తీర్చుకోవాలి అనుకున్న నా ప్లాన్ కి రివర్స్ షాక్ ఇచ్చావ్’ అని తిడతాడు. ‘మనం ఇప్పుడు మొగుడు పెళ్ళాలమా? అయితే కాపురం కూడా చెయ్యాలి కదమ్మా’ అని అంటాడు. అమూల్యను ముట్టుకోబోతే ఆమె కోపంగా దూరంగా వెళ్ళమని అరుస్తుంది.

అమూల్యను చెయ్యి పట్టుకుని బలవంతం చేయబోతాడు విశ్వక్. అమూల్య ఎంతగా వదలమన్నా వదలడు. దీంతో అమూల్య విశ్వను తోసేసి పక్కనున్న చాకు పట్టుకుని మీదకు వస్తుంది. దమ్ముంటే తనమీద చెయ్యి వెయ్యమని అంటుంది. నిన్ను చంపకపోతే నేను రామరాజు గారి కూతురినే కాదు. దమ్ముంటే నామీద చెయ్యి వేసి చూడు ఈరోజు నుంచి నాలోని అసలు వయోలెన్స్ మీ మీద చూపిస్తా.. ఇంకొకసారి నా మీద చెయ్యి వేసావ్ అనుకో నిన్ను చంపేసి నేను జైలుకు వెళ్తా అని వార్నింగ్ ఇస్తుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 2: అత్తారింటిలో అమూల్య విశ్వరూపం, భర్త మీదకే కత్తితో దాడి
Related image2
Illu Illalu Pillalu:భద్రావతి ఇంట ఎడమ కాలు పెట్టిన అమూల్య... ఆగిపోయిన రామరాజు గుండె
34
అమూల్య పెళ్లికి ప్రేమే కారణం
Image Credit : Jio hotstar

అమూల్య పెళ్లికి ప్రేమే కారణం

అప్పుడు విశ్వక్ భయపడిపోతూ నీకు ఇంత ధైర్యం లేదు, నువ్వు చాలా తెలివిగా మెడలో తాళి వేసుకొని రావడం, ఇదంతా చూస్తుంటే నీ వెనక ఎవరో ఉన్నారు అని అంటాడు. దానికి అమూల్య అవును నా వెనక ఉన్నారు అని చెబుతుంది. అది వినగానే విశ్వ అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. అమూల్య గదిలో కూర్చుని ఒంటరిగా ఏడుస్తుంది. తన తాళిని చూసుకుంటూ అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో తాళి కట్టకుండానే ఒక రోజంతా రాత్రి గదిలో ఉంచి అమూల్యను ఉదయం రామరాజు ఇంటికి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తాడు విశ్వక్. ఆ సమయంలో గదిలోనే విశ్వ ఫోను ఉంటుంది. అదే సమయానికి తన అన్న అమూల్యను కిడ్నాప్ చేశాడేమో అన్న అనుమానంతో ప్రేమ ఫోన్ చేస్తుంది. ఆ ఫోను అమూల్య లిఫ్ట్ చేస్తుంది. ప్రేమతో అమూల్య అసలు విషయం చెబుతుంది. వాడే నన్ను ఎత్తుకు వచ్చాడు, వీడు నన్ను ఎత్తుకు రావడం వెనుక అసలు కుట్ర ఏంటో తెలుసా వదినా అని మొత్తం విషయం చెబుతుంది.

