MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇలియానా ప్రెగ్నెంట్‌ అయ్యాక మొదటిసారి ఫ్యాన్స్ తో ఛాట్.. ఆ ఆందోళనే వద్దంటూ గర్బవతులకు సలహా.. మధురానుభూతి..

ఇలియానా ప్రెగ్నెంట్‌ అయ్యాక మొదటిసారి ఫ్యాన్స్ తో ఛాట్.. ఆ ఆందోళనే వద్దంటూ గర్బవతులకు సలహా.. మధురానుభూతి..

ఇలియానా.. గర్బవతి అయిన తర్వాత మొదటిసారి అభిమానులతో మాట్లాడింది. తన ప్రెగ్నెన్సీ విశేషాలను పంచుకుంది. ప్రధానంగా బరువు పెరగడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇలియానా.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 25 2023, 06:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ileana

Ileana

గోవా బ్యూటీ అనూహ్యంగా ఇటీవల తాను గర్భం దాల్చినట్టు ప్రకటించిన అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రెగ్నెంట్‌కి సంబంధించిన మ్యాటర్ హాట్‌ టాపిక్‌ అయ్యింది. తండ్రి ఎవరనే ప్రశ్నలు దాడి చేశాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇలియానా. ఆ మధ్య ఓ వ్యక్తి షేడ్స్ తో ఉన్న ఫోటోలని పంచుకుంటూ హింట్‌ ఇచ్చింది. తన కడుపులో పుట్టబోయే చిన్నారికి తండ్రి అతనే అనే హింట్‌ ఇచ్చింది. కానీ అసలు విషయం దాస్తూ దోబూచులాడింది. 
 

26

గర్భం తాలూకు ఆనంద క్షణాలను అనుభవిస్తున్న ఇలియానా తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడంతో ఆందోళన చెందుతున్నారా? అనే ప్రశ్నకి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. బరువు పెరుగుతున్నారనే ఆలోచన మైండ్‌లో పెట్టుకోవద్దని, నచ్చిన ఫుడ్‌ తింటూ సంతోషంగా ఉండాలని పేర్కొంది. 

36
Ileana DCruz

Ileana DCruz

గర్భం దాల్చిన మొదట్లో ఈ ప్రశ్న నాకు వచ్చింది. నాపై ప్రభావాన్ని చూపించింది. గర్భవతిగా ఉన్నప్పుడు బరువు గురించి వ్యాఖ్యానించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోవడమే దీనికి కారణమని ఆమె తెలిపారు. కాబోయే తల్లులకు బరువు గురించి స్పృహ కలిగించడానికి వైద్యులు కూడా పరోక్షంగా కారణమవుతారు. డాక్టర్‌ చెకప్‌ కోసం వెళితే వారు ప్రతిసారి బరువు చెక్‌ చేస్తారు, అది మనలో ఆందోళన కలిగిస్తుందని చెప్పింది ఇలియానా. 

46

కానీ గర్భధారణలో జర్నీ చాలా బాగుందని, ఇదొక అద్భుతమైన ఫీలింగ్‌ అని, ఆ ఫీలింగ్‌ని వర్ణించడానికి మాటలు సరిపోవని తెలిపింది. తన శరీరంలో మార్పులను తాను అంగీకరించడం నేర్చుకున్నానని, గర్భవతిగా కొన్ని నెలల్లో చాలా మారిపోయానని, కానీ ప్రెగ్నెన్సీని ప్రేమించడం వల్ల అది పెద్ద సమస్యగా అనిపించడం లేదని, అయితే గర్భంలో ఉన్నప్పుడు మధురమైన అనుభూతలతోపాటు కష్టమైన రోజులు కూడా ఉంటాయని తెలిపింది. 

56

తనకు అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్‌ ఉంది, నన్ను ప్రేమించే నాలో ఒక చిన్న మనిషి తయారు చేస్తున్నానని గుర్తు చేసే వ్యక్తులున్నారు. దీంతో బరువు అనే పట్టింపు లేదు. తల్లులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటంపై దృష్టిపెట్టాలని, బరువు పెరగడం అనే భావన మైండ్‌ లోనుంచి తీసేయాలని తెలిపింది. మీ శరీరం ఎలా చెబితే అలా చేయండి అని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

66

ఇక హీరోయిన్‌ ఇలియానా.. టాలీవుడ్‌ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. `పోకిరి`తో బ్లాక్‌ బస్టర్ అందుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది. యంగ్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది. అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. కానీ ఆమె ప్రేమలో పడి కెరీర్‌ని డిస్టర్బ్ చేసింది. లవ్‌ ఫెయిల్యూర్‌, డిప్రెషన్‌ కారణంగా కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ ఇలియానా.. నటిగా మళ్లీ కోలుకోలేకపోయింది. సినిమా కెరీర్ స్ట్రగులింగ్‌లో సాగుతున్న నేపథ్యంలో ఆమె ప్రెగ్నెంట్‌ కావడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Recommended image3
Brahmamudi Serial Today Episode: పెద్ద ప్లానే వేసిన ఇందు, వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved