MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బేబీ బంప్‌లో సూపర్‌ హాట్‌గా ఇలియానా.. మిర్రర్‌ సెల్ఫీలో కిర్రాక్‌ పోజులు.. గోవా బ్యూటీ ఎంత హాట్‌గా ఉందో?

బేబీ బంప్‌లో సూపర్‌ హాట్‌గా ఇలియానా.. మిర్రర్‌ సెల్ఫీలో కిర్రాక్‌ పోజులు.. గోవా బ్యూటీ ఎంత హాట్‌గా ఉందో?

గోవా బ్యూటీ ఇలియానా.. త్వరలోనే పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఆ ఆనందంలో మునిగితేలుస్తుంది. ప్రెగ్నెన్సీ క్షణాలను ఎంజాయ్‌ చేస్తుందీ అందాల భామ. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటో మరింత ఆకట్టుకుంటుంది. 
 

Aithagoni Raju | Updated : Jul 26 2023, 11:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఇలియానా ప్రెగ్నెన్సీ  ప్రకటిస్తూ మొదటి చిన్నారి టీషర్ట్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత తన బేబీ బంప్‌తో కూడిన ఫోటోని చేసింది. కానీ అడపాదడపా ఒకటి రెండు ఫోటోలే పంచుకుంది ఇలియానా. ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తోంది. డైరెక్ట్ ఫోటోలు కాకుండా కనిపించీ కనిపించని విధంగా ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ దోబూచులాడుతూ వచ్చింది. 
 

26
Asianet Image

తాజాగా మరో బేబీ బంప్‌ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ఇలియానా. ఇందులో ఆమె నిండైన బేబీ బంప్‌తో కనిపిస్తుంది. రెడ్‌ డ్రెస్‌ ధరించింది. తన అందాల విందు కూడా చేసింది. ఇందులో చాలా హాట్‌గా కనిపిస్తుంది ఇలియానా. అయితే ఇది మిర్రర్‌ సెల్ఫీ కావడం విశేషం. ఆ సందర్బంగా ఇలియానా పోస్ట్ చేస్తూ `మై లిటిల్‌` అని ఫ్రూట్‌ ఎమోజీని పంచుకుంది. 
 

36
Asianet Image

మరి ఇలియానా లుక్‌, గెటప్‌, ఆమె పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇలియానా చాలా బ్యూటీఫుల్‌గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇలియానాకి పుట్టబోయేది అమ్మాయా? అనే ఊహాగానాలకు పని చెబుతున్నారు. మొత్తానికి ఇలియానా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి ఆమె అభిమానులను ఖుషి చేస్తుంది. 
 

46
Asianet Image

ఇదిలా ఉంటే ఇలియానాకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో మొదట్నుంచి సస్పెన్స్ లో పెట్టింది. మధ్యలో చూపించి చూపించనట్టుగా హింట్‌ ఇచ్చింది. ఇటీవల ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన ప్రియుడితో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఇలియానా అక్కడ అతడితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దీనితో ఇలియానా మిస్టరీ మాన్ వెలుగులోకి వచ్చాడు. కంప్లీట్ గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరి అతని వివరాలు మాత్రం వెల్లడించలేదు ఇలియానా. ఇంకా ఆ మిస్టరీని కంటిన్యూ చేస్తూనే ఉంది.

56
Asianet Image

గోవా బ్యూటీగా పాపులర్‌ అయినా ఇలియానా.. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది ఇలియానా. సన్నని నడుముతో టాలీవుడ్‌ని ఊపేసింది. కోట్లాది మంది అభిమానులను ఫిదా చేసింది. ఇలియానా నడుము అప్పట్లో చాలా ఫేమస్‌. అయితే కేవలం గ్లామర్‌ పాత్రలనే కాకుండా ఎంతో కొంత నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలతో మెప్పించింది ఇలియానా. 
 

66
Ileana D cruz

Ileana D cruz

అందుకే ఈ బ్యూటీ చాలా కాలం పాటు ఇండస్ట్రీలో సర్వైవ్‌ చేయగలిగింది. హీరోయిన్‌గా కెరీర్‌లో పీక్‌ స్టేజ్‌ని చూసింది ఇలియానా. అదే సమయంలో డౌన్‌ని కూడా చూసింది. ఆమె ప్రేమలో పడింది. తెలుగులో పరాజయాలు ఆమెని డౌన్‌ చేశాయి. అటు హిందీలోనూ విజయాలు దక్కలేదు. మరోవైపు ప్రేమలో పడి సినిమాలను లైట్‌ తీసుకుంది. ఇవన్నీంటి కారణంగా ఇలియానా కెరీర్‌ డిస్టర్బ్ అయ్యిందని చెప్పొచ్చు. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
మంచు విష్ణు నుంచి అది నేర్చుకోవాలి.. అన్నపై మనోజ్‌ క్రేజీ సెటైర్లు, నాన్న నుంచి నేర్చుకున్నది అదే
మంచు విష్ణు నుంచి అది నేర్చుకోవాలి.. అన్నపై మనోజ్‌ క్రేజీ సెటైర్లు, నాన్న నుంచి నేర్చుకున్నది అదే
20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?
20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?
భారీ పారితోషికం డిమాండ్‌ చేసినందుకు సినిమా నుంచి తప్పించారు.. ప్రభాస్‌ హీరోయిన్‌కి బిగ్‌ షాక్‌
భారీ పారితోషికం డిమాండ్‌ చేసినందుకు సినిమా నుంచి తప్పించారు.. ప్రభాస్‌ హీరోయిన్‌కి బిగ్‌ షాక్‌
Top Stories