‘ఒకే గదిలో కలిసి గడిపామని చెప్పడం వల్ల పెళ్లి ఆగిపోతుంది, అని మీ నాన్న పరువు పోతుందని ప్లాన్ వేశాడని చెబుతుంది. అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం కోసమే ఇప్పుడు వీడు నన్ను తీసుకొని బయలుదేరుతున్నాడు. నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటే నాన్న తట్టుకుని బతకలేరు. నేను చచ్చిపోతాను వదినా’ అని ప్రేమకు చెబుతుంది. అప్పుడు ప్రేమ ‘అమూల్య వాడు నిన్ను బెదిరించడానికి తాళి తెచ్చాడు కదా.. ఆ తాళి వాడికి కనపడకుండా నువ్వు మెడలో వేసుకో’ అని ఐడియా ఇస్తుంది. ‘వాడు నీ క్యారెక్టర్ బ్యాడ్ చేయకుండా ఉండాలంటే మీ మెడలో తాళి ఉండాలి. అదే ప్రస్తుతం ఈ సమస్య నుంచి బయట పడేసే ఐడియా’ అని చెబుతుంది. వెంటనే అమూల్య ఆ తాళి తీసి తన మెడలో తానే కట్టుకుంటుంది. ఈ విషయం అమూల్యకు, ప్రేమకు మాత్రమే తెలుసు. ప్రేమ కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది.

44
ప్రేమలో మొదలైన భయం
Image Credit : Jio hotstar

ప్రేమలో మొదలైన భయం

ఇక సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ‘అమూల్య విషయంలో నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉంది.. అమూల్యను చాలా అపురూపంగా పెంచారు మా నాన్న అమూల్య ఇంట్లోంచి వెళ్లిపోతే నాన్న ప్రాణాలతో ఉండరని తనకు తెలుసు. తెలిసి కూడా తన ఇంట్లోంచి వెళ్లిపోయిందంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా అమూల్యకు పెళ్లి చేసుకుని వచ్చే ధైర్యం లేదు. ఎవరో ఉన్నారు అమూల్య పెళ్లి చేసుకుని రావడం వెనక కచ్చితంగా ఎవరో ఉన్నారు’ అని అంటాడు ధీరజ్. అది విని ప్రేమ చాలా భయపడుతుంది. అమూల్యకు ఎవరో బలవంతంగా చెప్పడం వల్ల తన పెళ్లి చేసుకుని వచ్చిందని అంటాడు ధీరజ్.

ఆస్పత్రిలో ఇద్దరు నర్సులు రామరాజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కూతురి వల్లే ఆ రేంజ్ లో హార్ట్ ఎటాక్ వచ్చిందట అని అంటారు. అది విని చందుకి చాలా కోపం వచ్చి అమూల్యూ అన్నిటికీ కారణమని కోప్పడతాడు. మరోపక్క ధీరజ్ కూడా అమూల్య పెళ్లి వెనక ఎవరున్నారో తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టనని అంటాడు. చందు ఆవేశంగా వెళ్లడం సాగర్, ధీరజ్ చూస్తారు. తిరుపతి మాట్లాడుతూ చందు కోపంగా భద్రావతి ఇంటికి వెళుతున్నట్టు ఉన్నాడు అని చెబుతాడు. దాంతో ధీరజ్ కూడా వెనకే వెళతాడు. మరొక పక్క ఇడ్లీ బాబాయి, భాగ్యం కలిసి హ్యాపీగా హోటల్లో కూర్చుని టిఫిన్ తింటూ ఉంటారు. అక్కడికి వల్లి వస్తుంది. వల్లి టిఫిన్ తింటున్న తన అమ్మానాన్నని తిడుతూ ఉంటుంది. తర్వాత వల్లిని కూడా కూర్చోబెట్టి వారు టిఫిన్ తినిపిస్తారు. వాళ్లని నర్మద చూస్తుంది. నర్మదను చూసిందని తెలియగానే వల్లి దాక్కుంటుంది. నర్మద, వల్లి ఎందుకు నన్ను చూసి దాక్కుంది అని అనుమానిస్తుంది. ఈ లోపు ఎపిసోడ్ ఈరోజుతో ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 2: అత్తారింటిలో అమూల్య విశ్వరూపం, భర్త మీదకే కత్తితో దాడి
Recommended image2
Illu Illalu Pillalu:భద్రావతి ఇంట ఎడమ కాలు పెట్టిన అమూల్య... ఆగిపోయిన రామరాజు గుండె
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved